Suryaa.co.in

Andhra Pradesh

వినుకొండలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడి అప్రజాస్వామికం

-శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు.. ఏకపక్షంగా వ్యవహరించడం దుర్మార్గం
– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె.అచ్చెన్నాయుడు

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశమే లక్ష్యంగా వైకాపా నాయకులు, శ్రేణులు నిత్యం దాడులు, హత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోంది. పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీ కార్యకర్తలే లక్ష్యంగా వైకాపా శ్రేణులు దాడికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడిలో 15మంది టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.

స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రోద్బలంతోనే ఈ దాడికి తెగబడ్డారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్న విషయాన్ని గమనించాలి. దాడులకు పాల్పడిన వైకాపా కార్యకర్తలను వదిలేసి టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం రాక్షస పాలనకు నిదర్శనం. టీడీపీ కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేసేందుకే పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. శాంతిభద్రతలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైంది. తక్షణమే దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి పరిస్థితిని నియంత్రణలోకి తీసుకురావాలి.

LEAVE A RESPONSE