Suryaa.co.in

Andhra Pradesh

బ్రాహ్మణ జాతికి ద్రోహం చేస్తున్న వైసిపి బ్రాహ్మణ నేతలు…!

జీవో 103 రద్దు చేయకపోతే ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తాం…!!!
బ్రాహ్మణ జీవో పై ప్రభుత్వ నేతలే భిన్న స్వరాలు
బ్రాహ్మణ జాతి ద్రోహులుగా మిగలిపోవద్దు….!!
సోమవారం సాయంత్రం బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ మాట్లాడుతూ బ్రాహ్మణ కార్పొరేషనును బిసి శాఖలో విలీనం చేస్తూ ఇచ్చిన జివో.103 జారీచేసిన విధానంపై రాష్ట్ర వ్యాప్తంగా వివాదం నెలకొన్న నేపధ్యంలో బాపట్ల శాసన సభ్యులు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోనా రఘుపతి నిన్న గుంటూరులో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్రాహ్మణ కార్పొరేషన్ ను బిసిల్లో కల్పినందువల్ల బ్రాహ్మణులకు పెద్దగా నష్టం ఏమి జరగదని, చెప్పడంవల్ల రాష్ట్ర బ్రాహ్మణ సమాజం మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయని… పెద్దగా జరగదు అంటే ఎంతోకొంత జరుగుతుందని చెప్పకనే ఆయన చెప్పారు. కోనా గుంటూరులో ఈ విధంగా మాట్లాడితే, తిరుపతిలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రాష్ట్ర బ్రాహ్మణ నేతలు కలిసి జీవో 103 రద్దు చేయమని కోరుతూ వినతిపత్రం ఇచ్చిన నేపధ్యంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకు వెళ్లి జీవో రద్దు అయ్యే విధంగా కృషి చేస్తానని రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణుల మనోభావాలు కాపాడే విధంగా జీవో రద్దు పరుస్తామని హామీ ఇస్తూ మాట్లాడారు. ఈరోజు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ బ్రాహ్మణ కార్పొరేషన్ మిగిలిన అగ్రవర్ణాలలో ఉన్న కార్పొరేషన్ లను బి.సి శాఖ కిందకు తెచ్చే విధంగా చేయాలని  ముఖ్యమంత్రి  జగన్ ఆదేశించినట్లు మీడియా సమావేశంలో తెలియజేశారు. ఒకే ప్రభుత్వంలో పనిచేస్తున్న వీరు రకరకాలుగా మాట్లాడటంపై పలు అనుమానాలు ,కుట్ర దాగి ఉన్నాయని బ్రాహ్మణ కార్పొరేషన్ కు కొత్త చైర్మన్గా నియమించిన సీతారామరాజు సుధాకర్ జిఓ ఇచ్చిన నాటినుండి పత్తాలేకుండా పోయాడని జీవో పై ఎంత వివాదం జరుగుతున్నా కనీసం నోరు మెదపకుండా ఎందుకు దాక్కున్నాడని శ్రీధర్ ప్రశ్నించారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో కార్పొరేషన్ ఏర్పాటు చేసిన 3ఏళ్ళల్లో 310 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి పారదర్శకంగా బ్రాహ్మణ సంక్షేమం కోసం ఖర్చు చేయడం జరిగిందని… వైయస్ జగన్ ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు అయినా అర్చకులకు, పురోహితులకు, పేద మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాలకు ఒక్క రూపాయి బడ్జెట్కూడా కేటాయించకుండా ఎందుకు బ్రాహ్మణ సంక్షేమాన్ని విస్మరించారని శ్రీధర్ ప్రశ్నించారు. వైజాగ్ పాదయాత్ర బ్రాహ్మణ మీటింగ్లో బ్రాహ్మణ కార్పొరేషన్ కు 1000 కోట్లు, చట్టబద్దత కల్పిస్తా అన్న జగన్ హామీలు ఏమయ్యాయని, వైసీపీ ప్రభుత్వం లో వివిధ హోదాల్లో చాలామంది బ్రాహ్మణ నేతలు పనిచేస్తున్నారని ఇంత వివాదం జరుగుతున్నా పరిష్కరించే దిశగా ప్రయత్నాలు ఎందుకు చేయట్లేదు అని మీకు బ్రాహ్మణ జాతి ప్రయోజనాల కన్నా మీ ప్రభుత్వ, మీ పార్టీ ప్రయోజనాలే ముఖ్యమాయని, ఒకపక్క ప్రభుత్వ పరంగా బ్రాహ్మణ జాతికి ద్రోహం జరుగుతుంటే పట్టించుకోకుండా జాతి ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. తక్షణమే 103 జీవోను రద్దు చేసి బ్రాహ్మణ జాతికి అనుబంధంగా ఉండే దేవాదాయ శాఖ లో బ్రాహ్మణ కార్పొరేషన్ ను విలీనం చేసేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో దెబ్బతిన్న బ్రాహ్మణ మనోభావాలతో పెద్ద ఎత్తున బ్రాహ్మణ సమాజం తో కలిసి ముఖ్యమంత్రి మరియు బ్రాహ్మణ శాసనసభ్యుల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీల అధిష్టానాలు దెబ్బతిన్న బ్రాహ్మణ మనోభావాల పట్ల తక్షణమే స్పందించాలని,బ్రాహ్మణ జాతికి అండగా నిలవాలని డిమాండ్ చేశారు.

శిరిపురపు శ్రీధర్ శర్మ
రాష్ట్ర అధ్యక్షుడు
బ్రాహ్మణ చైతన్య వేదిక

LEAVE A RESPONSE