క్రీడాకారులను ప్రోత్సహిస్తాం: పద్మారావు

క్రీడాకారులను ప్రోత్సహిస్తాం: పద్మారావు

సికింద్రాబాద్ : క్రీడల్లో ఉత్సాహం కనబరచే వారిని ప్రోత్సహిస్తామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. హైదరాబాద్ జిల్లా స్థాయిలో రెజ్లింగ్ క్రీడల్లో రాణించి ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి రెజ్లింగ్ పోటీల్లో బంగారు పతకాన్ని సాధించిన ఎర్రగడ్డ కు చెందిన శంకర్ లాల్ నగర్ బస్తీ బాలిక పూజ నిత్లేకర్ ను సికింద్రాబాద్ లోని తన నివాసంలో పద్మారావు గౌడ్ ఘనంగా సత్కరించారు.
padmaఇటీవల జరిగిన జిల్లా స్థాయి రెజ్లింగ్ 39 కిలోల విభాగం పోటీల్లో యూసుఫ్ గూడ ప్రభుత్వ స్కూలు లో చదువుతున్న ఈ చిన్నారి బంగారు పతకాన్ని సాధించింది. ఆమెకు తన వంతుగా రూ. 25 వేల పారితోషికాన్ని ప్రోత్సాహక బహుమతిని పద్మారావు గౌడ్ వ్యక్తిగతంగా ఈ సందర్భంగా అందించి పూజ నిత్లేకర్ ను అభినందించారు. తెరాస యువ నేతలు కిషోర్ కుమార్ గౌడ్, రామేశ్వర్ గౌడ్ లతో పాటు నిలోఫర్ మోహన్, ఇతర నేతలు పాల్గొన్నారు.

Leave a Reply