Suryaa.co.in

Andhra Pradesh

మహిళా హక్కులకు, భద్రతకు కాంగ్రెస్ మేనిఫేస్టోలో ప్రత్యేక ప్రాధాన్యత

– సీడ్ల్యుసీ సభ‌్యులు గిడుగు రుద్రరాజు

విజయవాడ: నింగిలో సగం… నేలపై సగం అన్నట్లు… మహిళా హక్కులకు, వారి భద్రత, వారి అభివ్రుద్ధికి సంబంధించిన పలు అంశాలకు కాంగ్రెస్ పార్టీ మేనిఫేస్టోలో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని సీడ్ల్యుసీ సభ్యులు, పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు. సమాజంలో మహిళల హక్కుల గురించి అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న మహిళా సంఘాల ఐక్య వేదిక సభ్యులు బుధవారం., విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో గిడుగు రుద్రరాజును కలిసి కాంగ్రెస్ మేనిఫేస్టోలో మహిళ హక్కులకు ప్రాధాన్యత కల్పించాలని వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ.., మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టే విధంగా, నిందితులకు త్వరితగతిన శిక్ష పడేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు, మహిళా రిజర్వేషన్లు, మద్యపాన సమస్య పరిష్కారం, మహిళల భద్రత, వారి అభివ్రుద్ధికి చేపట్టాల్సిన వివిధ అంశాలను కాంగ్రెస్ మేనిఫేస్టోలో చేరుస్తామని, ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని., మహిళా సంఘాల ఐక్య వేదిక సభ్యులకు ఆయన హామీ ఇచ్చారు.

అదే విధంగా ఐక్య వేదిక సభ్యులు కోరుతున్నట్లు.., మహిళలకు మేలు చేసే అన్ని అంశాలనూ.. మేనిఫేస్టోలో చేర్చే విధంగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి, రాష్ట్ర మేనిఫేస్టో కమిటీ ఛైర్మన్, మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు ద్రుష్టికి తీసుకెళ్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీతో పాటు వివిధ పార్టీలకు చెందిన మహిళా సంఘాల ఐక్య వేదిక సభ్యులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE