Suryaa.co.in

Andhra Pradesh

తిరుపతిలో ఎమ్మెల్సీ ఎన్నికలకోసం నమోదైన దొంగఓట్లపై స్థానికఎస్పీ, కలెక్టర్ స్పందించరా?

– ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్న తిరుపతి ఎస్పీ, కలెక్టర్లపై, రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతృత్వంలో నమోదవుతున్న దొంగఓట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదుచేస్తాం. ఆయన చర్యలుతీసుకోకుంటే కేంద్రఎన్నికల కమిషనర్ ను కలుస్తాం
• ఎన్నిక ఏదైనా జగన్ దొంగఓట్ల నమోదు అనే తన మార్క్ రాజకీయాన్నే నమ్ముకుంటున్నాడు
• తిరుపతి వైసీపీఎమ్మెల్సీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే భూమనకరుణాకర్ రెడ్డి, అతనికుమారుడు భారీకుట్రలతో పట్టభద్రఓటర్ల నమోదులో పెద్దఎత్తున దొంగఓట్లనమోదుకు తెరలేపారు
• ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగఓట్ల నమోదుతో గెలవాలని చూస్తున్న జగన్ ఆటలుసాగనివ్వం న్యాయంకోసం సుప్రీంకోర్టు తలుపుతట్టడానికి కూడా టీడీపీ వెనుకాడదు
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతిఎన్నిక ఒక ప్రహాసనంగా మారుతోందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏదోరకంగా గెలవాలన్న దురుద్దేశంతోనే జగన్ తనమార్క్ రాజకీయాల్లో భాగమైన దొంగఓట్ల చేర్పులకు సిద్ధమయ్యాడని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్లరామయ్య తెలిపారు . మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…

“పట్టభద్రులుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలంటే కనీస డిగ్రీచదివి ఉండాలి. కానీ జగ న్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇంటర్, పదోతరగతి చదివినవారుకూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ ట్లు వేసేందుకు సిద్ధమయ్యారు. తిరుపతిలో ఉన్న వైసీపీకార్యాలయం చిరునామాతో, భూమ న్ కరుణాకర్ రెడ్డి, అతనిఅనుచరులు 38బోగస్ ఓట్లను నమోదుచేయించారు. ఇంత జరుగు తుంటే తిరుపతి జిల్లా కలెక్టర్, ఎస్పీలు నిద్రపోతున్నారా? నేడు, తిరుపతిలో టీడీపీ నేత నిమ్మలరామానాయుడు, వైసీపీప్రభుత్వ దొంగఓట్ల నమోదుపై ఫిర్యాదుచేయడానికి వెళ్తే, ఫిర్యాదు తీసుకుంటారటగానీ.. దానికి సంబంధించిన అక్ నాలెడ్జ్ మెంట్ ఇవ్వరటా! ఇదేం విడ్డూరం?

పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి, తిరుపతిజిల్లా వైసీపీనేత లు అందరూ కలిసే ఈ విధంగా దొంగఓట్ల తంతులో భాగస్వాములు అయ్యారు. అనర్హుల్ని అర్హులుగా ధృవీకరిస్తూ, సంతకాలుచేసిన ఎలక్ట్రికల్ ఏఈ, తహసీల్దార్లు అందరూకోర్టు బోను లో నిలబడాల్సిందే. తిరుపతిలో జరుగుతున్న దొంగఓట్ల చేర్పులన్నీ ప్రభుత్వకుట్రలో భాగంగా జరుగుతున్నవే. వైసీపీ కార్యాలయ చిరునామాతో 38బోగస్ ఓట్లు నమోదైతే సమాధానం చెప్పాల్సిన బాధ్యత తిరుపతిఎస్పీకి, జిల్లా కలెక్టర్ కు లేదా? ఐపీసీ సెక్షన్లు 177, 181, 196, 198, ఫోర్జరీ సెక్షన్ 463, 464, తప్పుడు పత్రాల తయారీకి సంబంధించిన సెక్షన్ ప్రకా రం ఇన్నినేరాలు చేస్తే పోలీసులకు పట్టదా? తిరుపతి ఎస్పీ చర్యలు తీసుకోరా? వాట్సాప్ లో ఫిర్యాదుచేసినా తిరుపతి ఎస్పీ ఎందుకు చర్యలుతీసుకోలేదని ప్రశ్నిస్తున్నాం. తిరుపతిలో నమోదైన దొంగఓట్ల వివరాలను డోర్ నెంబర్లతో సహా ఇచ్చినా ఆయన స్పందిం చరా? ఒక్కఇంట్లోనే 48 మంది డిగ్రీచదివినవారు ఉంటారా? తిరుపతి ఎస్పీ, కలెక్టర్ల పక్కనే ఇంత జరుగుతుంటే, చర్యలు తీసుకోకుండా ఇద్దరూ నీతులుచెబుతున్నారు. ఐపీఎస్, ఐఏ ఎస్ లుగా ఉన్నవారికి ఏచట్టం, ఏసెక్షన్ ప్రకారం చర్యలు తీసుకోవాలో కూడా టీడీపీనేతలే చె ప్పాలా? 48ఓట్లు నమోదైన ఇంటి అడ్రస్ చిరునామాలో ఉన్నఒక మహిళతో తానే ఫోన్లో మా ట్లాడితే, ఆమె తాను 7వతరగతి మాత్రమే చదివాను అనిచెప్పింది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీపెద్దలు నమోదుచేయించే దొంగఓట్లపై చర్యలు తీసుకునే చిత్తశుద్ధి తిరుపతిఎస్పీ, కలెక్టర్, డీజీపీ, చీఫ్ సెక్రటరీ, రాష్ట్ర సీఈవోకి ఉందా? తిరుపతిలోని 7-18 ఇంటి డోర్ నెంబర్లో 23మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు. కానీ ఆ విషయం ఇంటి యజమానురాలికి తెలియదు. బూత్ నెంబర్ 231, వార్డ్ నెంబర్ 27లో నమోదైన పట్టభద్రదొంగఓట్ల సంగతే మిటి? 4-4-974 నెహ్రూనగర్ లో నమోదైన ఓట్లబాగోతం ఏమిటి? ఇలాంటి వింతలపై తిరుపతిఎస్పీ, తిరుపతి కలెక్టర్, డీజీపీ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్, ముఖ్యమంత్రి నిజంగా సిగ్గుపడాలి. దొంగఓట్ల నమోదుకోసం ఫోర్జరీ డాక్యుమెంట్లు, ఫోర్జరీ సంతకాలు కూడా పెట్టా రు. దొంగస్టాంప్ లతో, తతంగం నడిపారు. ఇంతజరిగితే ప్రభుత్వాధికారులకు చీమకుట్టినట్టు కూడాలేదు. తిరుపతి నగరంలోనే 7వేలకు పైగా దొంగఓట్లు నమోదైతే, పోలీసులు ఆ దొంగ ల్ని పట్టుకోరా? టీడీపీనేతలు దొంగల్నిపట్టుకొని అప్పగిస్తే వారిని వదిలేస్తారా? తిరుపతి ఎస్పీ, కలెక్టర్ అంటే భయముంటే, వైసీపీనేతలు పవిత్రస్థలంలో తప్పుడుపనులు చేస్తారా?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుకోసం వైసీపీప్రభుత్వం, అధికారపార్టీనేతలు ఎంచుకున్న తప్పు డు మార్గాలపై రాష్ట్ర ఎన్నికలకమిషనర్ కుఫిర్యాదుచేస్తాం. ఆయన చర్యలుతీసుకోకుంటే, కేంద్ర ఎన్నికలసంఘం తలుపుతట్టడానికి కూడా తాము సిద్ధమే. జగన్ ప్రభుత్వ దొంగఓట్ల బాగోతాన్ని అవసరమైతే సుప్రీంకోర్టు వరకు కూడా తీసుకెళతాం. ఈ సిగ్గులేని ప్రభుత్వ వ్యవ హారశైలిని, జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో అనుసరించే ఇలాంటి దిక్కుమాలిన బాగోతాల్ని దేశ మంతా తెలియచేస్తాం. 7వ తరగతి, 10వతరగతి చదివినవారిని పట్టభద్రలుగా నమోదు చేయడం, ఆ విధమైన ఓట్లతో గెలవాలనుకోవడం మీకు, మీ ప్రభుత్వానికి సమ్మతమా ముఖ్యమంత్రిగారు? దొంగదారిన, దొడ్డిదారిన గెలిచే ఎన్నికలు కూడా ఒక ఎన్నికలేనా? అలా గెలిచే గెలుపు ఒకగెలుపేనా? ఈ ప్రక్రియపై ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, రాష్ట్ర ఎన్నికల కమి షనర్ ఏంచర్యలు తీసుకుంటారో చూస్తాం. తక్షణమే వారు తిరుపతిలో నమోదైన దొంగఓట్లపై దర్యాప్తుకుఆదేశించాలి. అలానే దొంగఓట్లు వేయడానికి ఎవరూరావద్దని, వస్తే చట్టపరంగా చర్యలుతీసుకుంటామని ప్రకటనచేయాలి. దొంగఓట్ల నమోదులో అధికారపార్టీనేతలతో కలిసి కుట్రలో భాగస్వాములైన అధికారులపై కూడా ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికలకమిషనర్ వెంటనే చర్య తీసుకోవాలి.

దొంగఓట్ల నమోదు అనేది కేవలం తిరుపతికే పరిమితంకాలేదు. నెల్లూరు, కర్నూల్లో కూడా జరిగినట్టు తమదృష్టికి వచ్చింది. వాటికి సంబంధించిన వివరాల్నికూడా తాము ఎన్నికలకమిషనర్ ముందు పెడతాం. ఆయన స్పందించకపోతే ఢిల్లీవెళ్లి, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేస్తాం. ఏపీ ఎన్నికలసంఘం ఈ వ్యవహారంపై స్పందించకపోతే ఎంతదూరం వెళ్లడానికైనా తమపార్టీ సిద్ధం” అని రామయ్య తేల్చిచెప్పారు. తిరుపతి వైసీపీఎమ్మెల్సీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, అతని కుమారుడు కలిసి భారీకుట్రతో దొంగఓట్లనమోదుకు పాల్పడుతున్నవైనాన్ని ఆధారా ల్ని(వీడియాలు, ఆడియోలు, ఇంటిచిరునామాలు, పట్టభద్రులుగా నమోదైనవారి వివరాలు) రామయ్య మీడియాసమావేశంలో బయటపెట్టారు.

LEAVE A RESPONSE