Suryaa.co.in

Andhra Pradesh Uncategorized

దొడ్డిదారిన వైసీపీ దొంగ ఓట్లు!

రాష్ట్రంలో ఓట్ల తొలగింపు, ఓటర్ లిస్టు సవరణలో అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫిర్యాదు
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కుట్రపూరితంగా జరిగిన ఓట్ల తొలగింపుపై సమగ్ర విచారణ జరపాలని లేఖ
వేల సంఖ్యలో ఫారం – 7 దరఖాస్తులను కిరాయి ఏజెన్సీల ద్వారా దాఖలు చేసి అర్హులైన, టీడీపీ సానుభూతిపరులను తొలగించారు అని ఫిర్యాదు
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నియమించిన సచివాలయ సిబ్బంది స్థానంలో టీచర్లను / అంగన్ వాడీ వర్కర్లు/ పంచాయితీ / రెవెన్యూ సిబ్బందిని నియమించాలని విజ్ఞప్తి
వాలంటీర్లు సేకరించిన సమాచారాన్ని ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించడంపై దర్యాప్తు జరపాలని లేఖలో కోరిన చంద్రబాబు
2019 తరువాత జరిగిన పలు ఎన్నికల్లో అక్రమాలు, అధికార పార్టీ ఒత్తిళ్ల కారణంగా ఎన్నికల ప్రక్రియను చెరపట్టిన విధానంపై లేఖలో ప్రస్తావన
పంచాయతీ ఎన్నికల్లో అక్రమ ఏకగ్రీవాలు, కొందరు అధికారుల పాత్రను సాక్ష్యాలతో లేఖలో ప్రస్తావించిన చంద్రబాబు
పంచాయతీ ఎన్నికల్లో నామిమేషన్ల ప్రక్రియలో అక్రమాలు, తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల వ్యవహారం, పట్టభద్రుల ఎన్నికల్లో తప్పుడు విధానాలను లేఖలో వివరించిన చంద్రబాబు నాయుడు
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో వైసీపీ నియమించిన గృహ సారధులు, వాలంటీర్ల ద్వారా జరుగుతున్న అక్రమాలను అడ్డుకోవాలని కోరిన చంద్రబాబు
రాష్ట్రంలో అధికార యంత్రాంగం ప్రభుత్వ ఒత్తిడికి లోనై ఎన్నికల సంఘం నిబంధనలు, ఆదేశాలను పాటించడం లేదని ఫిర్యాదు
2019 నుంచి పలు ఎన్నికల్లో జరిగిన అక్రమాల పై చేసిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోలేదన్న చంద్రబాబు
1950 ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం నిష్పక్షపాత ఎన్నికలను నిర్వహించడం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరిన చంద్రబాబు నాయుడు
రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా ECI స్వయంగా పర్యటించి వాస్తవాలు తెలుసుకోవాలని విన్నపం

లేఖలో అంశాలు:-

• నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ అపహాస్యానికి గురి అయ్యింది.
• ఎన్నికల యంత్రాంగం తన విధుల నిర్వహణలో పూర్తిగా విఫలం అయ్యింది.
• దాడులు, బెదిరింపుల ద్వారా ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ చేయకుండా పలు సందర్భాల్లో నిరోధించారు.
• పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించి రాజకీయ పార్టీల ఏజెంట్లు పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్లుగా వ్యవహరించకుండా అడ్డుకున్నారు.
• ప్రభుత్వ బెదిరింపులతో పాలనా యంత్రాంగం ఈ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయింది.
• ఈసీఐ నిబంధనలకు విరుద్దంగా ఎన్నికల ప్రక్రియలోకి గ్రామ/ వార్డు సచివాలయం సిబ్బంది రూపంలో సమాంతర ఎన్నికల యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు .
• నేపథ్యం:-
• 2020-21 సంవత్సరంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేక అక్రమాలు జరిగాయి.
• రాజకీయ బలం, అక్రమ కేసులు, దాడులు, బెదిరింపులతో పెద్ద ఎత్తున ఎన్నికలను ఏకగ్రీవాలు చేసుకున్నారు.
• నామినేషన్ల దాఖలుకు అవసరమైన కుల ధృవీకరణ పత్రాలు, ఇంటి పన్ను రశీదులు ఇవ్వకపోవడం, నామినేషన్లను అకారణంగా ‘తిరస్కరించడం’ వంటి చర్యలకు పాల్పడ్డారు.
• తప్పుడు పద్దతిలో జరిగిన పంచాయతీ ‘ఏకగ్రీవాల గురించి రాష్ట్ర ఎన్నికల కమీషనర్ స్వయంగా కేంద్రానికి ఫిర్యాదు చేశారు. చివరకు అతను కేంద్ర భద్రత కూడా కోరాల్సిన అవసరం ఏర్పడింది.
• తరువాత జరిగిన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల సందర్భంగా ఓటర్ల గుర్తింపు కోసం నకిలీ ఆధార్ కార్డులు, ఫోటో ఐడెంటిటి కార్డులను తయారు చేశారు
• 2023లో తిరుపతిలోని పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరక్షరాస్యులైన వ్యక్తులను నకిలీ పత్రాలతో ఓటర్లుగా నమోదు చేశారు.
• ఎన్నికల సంఘానికి చెందిన ముఖ్య అధికారి అయిన సీఈవోకు జిల్లా పాలనా యంత్రాంగం సహకరించడం లేదు
• ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ‘గృహ సారధులు’, ‘సచివాలయ కన్వీనర్ల’ పేరుతో వైఎస్సార్‌సీపీ పార్టీ నామినేట్‌ చేసిన నాయకుల పర్యవేక్షణలో ఓటర్ల సవరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
• రెవెన్యూ, పంచాయితీ రాజ్ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీల వంటి ECI సూచించిన సిబ్బంది స్థానంలో సచివాలయ సిబ్బందిని బూత్ స్థాయి అధికారులుగా నియమించారు.
• రాష్ట్ర ప్రభుత్వం, 29 నవంబర్ 2022 గెజిట్ 2791 ప్రకారం ఎన్నికల నిర్వహణ చూసే సిబ్బంది జాబితా నుండి ఉపాధ్యాయులను తొలగించింది.
• ప్రభుత్వ తప్పుడు విధానాలను రాస్తున్న మీడియా సంస్థలపైనా కేసులు పెడుతున్నారు. ఛానెళ్లపై రాజద్రోహం కేసులు పెట్టారు.
• వాలంటీర్లు ప్రభుత్వం నుంచి 5000/- గౌరవ వేతనం పొందతూ అధికార పార్టీ నాయకుల బ్లాక్ మెయిల్ కు తలొగ్గి రాజకీయ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.
• ECI నిర్దేశించిన నిబంధనలను అనుసరించకుండా ఫారం-7 దరఖాస్తుల ద్వారా పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు జరుగుతోంది.
• అర్హత ఉన్నవారిని తొలగించడానికి కాంట్రాక్ట్ ఏజెన్సీల ద్వారా భారీ సంఖ్యలో ఫారం -7లు ఆన్ లైన్ లో దాఖలు చేస్తున్నారు.
• ఓటరు జాబితాలను ఇంటి నంబర్ల వరుస క్రమంలో నిర్వహించాలని, ఒకే కుటుంబ సభ్యులందరినీ ఒకే బూత్‌కు కేటాయించాలని ఈసీ ఆదేశించింది. ఇప్పటి వరకు చాలా నియోజకవర్గాల్లో ఇది జరగలేదు.
• విశాఖ తూర్పులో దాదాపు 40 వేల ఓట్ల తొలగింపు అక్రమంగా తొలగించారు.
• పర్చూరు నియోజకవర్గంలో 10,000 ఓట్ల తొలగింపు కోసం ఫారం-7 అప్లికేషన్లు ఇచ్చారు.
• విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 23,000 ఓట్లను తొలగించారు.
• ఉరవకొండ నియోజకవర్గంలో 6 వేల ఓట్లు అక్రమ పద్దతుల్లో తొలగించారు.
మచిలీపట్టణం, కాకినాడ అర్భన్, రాప్తాడు, కొండేపి, కనిగిరి,చంద్రగిరి నియోజకవర్గాలలో ఓటర్ల జాబితాలో భారీ అవకతవకలు.
• పట్టభద్రుల ఓటరు జాబితాలో బోగస్‌ ఓటర్ల నమోదుపై పలుమార్లు ఆధారాలతో ఫిర్యాదు చేసినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
• ఎన్నికలలో బూత్ క్యాప్చరింగ్‌లో పాల్గొన్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ECI ఆదేశించినా చర్యలు తీసుకోలేదు.
• విశాఖపట్నంలో 40 వేల ఓట్ల తొలగింపుపైనా ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
• అర్హులైన పౌరులందరికీ ఓటు హక్కును నిరాకరించాలనే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది.
• డబ్బు, కండబలం, హింస తో 2024 ఎన్నికల్లో గెలవాలని చూస్తోంది.
• అందుకే ECI ఆంధ్రప్రదేశ్‌ను అత్యంత సున్నితమైన రాష్ట్రంగా చూడాల్సిన అవసరం ఉంది.
• ECI ప్రతి స్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ యంత్రాంగాన్ని నియమించాలి.
• స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్ధారించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి.
• అర్హులైన ప్రతి ఓటరును ఎలక్టోరల్ రోల్స్‌లో చేర్చాలి
• చనిపోయిన వారి, నకిలీ ఓటర్లు పేర్లు తొలగించాలి.
• కుట్ర పూరితంగా జరిగిన ఓట్ల తొలగింపును సమీక్షించి కఠిన చర్యలు తీసుకోవాలి.
• అలా తొలగించినవారిని తిరిగి ఫారం 6 ద్వారా పునరుద్ధరించాలి
• పెద్దమొత్తంలో దాఖలు చేసిన ఫారమ్-7 దరఖాస్తులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి
• రూల్-17 ప్రకారం బల్క్ దరఖాస్తులను తిరస్కరించాలి.
• వాలంటీర్లను ఎన్నికల సంబంధిత పని నుండి దూరంగా ఉంచేలా చూడాలి
• పౌరుల ఆధార్ నంబర్‌లు, ఓటర్ల డేటాను సేకరించడం, ప్రైవేటు ఏజెన్సీలకు డేటాను అందజేయడం పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి
• ECI వద్ద పెండింగ్‌లో ఉన్న అన్ని ఫిర్యాదులపై వెంటనే విచారించి, కాలపరిమితితో కూడిన చర్యలకు ఉపక్రమించాలి
• ఎలక్టోరల్ రోల్స్‌పై మాన్యువల్‌లో పేర్కొన్న విధంగా ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయులు, ఇతర డిపార్ట్‌మెంట్ సిబ్బందిని ఉపయోగించే విధంగా AP ప్రభుత్వాన్ని ఆదేశించండి.
• రాష్ట్రంలో అసాధారణమైన పరిస్థితుల దృష్ట్యా, భారత ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూసేందుకు, తీవ్ర పరిస్థితులను అంచనా వేయడానికి స్వయంగా సందర్శించాల్సిన అవసరం ఉంది.
• సాంకేతిక నిపుణులతో కూడిన హై-పవర్ కమిటీని పర్యవేక్షణ కు ECI చర్యలు తీసుకోవాలి
• రాష్ట్రం ఎన్నికల పనుల్లో నిమగ్నమైన పరిపాలనా యంత్రాంగమంతా అధికార పార్టీ కబంధ హస్తాల్లో చిక్కుకుంది.
• అతిపెద్ద ప్రజాస్వామ్యం యొక్క ఎన్నికల ప్రక్రియ సమగ్రతను రక్షించే స్వతంత్ర రాజ్యాంగ సంస్థగా ప్రజల హక్కులను కాపాడేందుకు ECI తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము
• 1950 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు ECI చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.

LEAVE A RESPONSE