జగన్ నోట సోషలిజమా.. సిగ్గుసిగ్గు

-జగన్ రెడ్డి ఫాక్షనిస్టు పాలెగాళ్ల పుస్తకం చరిత్రకు సజీవ సాక్ష్యం
-మోసానికి నిలువుటద్దం లాంటి జగన్ రెడ్డి మోసం గురించి మాట్లాడటమా..?
-వైసీపీ నేతల బూతులు చెవులకింపా..? వేరేవాళ్ల తిట్లకు సుద్దులు చెప్పడం హాస్యాస్పదం
– యనమల రామకృష్ణుడు

అవనిగడ్డలో సీఎం జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయి. ఫాక్షనిస్టు నోట సోషలిజం సూక్తులు సిగ్గుచేటు. ఇడుపులపాయలో వేల ఎకరాల అసైన్డ్ భూముల కబ్జాచేయడమేనా జగన్ రెడ్డి పాటించే సోషలిజం..? నగరానికో ప్యాలెస్ (బెంగళూరు ఎలహంక, హైదరాబాద్ లోటస్ పాండ్, పులివెందుల, తాడేపల్లి) నిర్మాణమే సోషలిజమా? అంతరించిపోయిన ఫ్యాక్షనిజాన్ని మళ్లీ రాష్ట్రంలో విస్తరిస్తూ రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్న జగన్ రెడ్డి.. సోషలిజం గురించి మాట్లాడడం హాస్యాస్పదం.

ప్రజాస్వామ్యమనే మాట జగన్ రెడ్డి నోట రావడమే అతిపెద్ద పరిహాసం. పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్న జగన్ రెడ్డి ఎంతటి ప్రజాస్వామ్యవాదో ప్రపంచమంతా తెలుసు. సెక్రటేరియట్ కు వెళ్లడానికే ముఖం చెల్లని వ్యక్తి ప్రజాస్వామ్యవాది అనిచెప్పుకోవడాన్ని మించిన కామెడీ మరోటి లేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు జగన్ రెడ్డి సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనేలా వ్యవహరించే పప్పెట్ మంత్రులు, అద్దెమైకు ఎమ్మెల్యేలే ప్రజాస్వామ్యమా..? జగన్ రెడ్డిలో మచ్చుకైనా ప్రజాస్వామ్య లక్షణాలున్నాయా..? విలువల గురించి జగన్ రెడ్డి లాంటి వారు మాట్లాడడానికి మించిన బూతు మరోటి ఉంటుందా? చెల్లెళ్లను రోడ్లపాలు చేయడమే విలువలా..? కన్న తల్లిని పార్టీ నుండి, ఇంటి నుండి, చివరికి రాష్ట్రం నుండి గెంటేయడమే జగన్ రెడ్డి పాటించే విలువలా? సొంత బాబాయి హంతకులకు కొమ్ము కాయడమే విలువలా..?

మోసం, దగా, దౌర్జన్యాలు, హత్యలతో నిండా మునిగిన జగన్ రెడ్డి మోసాల గురించి మాట్లాడటం సిగ్గుచేటు. నవరత్నాల పేరుతో నిరుపేదలను మోసం చేసింది నువ్వు కాదా..? రెండో ఏడాదే అమ్మవడిని ఎగ్గొట్టిన మోసగాడెవరు.? మూడేళ్లలో రైతులకు రూ.30వేల కోట్లు ఎగ్గొట్టిన మోస చరిత్ర ఎవరిది? నిరుద్యోగులకు రూ.2వేల భృతిని ఎగ్గొట్టిన మోసగాడెవరు? టీచర్లకు సిపిఎస్ హామీపై మోసం చేసిందెవరు? అన్నాక్యాంటీన్లు మూసివేత మోసం కాదా? అమ్మఒడి పేరుతో ఇచ్చి నాన్నబుడ్డితో లాక్కోవడం మోసం కాదా..? దశలవారీ నిషేధమని చెప్పి వీధివీధినా బెల్టుషాపులు, కల్తీ మద్యం మోసం కాదా..?

జగన్ రెడ్డి ఎంతటి మోసగాడో సిబిఐకి సొంత చెల్లెలు సునీతారెడ్డి అఫిడవిట్టే సాక్ష్యం. తెలంగాణలో రోడ్డున పడ్డ మరో చెల్లి రుజువు. పార్టీ శాశ్వత అధ్యక్షురాలి పదవి నుండి తల్లినే తొలగించిన మోసం నీది. తండ్రి వెంట ఉన్న వారే నీవెంట లేరంటే నువ్వెంత మోసగాడివో ప్రజలకు ఇంకా చెప్పాలా? బూతుల గురించి జగన్ రెడ్డి మాట్లాడడాన్ని మించిన హాస్యం మరొకటి ఉంటుందా? వైసీపీ నేతలు తిట్టే బూతులన్నీ నీ ట్రైనింగే కాదా..? మంత్రులు, ఎమ్మెల్యేలతో బూతులు తిట్టించడం ప్రారంభించినది మీరు కాదా? నీవాళ్లు బూతులు మాట్లాడొచ్చు, ఎదుటివాళ్లు తిడితే నొప్పేసిందా..? చంద్రబాబును చెప్పుతో కొట్టమని, నడిరోడ్డుపై ఉరి తీయమని, కాల్చి చంపేయమని, బంగాళాఖాతంలో పడేయాలని అన్నపుడు ఈ సుద్ధులు ఏమయ్యాయి? కడుపు మండి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులా అన్న నీవే.. అధికారంలోకి వచ్చాక సోషల్ మీడియా ప్రతినిదులపై కేసులు పెట్టడం సిగ్గనిపించడం లేదా? అసెంబ్లీ సాక్షిగా నీవాళ్లు బూతులు తిడుతుంటే, అసలు రాజకీయాలతో సంబంధం లేని మహిళలపై నిందలేస్తే నవ్వుకుంటూ వికటాట్టహాస్ చేసింది నువ్వు కాదా..? ఏపి రాజకీయాలను బూతుల మయం చేసిందే నువ్వు, నీవాళ్లు. టిడిపి అభివృద్ధితో రాజకీయం చేస్తే.. జగన్ రెడ్డి బూతులతో బూతు రాజకీయం చేస్తున్నారు. దీనికి జగన్ రెడ్డి తగిన మూల్యం చెల్లించక తప్పదు.. ‘‘నూరుగొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు నేలకొరిగినట్లు’’ రాబోయే ఎన్నికల్లో నువ్వు, నీ పార్టీ మట్టి కొట్టుకుపోక తప్పదని గుర్తుంచుకో.

Leave a Reply