Suryaa.co.in

Devotional

యజ్ఞోపవీతం బరువు

ఒకరోజు కవిత్వం అంటే ఆసక్తి లేని ఒక రాజు వద్దకు బాగా బక్కచిక్కిన ఒక పేద బ్రాహ్మణుడు వచ్చి తాను రచించిన ఒక కృతిని ఆయన ముందుంచుతాడు. కవిత్వమన్నా, బ్రాహ్మణులన్నా చులకన భావం కల ఆరాజు, హేళనగా “నీకిప్పుడు ఈ పుస్తకమెత్తో, నీయెత్తోధన మివ్వాలా” అంటాడు.
దానికి ఆ వృద్ధ బ్రాహ్మణుడు “అంత అవసరం లేదు మహారాజా, ఈ ఉదయం నేను యజ్నోపవీతం మార్చుకున్నాను, నావద్ద తీసివేసిన ‘జీర్ణయజ్నోపవీతం’ ఉన్నది దానెత్తు ఇచ్చిన చాలునంటాడు.
వీడో పిచ్చాడనుకుని ఆరాజు, కోశాధికారితో వీనికోరెండు కాసులిచ్చి పంపమంటాడు.
దానికా బ్రాహ్మణుడు, తనకు ఆ యజ్నోపవీతమెత్తే కావాలని పట్టబడతాడు.
దానికా రాజు ‘సరదాగా ఆ వేడుకా చూద్దామనుకుని, తాసు తెప్పించి తూచి ఇమ్మని ఆజ్ఞాపిస్తాడు’.
కానీ, వింత ! ఎంత ధనం వేసినా, ఆ రాజ్యంలో సమస్త సంపదలు కూడా దానికి సరతూగలేదు.
దానికి కారణం, ఆ బ్రాహ్మణుని గాయత్రి మంత్ర అనుష్ఠానబలం.
దానితో ఆ రాజుకు కనువిప్పు కలిగి, ఆబక్క బ్రాహ్మణుని శక్తి తెలీయవచ్చి, పాదాక్రాంతుడవుతాడు.

రాజేంద్ర

LEAVE A RESPONSE