Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ ఆఫీసుపై వైసీపీ దాడి తప్పే

-నెలకు 4 వేల పెన్షన్ మంచిదే
-బాబు పాలనపై అప్పుడే స్పందించను
-ఇరు వర్గాలు సంయమనం పాటించాలి
-ప్రజలు అంగీకరించలేదు కాబట్టే ఓడిపోయాం
– మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ

విశాఖ: చంద్రబాబుయుడు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వ విధానాలను మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశంసించారు. ప్రభుత్వం ఏర్పడి ఇంకా 20 రోజులే అయినందున, పనితీరుపై ఇప్పుడే తానేమీ స్పందించనన్నారు. నెలకు 4 వేల రూపాయల పెన్షన్ మంచినిర్ణయయమేనన్న బొత్స… గతంలో టీడీపీ ఆఫీసుపై వైసీపీ కార్యకర్తల దాడి తప్పేనన్నారు.

మీడియాతో మాట్లాడిన బొత్స ఇంకా ఏమన్నారంటే.. రూ. 4 వేలు పెన్షన్ ఇవ్వటం మంచిదే. మిగిలిన హామీలను కూడా అమలు చేసే శక్తి వారికి రావాలని కోరుకుంటున్నా. వీసీ ల రాజీనామాలను ప్రభుత్వం కోరటం తప్పు కాదు. వైసీపీ కార్యాలయాల్లోకి కూటమి నేతలు చొరబడితే తప్పు. గతంలో టీడీపీ ఆఫీస్‌పై వైసీపీ నేతలు చేసిన దాడి కూడా తప్పు.

ఉభయ పక్షాల వారు సంయమనం పాటించాలి. రాష్ట్ర విభజన వలన కలిగే నష్టం కంటే, జగన్ పాలన వల్లే నష్టం ఎక్కువైందని అంటున్నారు. ఎప్పుడు నష్టం జరిగింది? ఎప్పుడు లాభం జరిగిందనేది లెక్కల్లో తేలుతుంది . ప్రజలు అంగీకరించలేదు కాబట్టే ఓడిపోయాం.

LEAVE A RESPONSE