Suryaa.co.in

Andhra Pradesh

ఉరికంబం ఎక్కడానికైనా సిద్ధం.. జగన్ రెడ్డి లాంటి అవినీతిపరులు, దోపిడీదారులకు తలవంచం

మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి

“ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాష్ట్రంలో ఎక్కడా మచ్చుకు కూడా అమలుకావడంలేదు. మచ్చలేని నాయకుడు చంద్రబాబునాయుడిపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడమే అందుకు నిదర్శనం. మా నాయకుడితో పాటు కీలకమైన టీడీపీనేతలపై కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం తప్పుడు కేసుల్ని అస్త్రాలుగా ప్రయోగిస్తోంది.

జగన్ సర్కార్ నాపై పెట్టిన తప్పుడు కేసులో న్యాయదేవత నాకు అండగా నిలిచింది. జాతిపిత గాంధీ మహాత్ముని జయంతి నాడే జగన్ రెడ్డి దుర్మార్గపు చర్యలకు పాల్పడ్డాడు. భయపెట్టి, అక్రమకేసులతో టీడీపీ నేతల గొంతులు నొక్కేయాలని చూస్తున్నాడు. ఉరికంబం ఎక్కడానికైనా తాము సిద్ధంగానీ.. జగన్ రెడ్డి లాంటి అవినీతిపరులు, దోపిడీదారులకు తలవంచం.

మంత్రిగా పనిచేసినప్పుడు కూడా ఏనాడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదు. నా ఇంట్లోకి చొరబడి అక్రమంగా అరెస్ట్ పేరుతో నన్ను అదుపులోకి తీసుకొని, గుంటూరు తీసుకొచ్చారు. జగన్ రెడ్డి…. ఈ ప్రభుత్వం ఉండేది 5 నెలలే. మా తల్లి భువనేశ్వరమ్మను అకారణంగా అసెంబ్లీలో అనరాని మాటలు అన్నప్పుడు జగన్ రెడ్డికి, మంత్రులకు, వైసీపీ వారికి ఆమె మహిళని గుర్తుకు రాలేదా?

నేను మాట్లాడిన దాన్ని తప్పు పట్టారు.. నా వ్యాఖ్యలకు ఎంతమంది ప్రజలు మద్ధతిచ్చారో, ముఖ్యంగా ఎందరు మహిళలు తమ అభిప్రాయాలు వెల్లడించారో ముఖ్యమంత్రి తెలుసుకోవాలి. నా సంతకం ఫోర్జరీ అయితే.. అయినట్టు నేను చెప్పాలి. పోలీసులు చెప్పడం ఏమిటి? నా తరుపు న్యాయవాదులు అన్ని ఆధారాలను కోర్టులో ప్రవేశపెట్టారు. నాకు తప్పకుండా న్యాయం జరుగుతుంది.

నేను రోజాపై మాట్లాడేటప్పుడు నాకు ఇద్దరు కూతుళ్లున్నారు అని చెప్పాను. మహిళల్ని ఎంతో గౌరవించే సంస్కృతి మాకు, మా కుటుంబానికి ఉంది. స్వర్గీయ ఎన్టీఆర్ దయవల్ల మహిళలపై మాపార్టీ నేతలకు అపారమైన గౌరవాభిమానాలు ఏర్పడ్డాయి. మంత్రి స్థానంలో ఉండి రోజా మాట్లాడిన మాటల్ని తేలిగ్గా తీసుకోలేకపోయాం. ప్రభుత్వంలో ఇంకొందరు మహిళా మంత్రులున్నారు.. వారినెవరినీ మేం ఎప్పుడూ ఏమీ అనలేదు. రోజాను జగన్మోహన్ రెడ్డి కట్టడి చేయాలి. లేకుంటే ఆయనకు, ఆయన పార్టీకే నష్టం.”

LEAVE A RESPONSE