Suryaa.co.in

Andhra Pradesh

ఓటింగ్‌ను అడ్డుకునేందుకు వైసీపీ అరాచకాలు

-దౌర్జన్యాలు, దాడులతో ప్రజాభిప్రాయాన్ని మార్చలేరు
-సిరా చుక్క బదులు రక్తపు చుక్కలు పారిస్తున్నారు
-అల్లర్లపై ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలి
-ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై ఓటెత్తిన ప్రజలు
-కార్యకర్తలు, ఓటర్ల సంయమనం అభినందనీయం
-టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

మండుటెండలను కూడా లెక్కచేయకుండా తెల్లవారుజాము నుండే ఓటింగులో పాల్గొనేం దుకు పెద్ద ఎత్తున క్యూలైన్‌లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు అద్దం పడుతుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల సందర్భంగా వైసీపీ అల్లర్లు, అరాచకాలపై ఆయన స్పం దించారు. కొన్నిచోట్ల వైసీపీ నేతలు అడ్డంకులు సృష్టించినా లెక్కచేయకుండా ప్రజలు నిర్భయంగా ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. ప్రజా స్పందనను చూసి ఓటమి భయంతో మాచర్ల, రైల్వేకోడూరు, పుంగనూరు వంటి చోట్ల దాడులకు పాల్పడ్డారు. వేలిపై సిరా చుక్క పడాల్సిన చోట రక్తపు చుక్కలు పడేలా చేస్తున్న వైసీపీ నేతలపై ఎన్నికల కమిషన్‌ తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

తెనాలి వైసీపీ అభ్యర్థి దాడి దుర్మార్గం
క్యూలైన్‌లో రమ్మని చెప్పినందుకు తెనాలిలో ఓటరుపై వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ దాడి చేయడం దుర్మార్గం. దాడులు, దౌర్జన్యాలతో ప్రజాభిప్రాయాన్ని మార్చ లేరు. వైసీపీ నేతలు ఇటువంటి కుట్రలు చేస్తారనే ఉద్దేశంతోనే ప్రజలంతా ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకోవాలని నేను పిలుపునిచ్చాను. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వైసీపీ వ్యతిరేక పవనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓటమి ఖాయమని నిర్ధారణ కావడంతో ఎక్కడికక్కడ అల్లర్లకు తెగబడుతున్నారు. ఐదేళ్ల దౌర్జన్యకాండను ఎన్నికల వేళ కూడా కొనసాగిస్తూ దాడులకు, హత్యలకు పాల్పడడం వైసీపీ నేతలు ముందస్తుగా ఓటమి ఒప్పుకోవడమేనని వ్యాఖ్యానించారు.

మహిళలపైకి కిలారు రోశయ్య సిగ్గుచేటు
పోలింగ్‌ కేంద్రాల్లో గొడవలకు దిగుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా విజ్నులైన ఓటర్లు సంయమనంతో వ్యవహరిస్తుండడం అభినందనీయం. పుంగనూరు, మాచర్ల, రైల్వేకోడూరు, మైదుకూరు, ఆముదాలవలస, తాడికొండలో ఎన్టీయే కూటమి ఏజెంట్లపై దాడులకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. తక్కెళ్లపాడు పోలింగ్‌ స్టేషన్‌ వద్ద ఎస్సీ మహిళలపైకి ఎంపీ అభ్యర్థి కిలారు రోశయ్య కారుతో దూసుకురావడం దుర్మార్గం. ఈ ఘటనల్లో బాధ్యులపై ఎన్నికల కమిషన్‌ తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. పోలింగ్‌ ప్రారంభమైనప్పటికీ జగన్‌ రెడ్డి పేరుతో ఇంకా ఓటర్లకు ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ వస్తున్నట్లు పలు చోట్ల నుంచి ఫిర్యాదులు అందాయి. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి వస్తున్న కాల్స్‌పై కూడా ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలి.

వై.పాలెం, నరసరావుపేట, ఆముదాలవలస ఘటనపై సీరియస్‌
యర్రగొండపాలెంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వైసీపీ నేతలపై, నరసరా వుపేటలో ఎంపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు, మాచర్ల అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి వాహ నాలపై దాడి చేసిన వారిపై, తాడిపత్రిలో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్న పెద్దారెడ్డిపై, ఆయన కుమారుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఆముదాలవలసలో తమ్మినేని సీతారాం సతీమణి రిగ్గింగ్‌కు పాల్పడటం అత్యంత హేయమన్నారు. పోలింగు ప్రక్రియకు అంతరాయం కలిగిస్తూ ఓటుహక్కును హరిస్తున్న వారిపై కేంద్ర, రాష్ట్ర ఎన్నిక ల కమిషన్‌లు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని, శాంతియుతంగా ఎన్నికలు జరిగేందుకు ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ నేతల కుట్రలపై టీడీపీ శ్రేణులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

LEAVE A RESPONSE