– ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నివాళులు
హైదరాబాద్ : మాజీ ప్రధాన మంత్రి ,భారతరత్న ఆర్థిక సంస్కరణల పితామహుడి .నరసింహారావు జయంతి సందర్భంగా జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి . ఈ సందర్భంగా పీవీ నరసింహారావు సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు.
బహుభాషాకోవిదుడి గా, రచయితగా, ఆర్థిక సంస్కరణల పితామహుడిగా ఆయన దేశానికి ఎనలేని సేవలను అందించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు.దేశాన్ని ప్రగతిపథంలో నడిపించడంలో పీవీ పాత్ర ఎనలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేంద్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, సత్తుపల్లి మట్టా రాగమయి ,టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు.