– ఒంగోలు ఎస్పీతో మాట్లాడిన ‘వాసిరెడ్డి పద్మ’
అమరావతి: ఒంగోలు నగరం భాగ్యనగర్ కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ స్వాతి మృతిపై పునర్విచారణకు ఏపీ మహిళా కమిషన్ ఆదేశించింది. ఈమేరకు గురువారం ఒంగోలు ఎస్పీతో రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. కిందటి నెలలో అత్తింటి వేధింపులకు బలైన సాఫ్ట్వేర్ ఇంజినీర్ స్వాతి మృతికి సంబంధించి తల్లిదండ్రుల అనుమానాల్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. ఈ కేసుకు సంబంధించిన సమగ్ర దర్యాప్తు నివేదిక కమిషన్ కు పంపాలన్నారు. బాధితురాలి చావుకు కారణమైన వారిలో ఏ స్థాయి వ్యక్తి ఉన్నప్పటికీ పోలీసులు మాత్రం వత్తిడికి గురవరాదని వాసిరెడ్డి పద్మ కోరారు.