– సమగ్ర విచారణ నివేదికకు కాకినాడ ఎస్పీకు లేఖ
అమరావతి: తాడేపల్లి లో మహిళా చేయికోసుకున్న ఘటనపై రాష్ట్ర మహిళాకమిషన్ దృష్టిసారించింది. బాధితురాలికి న్యాయం చేసేందుకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ శుక్రవారం సీఎంఓ అధికారులతో చర్చించారు. బాధితురాలు ఆరుద్ర కేసును రాష్ట్ర మహిళా కమిషన్ సమోటోగా స్వీకరించింది. ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న ఆమె త్వరగా కోలుకునేలా చికిత్సకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వాసిరెడ్డి పద్మ వైద్యులకు సూచనలిచ్చారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి విచారణ వివరాలను కమిషన్ కు సమర్పించాలని కాకినాడ జిల్లా ఎస్పీకు లేఖలో ఆదేశించింది.