కన్నా వెంటే ఉంటా!

-పార్టీ ఆఫీసులపై దాడులు సరికావు
-బీహార్ కంటే ఘోరంగా ఏపీ
-వేదికను మళ్లీ ప్రారంభిస్తున్నాం
-మధ్య నియంత్రణ మండలి మాజీ చైర్మన్ లక్ష్మణరెడ్డి

ఈ మాటలు ఎవరో దారిన పోయే దానయ్య చెప్పినవి కాదు. గత ఎన్నికల్లో టీడీపీ ఓటమికి పనిచేసిన అనేకమంది శక్తుల్లో ఈ రెడ్డిగారొకరు. వివిధ వర్గాల్లో టీడీపీ సర్కారుపై జనంలో వ్యతిరేకత పోగు చేసి, జగన్‌ను గెలిపించేందుకు శ్రమదానం చేసిన కొందరిలో ఈయనొకరు. అంటే ఐవైఆర్ కృష్ణారావు, రమణదీక్షితులు మాదిరి అన్నమాట. జగన్ సర్కారు వచ్చిన తర్వాత శ్రమదాన ఫలితంగా ఆయనకు, మద్యనిషేధ కమిటీ చైర్మన్ పదవి కూడా ఇచ్చారు. ఆయనే ఇప్పుడు విచిత్రంగా.. జగనన్న సర్కారుపై విరుచుకుపడుతున్నారు. ఏపీ బీహార్ కంటే ఘోరంగా మారిందని వాపోతున్నారు.

బీజేపీ నుంచి టీడీపీలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లిన ఈ రెడ్డిగారు, తాను కన్నా వెంటే ఉంటానని చెప్పారు. బయటకొచ్చి మీడియాతో మాట్లాడిన ఈ రెడ్డిగారు జగన్ పాలనను దునుమాడారు. అధ్యయన వేదిక మళ్లీ పనిచేస్తుందని చెప్పారు. ఆ రెడ్డి గారే లక్ష్మణరెడ్డి. మొన్నటికి మొన్న జగన్ సీఎం కావాలని శ్రమదానం చేసిన మహాసేన రాజేష్, తర్వాత ఆయనపై తిరుగుబాటు చేసి, తాజాగా చంద్రబాబు సమక్షంలో సైకిలెక్కారు. ఇప్పుడు మరో వీరాభిమాని లక్ష్మణరెడ్డి టీడీపీలో చేరనున్న కన్నా వద్దకు వెళ్లి మద్దతు ప్రకటించారు. ఇలా జగనన్నకు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఒక్కొక్కరూ ఝలక్‌లివ్వడం వింతే మరి!ఏపీలో వస్తున్న మార్పులు మీకు అర్థమవుతోందా?

ఈయన్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తోందా ? ఈయన ఎవరో కాదు… ప్రస్తుత జగన్ రెడ్డి ప్రభుత్వంలో మధ్య నియంత్రణ మండలి చైర్మన్ గా పనిచేసిన… లక్ష్మణరెడ్డి .గత చంద్రబాబు ప్రభుత్వంలో…ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, నిత్యం బాబుని విమర్శిస్తూ… ఈరోజు రాష్ట్రం ఈ పరిస్థితికి రావడంలో ఈయన కూడా మంచి … పెద్ద పాత్రే పోషించారు !ఇప్పటికైనా నిజం తెలుసుకున్నందుకు… నాయకుడికి నటించేవాడికి తేడా చేసుకున్నందుకు అభినందనలు.

కన్నాలక్ష్మీనారాణ రాజకీయ నిర్ణయాన్ని స్వాగతించిన జనచైతన్య వేదిక
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మార్పు రావడానికి కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ నిర్ణయం దోహదపడుతుందని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు. కన్నా లక్ష్మీ నారాయణ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ మరో బీహార్గామారరాదని,అభివృద్ధివైపు పురోగమించాలన్నారు. రాజధానిని మూడు ముక్కలు చేసినంత మాత్రాన అభివృద్ధి వికేంద్రీకరణ జరగదన్నారు.26 జిల్లాలలో నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయాలని, పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ అవకాశాలను పెంచాలన్నారు. అవస్థాపక సౌకర్యాలను కల్పించి పెట్టుబడులను ప్రోత్సహించాలన్నారు. విద్వేష రాజకీయాలకు స్వస్తి పలకాలని తెలిపారు. పుచ్చలపల్లి సుందరయ్య, వావిలాల గోపాలకృష్ణయ్య, ప్రకాశం పంతులు లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని రాజకీయ నేతల కృషి చేయాలన్నారు. బూతులు తిట్టడం, రాజకీయ పార్టీల ఆఫీసులను ధ్వంసం చేయడం లాంటి చర్యలకు స్వస్తి పలకాలన్నారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అధ్యయన వేదికను మార్చి 4వ తేదీన విజయవాడలో ప్రారంభిస్తున్నామని వివరించారు. మేధావులు, రిటైర్డ్ అధికారులు, పలు ప్రజా సంఘాలతో కలుపుకొని ఆంధ్రప్రదేశ్ లో వివిధ రంగాలలో అభివృద్ధిని కాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అధ్యయన వేదికను ఏర్పాటు చేస్తున్నామనివివరించారు.

Leave a Reply