స్త్రీ అంటే అవసరం కాదు ధైర్యం..

రామునికి — సీత
కృష్ణునికి — రాధ
ఈశునకు — ఈశ్వరి
మంత్రపఠనంలో — గాయత్రి
గ్రంధ పఠనంలో — గీత
దేవుని యెదుట
వందన, అర్చన, పూజ, హారతి, ఆరాధన
వీరికి తోడుగా శ్రద్ధ

మన దినచర్యలో భాగంగా
ఉదయానికే— ఉష, అరుణ
సాయింత్రం — సంధ్య
చీకటైతే — జ్యోతి, దీప
పడక సమయానికి – రజనీ
పడుకున్నాక — స్వప్న

చూచేటప్పుడు— నయన
వినేటప్పుడు — శ్రావణి
మాట్లాడునప్పుడు— వాణి
ఓరిమిలో – వసుధ
వడ్డించేటప్పుడు- అన్నపూర్ణ
నడుస్తున్నప్పుడు— హంస
నవ్వుచున్నప్పుడు — హాసిని, ప్రసన్న
అద్దంలో చూస్తే— సుందరి
చేసేపనికి – స్పూర్తి
పని చేయడానికి — స్పందన
మంచి పనికి — పవిత్ర
ఇష్టంగాచేసే పనికి — ప్రీతి
నీరు త్రాగునపుడు — గంగ
ఐస్క్రీమ్ తినేటప్పుడు — హిమజ
సినిమా చూస్తున్నప్పుడు — చిత్ర
అబద్ధ మాడునపుడు — కల్పన
నిజం చెప్పేటపుడు — సత్యవతి, నిర్మల
ఆలోచనలప్పుడు — ఊహా, భావన
చదువుచున్నప్పుడు — సరస్వతి
వ్యాపారంలో — ప్రతిభ , ప్రగతి
సంతోషంలో— సంతోషి
కోపంలో — భైరవి
ఆటలాడునప్పుడు— ఆనంది
గెలుపు కోసం— జయ, విజయ
గెలిచిన తర్వాత — కీర్తి

సరిగమలు నేర్చునపుడు — సంగీత
పాటలు పాడునపుడు — శృతి, కోకిల
తాళం వేయునపుడు — లయ

సాహిత్య గోష్టిలో — కవిత
నగరాన్ని కాపాడుతూ — ప్రకృతి

జీవిత గమనంలో మనతో
విద్యాభ్యాసంలో — విద్య
సంపాదనప్పుడు — లక్ష్మి
చేసేవృత్తిలో — ప్రేరణ ,
పని చేసి వచ్చాక — శాంతి
చిన్నతనంలో — లాలన
మధ్యవయస్సులో – మాధురి
ముసలితనంలో- కరుణ, మమత
జీవితాంతం మనతో — “జీవిత” .

బాగుంది కదా!మన తెలుగుభాష యొక్క గొప్పతనం.

– గాయత్రి