– బీజేపీ వ్యతిరేకంగా దత్తపుత్రుడు జగన్ ఒక్క ఉద్యమం కూడా చేయడు
– జగన్ తనకు పనికి వచ్చే ఉద్యమాలు మాత్రమే చేస్తాడు
– స్వార్థ రాజకీయాలకు జగన్ నంబర్ 1
– బీజేపీ మీద జగన్ ఈగ వాలనీయడు
– అన్నదాత సుఖీభవ కాదు. అన్నదాత దుఃఖిభవ
– సూపర్ సిక్స్ హామీలకు అన్నింటిలో కోతలే…
– 43 లక్షల మంది రైతులకు అన్యాయం చేయాలని చూస్తున్నారు
– రాష్ట్రంలో బాబు, జగన్, పవన్ బీజేపీకి తొత్తులే..
– కాంగ్రెస్ లో వర్గపోరు లేదు…. సీనియర్లు ఎవరు కూడా దూరం కాలేదు
– విలేఖర్ల సమావేశంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
కాకినాడ: సూపర్ సిక్స్ సూపర్ ప్లాప్.. అన్నదాత సుఖీభవ పథకాన్ని దుఃఖిభవ చేస్తున్నారు.. రాష్ట్రంలో 93 లక్షల మందికి పైగా రైతులు ఉన్నారు.. అర్హత పేరుతో సగానికి సగం మంది రైతులకు కోత పెట్టారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా విమర్శించారు. ఈ మేరకు ఆమె శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. 47 లక్షల మందికే పథకం వర్తింప జేస్తారట.. ఇది 43 లక్షల మంది మిగతా రైతులకు చేస్తున్న అన్యాయమని విమర్శించారు. ఆమె ఇంకా, ఏమన్నారంటే.. వడపోత పేరుతో తీవ్ర అన్యాయం జరుగుతుంది.
సూపర్ సిక్స్ పథకాలకు కోత పెట్టడం ఏంటి? హామీలు ఇచ్చే ముందు ఎందుకు కోత పెడతాం అని చెప్పలేదు?
తల్లికి వందనం పథకం కింద కోతలే. 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే..67 లక్షల మందికే ఇచ్చారు. 20 లక్షల మందికి మోసం చేశారు.
మహాశక్తి పథకాన్ని మోసం చేశారు. ఎన్నికల ముందు 15 వందలు పీ4 కింద లింక్ పెడతాం అని ఎందుకు చెప్పలేదు? ఇంత వరకు మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు కాలేదు. ప్రజల పక్షాన వైసీపీ చేసేది నిజమైన ఉద్యమం కాదు. జగన్ కి పనికి వచ్చే ఉద్యమాలు మాత్రమే తీసుకుంటారు. బీజేపీ మీద విమర్శ చేసే ఉద్యమాల జోలికి వెళ్ళరు. బీజేపీ మీద జగన్ ఈగ వాలనీయడు. కాంగ్రెస్ ఒక మహా సముద్రం. పిల్ల కాలువలు అన్ని సముద్రంలో కలవాల్సిందే.. కాంగ్రెస్ లో సీనియర్లు ఎవరు కూడా నిరుత్సాహంగా లేరు. ఎటువంటి వర్గపోరు లేదు.
అందరినీ కలుపుకొని పని చేస్తున్నాం.. ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తాం.
రాష్ట్రానికి బీజేపీ తీవ్ర అన్యాయం చేస్తోంది. విభజన హామీలను విస్మరిస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ కు తీవ్ర అన్యాయం చేశారు. ఎత్తు తగ్గించి ప్రాజెక్ట్ ను వినాశనం చేస్తున్నారు. ప్రాజెక్ట్ 45 మీటర్ల ఎత్తులో కడితేనే ప్రయోజనం.
41 మీటర్ల ఎత్తులో కడితే అది ప్రాజెక్ట్ కాదు..బ్యారేజ్ మాత్రమే. ఇంత అన్యాయం జరుగుతున్నా రాష్ట్ర ఎంపీలు పట్టించుకోవడం లేదు. బీజేపీకి బాబు, పవన్, జగన్ గులాం గిరి చేస్తున్నారు. రాజధాని కి నిధులు కేంద్రం ఇవ్వాలి. కానీ అప్పులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఇదెక్కడి అన్యాయం? ఇంత మోసం జరుగుతుంటే కూటమి కట్టి బీజేపీ కి మద్దతు ఇవ్వడం దారుణం.
రాష్ట్రానికి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ తోనే విభజన హామీలు సాధ్యం. పోలవరం పూర్తి చేయాలి. అంటే కాంగ్రెస్ రావాలి. రాజధాని కట్టాలి అంటే కాంగ్రెస్ రావాలి. పార్టీ బలోపేతం కోసమే జిల్లాల పర్యటనలు చేస్తున్నాం. ప్రజల పక్షాన పోరాటాలు ముమ్మరం చేస్తాం. ఈ రాష్ట్రంలో బీజేపీ నీ ఎదిరించే దమ్మున్నది ఒక్క కాంగ్రెస్ కి మాత్రమే.. అధికార, ప్రతిపక్షాలు అన్ని బీజేపీ తొత్తులే. ప్రజల గురించి పోరాటం చేసేది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే.