అయోధ్యలో సౌరశక్తితో నడిచే వీధిలైట్ల ఏర్పాటు

ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ లైట్ ప్రాజెక్ట్ ఎక్కడ అని ఎవరైనా అడిగితే… ఏం సమాధానం చెబుతారు? అమెరికా, జపాన్, కొరియా లేదా యూరప్ దేశాల పేరు చెబుతా రు. అయితే ఇక నుంచి ఇక్కడకు అయోధ్య పేరు రానుంది. అయోధ్యలో సౌరశక్తితో నడిచే వీధిలైట్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిని గుప్తర్ ఘాట్ , లక్ష్మణ్ ఘాట్ మధ్య 10.2 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నారు. జనవరి 22 నాటికి ఈ పనులు పూర్తవుతాయి. ప్రస్తుత ప్రపంచ రికార్డు సౌదీ అరేబియాది, ఇక్కడ 9.7 కిలోమీటర్ల పొడవునా సోలార్ లైట్లు అమర్చబడ్డాయి.

Leave a Reply