– దళితుల గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు
– మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
అమరావతి: మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భ్రమలో బతుకుతున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. బుధవారం ఆయన మీడియా తో మాట్లాడుతూ…. గత ప్రభుత్వం ఫీజులు బకాయిలు పెట్టి విద్యార్థులను ఇబ్బంది పెట్టింది. వైసీపీ హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేదని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను పరీక్షలు రాయనివ్వలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేం చర్యలు తీసుకున్నాం.
కమీషన్ల గురించి మాట్లాడే అర్హత జగన్ రెడ్డికి లేదు. అవినీతి, కమీషన్లలో అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర పరువు తీసిన వ్యక్తి జగన్… కమీషన్ల గురించి జగన్ మాట్లాడుతుంటే వైసీపీ కార్యకర్తలే నవ్వుకుంటున్నారు. దళితుల గురించి మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదు. దళిత శాసన సభ్యులపైనే జగన్ దాడి చేయించారు. వైసీపీ పాలనలో దళితులకు శిరోముండనం చేశారు. దళితుడైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపి డోర్ డెలివరీ చేశారు. అలాంటిది ఇప్పుడు దళితుల గురించి మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుటికైనా వాస్తవాలు గ్రహించాలి.. భ్రమలో ఉంటే పూర్తిగా పతనం అవుతారని మంత్రి అన్నారు.