Suryaa.co.in

Telangana

ప్రధాని మోదీతో గంటపాటు సమావేశమైన సీఎం రేవంత్‌, భట్టి

– గత ప్రభుత్వం తెలంగాణ సమస్యలను.. కేంద్రం దృష్టికి తీసుకెళ్లలేకపోయందన్న భట్టి
– ఐఐఎంను తెలంగాణలో ఏర్పాటు చేయాలని.. సైనిక స్కూల్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశామన్న భట్టి విక్రమార్క

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దాదాపు గంట పాటు ప్రధాని మోదీ తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై ప్రధానితో వారు చర్చించారు. అభివృద్ధి ప్రాజెక్టులు, నిధుల మంజూరు గురించి చర్చించినట్టు సమాచారం. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధానిని కలవడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.

విభజన చట్టంలో హామీలను మోదీ దృష్టికి తీసుకెళ్లాం

తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని అడిగాం. బయ్యారం ఉక్కు కర్మాగారం విషయాన్ని మోదీ దృష్టికి తీసుకెళ్లాం.కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరాం. పొలమూరు, రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కోరాం.

LEAVE A RESPONSE