Suryaa.co.in

Andhra Pradesh

టిడిపి సభ్యులు ఏ మొఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్తారు?

-టిడిపి నాయకులు జంగారెడ్డిగూడెంలో మారణహోమం జరిగినట్లు దుష్ప్రచారం చేశారు
-చంద్రబాబు ఏనాడు ప్రజల నమ్మకొలేదు, పచ్చ మీడియా నీ కుట్రలను నమ్ముకున్నాడు
-టిడిపి హయంలో కులాల మధ్య అగ్గి రాజేస్తే,జగన్ మోహన్ రెడ్డి అందరినీ కలుపుకుపోతు ముందుకేళ్తున్నారు.
– ట్విట్టర్ వేదికగా టిడిపి నాయకుల తీరును తప్పుబట్టిన విజయసాయిరెడ్డి

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై మాట్లాడకుండా చంద్రబాబు భజన చేసిన టీడీపి సభ్యులు ఇక నుండి ఏం మొఖం పెట్టుకుని గ్రామాలకు వెళ్తారని వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి,రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. పలు అంశాలపై విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. 11 రోజులు సభ జరిగితే టిడిపి సభ్యులు చిడతలతో గోల తప్ప ఏ చర్చలో పాల్గొనలేదను మండిపడ్డారు. అసలు అసెంబ్లీ సమావేశాలు జరిగాయా అని ప్రశ్నిస్తూ విలేకరులు నివ్వెరపోయేలా వ్యవహరించిన చంద్రబాబు తీరును ఆయన తప్పుబట్టారు.

టీడీపీ వ్యవస్థాపక ఉత్సవాల సంగతేమో కానీ తమ్ముళ్లు పరస్పరం దాడులు చేసుకుంటున్నారని చెప్పారు. అసమర్థులు, చెంచాలకు తండ్రీకొడుకులు పెద్ద పీట వేస్తున్నారని మొదటి నుంచి జెండా మోసిన కార్యకర్తలు రగిలిపోతున్నారని వెల్లడించారు.

గుళ్ళు, గుళ్ళల్లో విగ్రహాలను ధ్వంసం చేసి ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టాలని చూసిన చంద్రబాబు గ్యాంగుకు విజయవాడలో బుద్ధ విగ్రహాలు లేపేయడం పెద్దపనా అని అనుమానం వ్యక్తం చేశారు.టిడిపి నాయకులు జంగారెడ్డిగూడెంలో మారణహోమం జరిగినట్టు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూసి దొరికిపోయి కొత్త కుట్ర మొదలెట్టారని టిడిపి నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు ఏనాడూ ప్రజలను నమ్ముకోలేదని, వారి మనసులను గెలుచుకోలేదని, కేవలం పచ్చ మీడియాను, కుట్రలను నమ్ముకున్నాడని పేర్కొన్నారు. అందుకే గత ఎన్నికల్లో 23 సీట్లకే పరిమితమయ్యాడని చెప్పారు. సీఎం జగన్ ప్రజలను, తన సొంత కష్టాన్ని నమ్ముకున్నారని,అందుకే 151 సీట్లతో తిరుగులేని విజయాన్ని ప్రజలు ఆయనకు కట్టబెట్టారని ఆయన చెప్పారు.

దేశంలో ఎక్కడైనా జగన్ మోహన్ రెడ్డిలాగా పేదల గృహనిర్మాణాలు చేపడుతున్న ప్రభుత్వాలేవైనా ఉన్నాయేమో కనుక్కోండి అంటూ చంద్రబాబుని పశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 72 వేల ఎకరాల్లో, 28 వేల కోట్లతో, 15.6 లక్షల నివాస గృహాలు, 17 వేల కాలనీలు వస్తున్నాయని చెప్పారు. 21 ఏళ్ల టీడీపీ పాలనలో కులాల మధ్య అగ్గి రాజేస్తే, సిఎం జగన్ మోహన్ రెడ్డి అందరినీ కలుపుతున్నారని ఆయన కోనియాడారు..
బీసీలంటే దేశానికి బ్యాక్ బోన్ అంటూ సరికొత్త నిర్వచనం చెప్పిన సీఎం జగన్ దానిని ఆచరణలోనూ చేసి చూపించారని కోనియాడారు బలహీనవర్గాలతో పాటు ఎస్సీ, ఎస్టీలకు నవరత్న పథకాలతో ప్రభుత్వం నుంచి నేరుగా నగదు బదిలీ చేయడంతో పాటు వారి జీవనోపాధి మెరుగు కోసం బ్యాంకుల ద్వారా ఆర్థిక తోడ్పాటునూ అందించారని ఆయన గుర్తు చేశారు.

రెవెన్యూ లోటు భారీగా ఉన్నప్పటికీ రుణ భారాన్ని తగ్గించుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పారు. మరోవైపు, తెచ్చిన అప్పులతో ఆస్తుల కల్పనకూ ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. కాగ్‌ తన నివేదికలో ఈ విషయాలను వెల్లడించిందని గుర్తు చేశారు. సాధారణంగా ప్రభుత్వాలు మిగులు రెవెన్యూ ఉన్నప్పుడు రుణాలు చెల్లిస్తాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వం భారీ రెవెన్యూ లోటు ఉన్నప్పటికీ అప్పులు తీరుస్తోందని తెలిపిందని చెప్పుకొచ్చారు.

LEAVE A RESPONSE