Suryaa.co.in

Andhra Pradesh

జత్వానీ కేసులో భయంతోనే….నీలి మీడియా తప్పుడు రాతలు!

• మహిళలను కించపరుస్తూ రాసిన ఆ రాతలను తీవ్రంగా ఖండిస్తున్నాం
• జత్వానీ కేసుకు దేశవ్యాప్తంగా మద్దతు 
• నీలి మీడియా మాత్రం దోషులను కాపాడేందుకు తప్పుడు రాతలు 
• కుట్రపూరితంగా మహిళలందిరినీ ఇబ్బందులకు గురిచేయాలని పన్నాగం
• ఇది వారి దిగజారుడు రాజకీయానికి నిదర్శనం 
• జగన్ మోహన్ రెడ్డి స్క్రిప్ట్‌తోనే జత్వానీపై కేసులు
• జత్వానీని, ఆమె తల్లిదండ్రులను దారుణంగా హింసించారు.
• 151 నుంచి 11కు పడిపోయేసరికి జగన్ రెడ్డి మైండ్ బ్లాక్  
• వైసీపీ ప్రభుత్వంలో లాగా కూటమి ప్రభుత్వంలో చేస్తామంటే కుదరదు
• ఎవరిపై అయిన చర్యలు తప్పకుండా తీసుకుంటాం
• మాజీ మంత్రి పీతల సుజాత హెచ్చరిక

మంగళగిరి: జత్వానీ కేసులో తన పేరు బయటపడుతుందనే భయంతోనే నీలి మీడియాలో జగన్ రెడ్డి తప్పుడు రాతలు రాస్తున్నారని మాజీ మంత్రి పీతల సుజాత ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నీలి మీడియాలో మహిళలపై కించపరుస్తూ తప్పుగా రాయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జత్వానీ కేసుకు సంబంధించి దేశవాప్త్యంగా మద్దతు పెరుగుతుంటే.. ఈ నీలి మీడియా పత్రికలో మాత్రం చాలా దారుణంగా దోషులను రక్షించేందుకు జగన్ రెడ్డి తప్పుడు కథనాలు రాయాటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సాక్షి చైర్‌ పర్సన్  భారతీ రెడ్డి కూడా మహిళ అయి ఉండి సాటి మహిళ, అన్యాయానికి గురైన మహిళ మీద ఘోరంగా రాయటానికి సిగ్గుగా అనిపించట్లేదా..? ఇంత కుట్రపూరితంగా మహిళలందరినీ ఇబ్బందులకు గురిచేయాలని చూస్తున్నారు.. ఇది మీ దిగజారుడు రాజకీయానికి నిదర్శనంగా నేను భావిస్తున్నా.

పోలీసు వ్యవస్థ చేతుల్లో ఉంది కదా అని నటి జత్తానినీ, ఆమె కుటుంబాన్ని ఎంత దారుణంగా హింసించారు.. ఈ రోజున చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది కాబట్టి వేధింపులకు గురైన మహిళలందరికీ ధైర్యం వచ్చింది. జత్వాని కూడా అదే ధైర్యంతో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి కేసు పెట్టారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి .. జగన్ మోహన్ రెడ్డి స్క్రిప్ట్‌ తోనే జత్వానిపై కేసులు నమోదు చేసి, ముంబయి వెళ్ళి బలవంతంగా ఆమెను వేధించటమే కాకుండా ఆమెను, ఆమె తల్లిదండ్రులను తీసుకువచ్చి ఎంతో చిత్రహింసలకు గురి చేశారో.. పాపం ఆ పెద్ద వయస్సులో ఉన్న తల్లిదండ్రులు ఎంత మానసిక శోభకు గురయ్యారో.. ఆ బాధలన్ని కూడా రికార్డు చేసి చెప్తే నిజంగా జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఇంత దారుణం జరిగిందా.. అంటూ ముక్కున వేళేసుకున్న పరిస్థితి.

జగన్ రెడ్డి చెల్లెలు సోషల్ మీడియాను ప్రశ్నించిందని, మొత్తం సోషల్ మీడియాలోనే ఆమెను నీచంగా, కించపరిచే విధంగా అల్లారిపాలు చేశారు. బాబాయ్ ని చంపేసి ఆ కుటుంబంపైనే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పోస్టులు వేశారు. మానవత్వం అనిపించట్లేదా మీకు..? జత్వానీ కేసులో దోషులను కాపాడాటానికి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారని జగన్ రెడ్డి అంటున్నారు. ఇలా మాట్లాడేందుకు జగన్ రెడ్డికి సిగ్గు అని కూడా అనిపింట్లేదు. ఎవరూ హయాంలో మహిళలపై ఆరాచకాలు జరిగాయో మరిచిపోయారా..? 2024 ఎన్నికల్లో 11 సీట్లు వచ్చేసరికి జగన్ రెడ్డి మెదడు పని చేయట్లేదు.

మీ ప్రభుత్వంలో.. మీ ప్రజాప్రతినిధులు మహిళల పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించారో… ఒకసారి గుర్తు చేయామంటారా..? అరగంట.. గంట.. ప్యాంటులు విప్పేసి మొండి మొలలతో ఫోటోలు…. ఇలా చెప్పుకుంటూ పోతే బోలేడు.. ఇటువంటివి చేస్తే మీ ప్రభుత్వంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలి.. ? టీడీపీలో చిన్న తేడా వచ్చిన చంద్రబాబు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటారు.. అది కూటమి ప్రభుత్వం విశ్వసనీయత, చిత్తశుద్ధి. మహిళ పక్షపతి చంద్రబాబు.. మహిళలకు ఏదైనా అన్యాయం జరిగితే పార్టీ వారు అయిన సరే వెంటనే చర్యలు తీసుకుంటారు.. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు, పోలీసులు కూడా ఎంతో దారుణంగా అవమానిస్తే.. అన్యాయంగా కేసులు పెడితే.. వారి మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా చేశారు. అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జత్వానీ కేసు పెట్టాగానే విచారణ చేపట్టి.. నిజమేనని తేలిన తరువాతే దోషులపై చర్యలు తీసుకున్నారు.

జత్వానీ మాత్రమే కాదు.. ఎంతో మంది మహిళల మీద నేరాలు.. ఘోరాలు జరిగాయి. అయినా సరే తప్పు కప్పిపుచ్చుకునేందుకు జగన్ రెడ్డి టీం మాట్లాడుతున్న విధానం కానీ, భారతీ రెడ్డి నీలి మీడియాలో మహిళలను అవమానిస్తూ రాస్తున్న పద్ధతిని ఏ మహిళ కూడా క్షమించదు.. ఓ పెద్ద సారూ చెప్తేనే ముంబాయి వెళ్ళినట్టు విశాల్ గున్నీ లిఖితపూర్వకంగా వాంగ్మూలం ఇచ్చారు. దీనికి ఏం సమాధానం చెప్పారు జగన్ రెడ్డి..? తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగానే ఇటువంటి నేరాలు.. ఘోరాలు చేయించేది మీరు. డీజీపీకి ఎటువంటి సమాచారం లేకుండా ఇంత బాగోతం నడిపారంటే.. మీరు ఎంత దారుణంగా కుట్రలు, కుతంత్రాలు, అమానుషమైన ఆలోచనలు ఉన్నాయో ఒకదాన్ని తరువాత ఒకటి బయటకు వస్తున్నాయి.

తప్పు చేసిన వారు ఎవరైన సరే కూటమి ప్రభుత్వంగానీ, చంద్రబాబు గానీ వదిలి పెట్టే ప్రసక్తే లేదు. చట్టాలను కఠినతరం చేస్తాం.. వైసీపీ ప్రభుత్వ హయాంలోలాగా మహిళలపై ఏది పడితే అని, అలా పడితే అలా మాట్లాడేస్తామంటే కూటమి ప్రభుత్వంలో కుదరదు.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ల వద్దకు వచ్చిన ప్రతి సమస్యను కూడా పరిగణలోకి తీసుకుని చర్యలు తీసుకుంటాం.. కూటమి ప్రభుత్వంతో న్యాయం జరుగుతుందనే నమ్మకంతోనే ప్రతి ఒక్కరు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. మా ప్రభుత్వంలో ఏ మహిళ కంటి నుంచి కన్నీరు రాకుండా, అన్యాయం జరగకుండా, మహిళలకు హాని తలపెట్టేవిధంగా చూసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. మహిళలకు న్యాయం చేస్తాం.. అని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు.

LEAVE A RESPONSE