
ఎంపీ రఘురామకృష్ణంరాజు
ప్రజా చైతన్యంతోనే పాలకుల్లో మార్పు వస్తుందా?, పోలీసులు అరాచకాలు ఆగుతాయా?? పోలీసుల అరాచకాలు ఉంటాయా???? అని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గోపాల గౌడ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే రద్దు చేయవచ్చునని అన్నారని , రాజ్యాంగం పక్కదోవ పట్టినట్లు అవుతుందని అన్నారన్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కాబట్టి ఆయన్ని వదిలేశారని తెలిపారు. లేకపోతే సిఐడి చీఫ్ పీవీ సునీల్ కుమార్ చెప్పగానే, మరొక సునీల్ కుమార్ అరెస్టు చేసి తీసుకు వచ్చే వారన్నారు.
పెను తుఫానులా నర్సాపురంపై హామీ వర్షాలు
నర్సాపురం నియోజకవర్గంపై పెను తుఫానులా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీల వర్షాన్ని కురిపించారని రఘురామకృష్ణం రాజు ఎద్దేవా చేశారు. మూడున్నర ఏళ్లుగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిద్రపోయారని ఆయన అపహస్యం చేశారు. అన్న అడిగేస్తే విధ్వంసం… అన్న నిల్చుంటే విధ్వంసం… విధ్వంసం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి నర్సాపురం పర్యటన సాగిందన్నారు. హెలికాప్టర్ దిగి కాసింత దూరం వెళ్లడానికి మహా వృక్షాలను కొట్టివేయవలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా నరసాపురం కాస్తా, వరదాపురం గా మారుద్దని అపహాస్యం చేశారు. హెలికాప్టర్ దిగి కాసింత దూరం వెళ్లడానికి మహావృక్షాలను కొట్టివేశారని రఘురామకృష్ణంరాజు ఆక్షేపించారు . స్కూళ్లు, కాలేజీ రద్దుచేసి వాళ్ల బస్సులను తీసుకున్నారని మండిపడ్డారు. వ్యాపారం నిన్న మధ్యాహ్నం నుంచి బందు పాటిస్తున్నారని అన్నారు. షాపులు తెలిస్తే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వచ్చే నష్టమేమిటి అని ప్రశ్నించారు.
రౌడీల్లా తయారైన వాలంటీర్లు
వాలంటీర్లు రౌడీల్లా తయారయ్యారని రఘురామకృష్ణం రాజు తీవ్రంగా ఆక్షేపించారు. ఇంటికి ఒకరు రాకపోతే, వారి రేషన్ కట్ చేస్తామని వాలంటీర్లు బెదిరిస్తున్నారన్నారు. ఇలాంటివి దిక్కుమాలిన దరిద్రపు వ్యవస్థ మరొకటి ఉండదని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. ఇంకా చేస్తే 40 వేల మందిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీటింగ్ కు పోగు చేశారన్నారు.
3,300 కోట్ల రూపాయలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు
నరసాపురం నియోజకవర్గ పరిధిలో 3300 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారని రఘు రామకృష్ణ రాజు తెలిపారు. ఇందులో 30 నుంచి 40 కోట్లు మినహాయిస్తే, 3250 కోట్ల రూపాయలు శంకుస్థాపనలేనని తెలిపారు. నా చెల్లి పెళ్లి మళ్లీ మళ్లీ జరగాలి అన్నట్లుగా బియ్యపు తిప్ప హ ర్బర్, రాష్ట్ర విభజన చట్టంలోని ఆక్వా యూనివర్సిటీ, వాటర్ గ్రిడ్ వంటి వాటికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తున్నారని తెలిపారు. వాటర్ గ్రిడ్ ఎప్పుడో ప్రారంభం కావలసి ఉందని, రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటాగా నిధులు చెల్లించకపోవడం వల్లే ఆలస్యం జరిగిందని తెలిపారు. హర్ ఘర్ జల్ స్కీమ్ లో అప్పుడే మన వాటాను ఇచ్చే ఉంటే వాటర్ గ్రిడ్ స్కీం పూర్తి అయి ఉండేదని అన్నారు. ఆనాటి కలెక్టర్ తో తాను మాట్లాడి, వాటర్ గ్రిడ్ స్క్రీన్ పూర్తి చేయాలని కోరినట్లు తెలిపారు. విశిష్ట వారధి కూడా, చెల్లి పెళ్లి మళ్లీ మళ్లీ కావాలి అన్నట్లుగా తయారయిందని అపహాస్యం చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపనలు చేసిన ఏ ఒక్క పనికి కూడా, ఇప్పటివరకు టెండర్లు పిలవలేదని రఘురామకృష్ణం రాజు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు ఇందులో ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తన వంతు నిధులను చెల్లించాలని తెలిపారు. పులివెందుల బస్ స్టాప్ నిర్మాణం ఇప్పటివరకు పూర్తి కాలేదన్నా రఘురామకృష్ణంరాజు, నరసాపురం నియోజకవర్గ కేంద్రం శివారులో 3200 కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టౌన్షిప్ కుస్ శంకుస్థాపన చేయడం హా స్యాస్పదంగా ఉంద న్నారు. బియ్యపు తిప్ప హార్బర్, ఆక్వా యూనివర్సిటీ లకు సీఎం శంకుస్థాపన కూడా విడ్డూరంగా ఉందన్నారు
4700 కోర్టు ధిక్కారణ కేసులా?
రాష్ట్ర ప్రభుత్వం పై 4700 కోర్టు ధిక్కరణ కోర్టు ధిక్కరణ కేసు ఉన్నాయని, ఇందులో పేమెంట్ కే సులే 3000 కేసులు ఉన్నట్టు రఘురామకృష్ణ రాజుతెలిపారు.. ఎనర్జీ ఎస్ పథకం 90 శాతం నిధులు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటికీ పనిచేసిన వారికి నిధులు ఇవ్వడం లేదన్నారు. సర్పంచులు త్వరలోనే ఢిల్లీకి వచ్చి ఆందోళన లు చేయనున్నట్లు తెలిసిందన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న తమ పార్టీ సర్పంచులు కూడా ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారన్నారు. సర్పంచులు పార్టీ కీ జీవనాడని, నిర్జీవంగా మారిస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు
ఇష్టం ఉన్నా.. లేకపోయినా శంకుస్థాపనలు చేశారు హ్యాపీ
నర్సాపురం మీద ప్రేమతోనూ, కోపంతోను ఇష్టం ఉన్న లేకపోయినా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారని తనకు చాలా సంతోషంగా ఉందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఏడాదిలోగా ఈ పనులన్నీ పూర్తి చేయాలని కోరారు. నన్ను ఓడించాలని కసి తో ఉన్న జగన్మోహన్ రెడ్డి, నర్సాపురంలో మేజర్ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ముఖ్యమంత్రి ఎవరు ఇప్పటివరకు గెలిచిన దాఖలాలు లేవన్నారు . ఎన్టీ రామారావు నుంచి మొదలుకొని, వైయస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అభివృద్ధి శంకుస్థాపన చేసి తర్వాత ముఖ్యమంత్రిగా గెలవలేదన్న సెంటిమెంట్ ఒకటి ఉందని తెలిపారు…
10 శాతం కూడా కంప్లీట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో 90% పనులను గృహ నిర్మాణాన్ని పూర్తి చేసినప్పటికీ , జగన్మోహన్ రెడ్డి 10% పనులను కూడా పూర్తి చేయలేకపోయారని రఘురామకృష్ణంరాజు చేశారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయారని విమర్శించారు.
లిక్కర్ గ్యాంగ్, ఏపీ క్రికెట్ అసోసియేషన్ లోనా?
ఢిల్లీ లిక్కర్ గ్యాంగ్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో కీలకపాత్రను పోషించడం పట్ల రఘురామకృష్ణంరాజు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. లిక్కర్ కుంభకోణంలో ఈడీ విచారణలను ఎదుర్కొంటున్న శరత్ చంద్రారెడ్డి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం, ఆయన సోదరుడు రోహిత్ రెడ్డి ఉపాధ్యక్షుడిగా, కార్యదర్శిగా గోపీనాథ్ రెడ్డి ఎన్నికవ్వడం లేదు వెనుక విజయ సాయి లీలా ఉందా?, జగన్మోహన్ రెడ్డి మాయ ఉందా?? అని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. దస్పల్లా భూముల్లో 75% డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్న గోపీనాథ్ రెడ్డి కోశాధికారి నుంచి, కార్యదర్శిగా పదోన్నతి వడ్డూరంగా ఉందన్నారు. కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ నిర్వహించిన శ్రీధర్ రెడ్డికి స్కిల్ డెవలప్మెంట్ సలహాదారు పదవి ఇవ్వడం విస్మయాన్ని కలిగించిందన్నారు.
క్రికెట్ ను సబ్జా చేసిన సారా వ్యాపారులు
ఆర్థిక పరిపుష్టి కలిగిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈ డీ విచారణ ఎదుర్కొంటున్న శరత్ చంద్రారెడ్డి ఎన్నిక కావడం విడ్డూరంగా ఉందని రఘు రామ కృష్ణంరాజు అన్నారు. అధ్యక్షుడి గా శరత్ చంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడిగాఆయన సోదరుడు రోహిత్ రెడ్డి , కోశాధికారి నుంచి కార్యదర్శి పదోన్నతి పొందిన గోపీనాథ్ రెడ్డి అంతా ఒక కుటుంబానికి చెందినవారు అని అన్నారు. వీరికి బ్యాట్ కు బాల్ కు తేడా తెలియదన్నారు.
దేశంలో అగ్రగామి బ్యాటరీ సంస్థ అమర్ రాజా
దేశంలో అగ్రగామి బ్యాటరీ సంస్థ అమరరాజా కంపెనీ అని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్న ఈ సంస్థ ను రాజకీయ కక్షలతో వేధించడం అపహాస్యం గా ఉందన్నారు. జాకీ సంస్థ కు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో భూములు కేటాయించిన తర్వాత, ఆ సంస్థను పర్సంటేజ్ వాటా కోసం వేధించడం వల్ల పారిపోయారన్నారు.. పారిశ్రామికంగా మనం ఎంత ముందుకు వెళ్తున్నామన్నది ఈ ఉదాంతం ద్వారా స్పష్టమవుతుందన్నారు.
తరలి వచ్చిన ఊర్లకు ఊర్లు
కర్నూలు జిల్లాలో మూడు రోజుల పర్యటనలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సమావేశాలకు ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది స్వచ్ఛందంగా హాజరైనట్టు ఇంగ్లీష్ దినపత్రిక దక్కన్ క్రానికల్ రాసిందని రఘు రామకృష్ణంరాజు తెలిపారు. దక్కన్ క్రానికల్ ఒక విధంగా తమ పార్టీ పత్రికేనని తెలిపారు.. అయినా దక్కన్ క్రానికల్ చంద్రబాబునాయడు సభలకు ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది హాజరయ్యారని పేర్కొంటే అంతకంటే ఎక్కువ ముందే హాజరైనట్లేనని తెలిపారు. 40 ఏళ్ల వయసున్న వారిని కాలేజీ విద్యార్థులుగా చూపించి, సభను అడ్డుకునే ప్రయత్నం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.