ఆటలాడటమా?ఆదుకోవడమా?

-వైసిపి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి
కేవీపీ, సూర్యుడు, నమ్ముకున్న జైలు మేట్ మోపిదేవి వెంకటరమణ అందరికి అదే ద్రోహం
– పిల్లలకు ట్యాబుల్లో ఇచ్చిన కంటెంట్ లో కూడా అవినీతే
– ప్రజలు ఆదుకోమని వేడుకుంటుంటే జగన్ ఆటలాడుకుందాం అంటున్నాడు
– తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు

ఇబ్రహీంపట్నం: జగన్ ఆటలాడుకుందాం అంటున్నారు .. ప్రజలు ఆదుకోమని వేడుకుంటున్నారు.ఆటలాడటమా ? ఆదుకోవడమా? వైసిపి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి.వైసిపి ఎమ్మెల్యేలు మంత్రులకు పేకాట క్యాసినో క్లబ్బుల మీద ఉన్న ఆసక్తి ప్రజలను ఆదుకోవడంలో లేదు.జగన్ కు ఓట్లు వేసిన పులివెందుల ప్రజల దగ్గర నుంచి ఎత్తుకొని పెంచిన చిన్నాన కిరాతక హత్య వరకు అందరికీ నమ్మకద్రోహం చేశాడు. కేవీపీ, సూర్యుడు, నమ్ముకున్న జైలు మేట్ మోపిదేవి వెంకటరమణ అందరికి అదే ద్రోహం.

ఆళ్ల రామకృష్ణ రెడ్డి దగ్గర నుండి ప్రశాంత్ శాంతి కిషోర్ వరకు.. జగన్ పెట్టుకున్న వాలంటీర్ వ్యవస్థ ను సైతం మోసపు మాటలతో నమ్మకద్రోహం చేశాడు.పులివెందులలో నిన్ను నమ్ముకున్న కార్యకర్తలే నిన్ను ప్రశ్నిస్తుంటే ఏంటన్నా దెబ్బలాడడానికి వచ్చారా అంటున్నావ్ ! ఇక మీ పరిస్థితి రాష్ట్రంలో ఏ విధంగా ఉందో అర్థం అవుతుంది.34 వేల ఎకరాలు ఇచ్చిన రైతులు భూములను బీడు పెట్టుకొని ఇబ్బంది పడుతున్నారు. అమరావతితో మూడుముక్కలాట ఆడుతున్నారు రైతులకు కౌలు డబ్బులు కూడా వేయలేదు.ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానని 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారని హామీ ఇచ్చి నమ్మకద్రోహం చేశారు.

23 సీట్లు వచ్చాయి దేవుడు స్క్రిప్ట్ అని ఎగతాళి చేసి ఎగిరేగిరి పడ్డ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని 160 అడుగుల గొయ్యలో కప్పి పెట్టటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.ప్రభుత్వ పరిధిలో ఒక్క స్టేడియం లో కూడా సరిగ్గా మెయింటైన్ చేయడం లేదు. సినిమాలకు వ్యూహాలకు ఫ్రీ రిలీజ్ లకు స్టేడియంలు వాడుతున్నారు.తెదేపా హాయాంలో నేషనల్ లెవల్లో క్రీడలను ప్రోత్సహించాం.క్రీడాకారులు ఆడుకునే స్పోర్ట్స్ క్లబ్బులకు నీ పేరు అవసరమా జగన్ మోహన్ రెడ్డి ?

ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఒక 100 కోట్లు ఖర్చుపెట్టి క్రీడాకారులను ఉద్ధరించామని గొప్పలు చెప్పుకోవడానికా ఈ హడావుడి? పిల్లలకు ట్యాబుల్లో ఇచ్చిన కంటెంట్ లో కూడా అవినీతే.15 రోజులుగా అంగనవాడి ఆయాలు, టీచర్లు ఉద్యమం చేస్తున్నారు.చంద్రబాబు నాయుడు గారు 34 వేల ఎకరాల్లో అభివృద్ధి చేస్తే దాన్ని మూలన పడేశారు కేవలం 10 శాతం పనులు చేస్తే అది పూర్తి అవుతుంది.మున్సిపల్ స్టేడియంలో ఎవరైనా వెళ్లి ఆడుకోవచ్చు ఇటువంటి స్టేడియం లో కూడా 50 రూపాయలు నుంచి 1000 రూపాయలు ఫీజులు పెట్టి డబ్బులుసులు చేసిన చరిత్ర వైసిపి ప్రభుత్వానిది సిగ్గుపడాలి.

నిరుద్యోగులకు ఎక్కడ జాబ్ కేలండర్ లేవు అన్ని కంపెనీలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయి.లక్షల మంది నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు లేక బయట ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. లక్షల సంఖ్యలో గ్యాస్ కనెక్షన్లకు పక్క రాష్ట్రాలకు మారిపోయాయి.పుల్లెల గోపీచంద్ కు హైదరబాద్ లో 5 ఎకరాలు ఇస్తే ఎంతోమంది టెన్నిస్ లో పేరు ప్రఖ్యాతలు తీసుకురావడం జరిగింది.

2017లో కూడా అమరావతిలో 17 ఎకరాలు ఇచ్చారు.ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక్క క్రీడాకారుడి పేరు కూడా చెప్పే పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేదు. ఈ 55 నెలల్లో ఏ స్టేడియం అయినా ప్రారంభించడం పూర్తి చేయటం చేశారా ఒక్కటైనా జరిగిందా దీనికి సమాధానం లేదు ?

Leave a Reply