ఎన్నికల సంఘంపై వైకాపాకు పూర్తి విశ్వాసం

ఎంపీ విజయసాయి రెడ్డి

భారత రాజ్యాంగ సంస్థ ఎన్నికల సంఘం స్వతంత్రత, అధికారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి విశ్వాసం ఉందని, ఈ మేరకు తాము సమర్పించిన ఫిర్యాదులను పరిశీలిస్తుందని గట్టిగా నమ్ముతున్నామని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు. సోషల్ మీడియాలో బుధవారం ఈ అంశంపై తనదైన శైలిలో స్పందించారు. ఓటర్ల జాబితా నిర్వహణ, గుర్తింపు కార్డులు జారీ చేసే అధికారం కేంద్ర ఎన్నికల సంఘం, స్వీప్ కు మాత్రమే ఉంటుందని అన్నారు.

లక్ష ఎకరాలు సస్యశ్యామలం
రికార్డు సమయంలో నెల్లూరు బ్యారేజీ పనులు పూర్తి చేసి లక్ష ఎకరాలు సస్యశ్యామలం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని విజయసాయి రెడ్డి అన్నారు. కరోనా కాలంతో పాటు పెన్నాకు పోటెత్తిన వరదల్లోనూ పనులు కొనసాగించారని అన్నారు. బ్యారేజీ పనులు పూర్తి కావడంతో రైతులు ఆనందోత్సహాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఆయకట్టులో విస్తారంగా పంటలు సాగు సాధ్యం కాబోతుందని అన్నారు. నెల్లూరు, 77 గ్రామాల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఏర్పడిందని విజయసాయి రెడ్డి అన్నారు.

Leave a Reply