– బిజెపి గుంటూరు జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ
బిజెపి ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షులు తుల్లిమిల్లి రామకృష్ణ ఆధ్వర్యంలో గుంటూరు బి ఆర్ స్టేడియం వద్ద గల బీసీ సంక్షేమ శాఖ వసతి గృహ సముదాయాన్ని త్వరగా పూర్తి చేసి బీసీ సంక్షేమ శాఖకు అప్పజెప్పాలని తద్వారా రాబోయే స్టూడెంట్ ఇయర్లో బీసీ లందరికీ అక్కడ నివాసం ఉండి చదువుకునే ఏర్పాటు చేసి బీసీలకు తగిన గుర్తింపు ఇవ్వాలని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నిరసన చేపట్టి అనంతరం ర్యాలీగా కలక్టర్ కార్యాలయానికి చేరుకొని జాయింట్ కలెక్టర్ రాజకుమారి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది ఈనిరసన కార్యక్రమంలో ముఖ్య అతిదిగా జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ పాల్గొన్నారు.
బిజెపి జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ…. గుంటూరు బి.ఆర్. స్టేడియం వద్ద గల బి.సి. సంక్షేమ శాఖ భవన నిర్మాణమును వెంటనే పూర్తి చేయాలి.4 సం.లుగా బి.సి. హాస్టళ్ళ భవన నిర్మాణము పూర్తి చేయకుండా నిరుప యోగంగా ఉంచి.. బి.సి. విద్యార్థులను యిబ్బంది పెట్టే కార్యక్రమం ఏదైతే వుందో, యిది అన్యాయం, దుర్మార్గం.. అమానవీయం.బి.సి. విద్యార్థులకు వచ్చే సంవత్సరము నుండి ఉపయోగపడేలా మంచి మౌళిక వసతులతో కూడిన బి.సి. సంక్షేమ భవనాలను త్వరిత గతిన నిర్మించాలి.
బి.సి. సంక్షేమ శాఖకు నిధుల కేటాయింపు పెద్ద మొత్తంలో జరగాలి.రాష్ట్ర ప్రభుత్వం బీసీలను నమ్మించి ఓట్లు వేయించుకుని మోసం చేసింది.వైసీపీ అధికారంలోకి వచ్చి బిసిలకు ఒక్క సంక్షేమ పథకాన్నికూడా ఇవ్వకుండా దుర్మార్గ చర్యలకు పాల్పడుతుంది.బిసి సంక్షేమ వసతి గృహాన్ని మైనారిటీ శాఖకు కేటాయించడాన్ని ఖండిస్తున్నాము.వైసీపీ బిసిల ప్రభుత్వం అంటూ బిసిలకు సెగపెడుతున్నారు.
గుంటూరు నగరంలోని కోడిగుడ్డు సత్రం గా పిలవబడే దానిలో గత ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయల వెచ్చించి బిసి వసతి గృహాన్ని నిర్మించారు.బిసి వసతి గృహాన్ని ఎమ్మెల్యే ముస్తఫా మైనారిటీ శాఖకు అప్పచెప్పాలని చూడటం దారుణం.వైసీపీ ఏకపక్ష నిర్ణయాలు తీవ్రంగా ఖండిస్తున్నాము.తక్షణమే వసతి గృహాన్ని బిసి శాఖకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాము. బి.సి.లకు కేటాయించవలసిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి.
ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు తుల్లిమిల్లి రామకృష్ణ మాట్లాడుతూ… బీసీ సంక్షేమ శాఖ వసతి గృహాన్ని ముఖ్యమంత్రి మైనార్టీ శాఖకు ఇవ్వటానికి ఆమోదం తెలిపినట్లుగా తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే ముస్తఫా ఇచ్చిన ప్రకటన … బీసీలకు మైనారిటీలకు గొడవలు పెట్టి తద్వారా లబ్ధి పొందాలని చూస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వ చర్యలను నిరసిస్తు తీవ్రంగా ఖండిస్తున్నాం ,బీసీల సంక్షేమమే మా ద్యేయం.. బీసీలు నా వెన్నుముక అనే చెబుతూ బీసీ సామాజిక వర్గాన్ని మోసం చేస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వం త్వరలోనే అంతమందుతుందని ప్రజలందరూ కలిసి తగిన బుద్ధి చెప్తారని ఈసందర్భంగా తెలిపారు.
ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు తుల్లిమిల్లి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు యడ్లపాటి రఘునాధ బాబు, ప్రధాన కార్యదర్సులు రాచుమల్లు భాస్కర్, కుమార్ గౌడ్, అప్పీశెట్టి రంగ, ఈదర శ్రీనివాసరెడ్డి, కల్లు గీత కార్మిక రాష్ట్ర కన్వనర్ అనుమొలు ఏడుకొండలు, రాష్ట్ర మీడియా కో కన్వీనర్ వెలగలేటి గంగాధర్, ఓబీసి మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ రాకేశ్ జీ, జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి శేషగిరిరావు, యశోద కృష్ణ, ఉపాధ్యక్షులు బొమ్మనబోయిన రాజేంద్రప్రసాద్, దాసరి రమేష్, కామేపల్లి వెంకటేశ్వర్లు, కొక్కెర శ్రీనివాస్, మంత్రి సుగుణ, రేణుకాదేవి మంగళగిరి పట్టణ అధ్యక్షులు మాదాల కృష్ణ, సెక్రెటరీ మొండి వీరబాబు, వనమా నరేంద్ర, పద్మనాభం, యువమోర్చా గుంటూరు జిల్లా అధ్యక్షులు మైలా హరికృష్ణ, ఎస్సీ మోర్చా అధ్యక్షులు దార అంబేద్కర్, కిసాన్ మోర్చా అధ్యక్షులు కన్నా రవి, తాడువాయి రామకృష్ణ, ప్రసాద్, తోట శ్రీనివాసరావు మరియు ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.