– రామిశెట్టి వెంకట సుబ్బారావు
మహిళలు తమ కాళ్ల పై ఆర్ధికంగా, స్వతంత్రంగా ఎదగాలనే ఆశయంతో ఉచితంగా జీవనోపాధి కల్పించే వివిధ కోర్సులను తమ ట్రస్ట్ ద్వారా అందిస్తున్నట్లు రామిశెట్టి వెంకట సుబ్బారావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రామిశెట్టి వెంకట సుబ్బారావు తెలిపారు. తమ ట్రస్ట్ ఆధ్వర్యంలోఅల్లూరు లో బ్యూటిషియన్ కోర్సు పూర్తి చేసుకున్న మహిళలకు ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు నెలలుగా బ్యూటిషన్ కోర్స్ లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఈ రోజు శిక్షణ పొందిన 30 మంది మహిళలకు ప్రశంసా పత్రాలను అందజేశామన్నారు. మహిళల జీవనోపాధికి ఉపయోగపడే టైలరింగ్, బ్యూటిషియన్ కోర్సులలో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నారాయణ హాస్పిటల్ సీఈఓ దామా రామారావు, వారి సతీమణి, నారాయణ సోదరి కామాక్షి, , ట్రస్ట్ నిర్వహకురాలు మెతుకు రాజేశ్వరి, అల్లూరు శిక్షణ కేంద్ర బాధ్యులు టంగుటూరి త్రివేణి, శిక్షకురాలు అర్చన, అమరావతి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు డి. బ్రహ్మానందరావు, వాసవి క్లబ్ జోన్ చైర్మన్ సి. హెచ్.జ్యోతి దంపతులు తదితరులు పాల్గొన్నారు.