ఫేక్ లెటర్ వెనుక వైసీపీ

డ్రగ్ మాఫియా వెనుక వైసీపీ హస్తం
చాక్లెట్ లో మత్తు పదార్థాల తయారీ సంస్థ వైసీపీ నాయకుడు పుత్ర రత్నానిది
బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పేరిట సృష్టించిన ఫేక్ లెటర్ పై చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర శాఖ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు

– బిజెపి రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాజీ

విజయవాడ:సంధ్య ఎక్స్పోర్ట్ కేసుకు మనస్తాపం చెంది పురంధేశ్వరి రాజీనామా చేసినట్టు ఫేక్ లెటర్ సృష్టి కి వైసీపీ సోషల్ మీడియా కారణం.ఈ రాజీనామా వార్తను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. నకిలీ లెటర్ హెడ్, నకిలీ సంతకం తో లెటర్ సృష్టించారు. వైసీపీ సొషల్ మీడియా కు మాత్రమే ఈ విధమైన అవసరం ఉంది

ఈ నకిలీ రాజీనామా పత్రం ట్రోలింగ్ పై సైబర్ క్రైం పోలీసు స్టేషనులో కంప్లైంట్ ఇచ్చాం. సంధ్య మెరైన్స్ నుంచీ బయటకి వెళ్ళిపోయిన ఆర్ధిక నేరస్థుడు వీరభద్రరావు పెట్టుకున్న కంపెనీ సంధ్య ఆక్వా ఎక్సపోర్టు కంపెనీ..వైసీపీ నాయకులతో సంబంధాలు ఈ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీకి ఉన్నాయి

చంద్రబాబును అరెస్టు చేసినపుడు ఒక నకిలీ లెటర్ హెడ్ పై వచ్చిన సమాచారన్ని అప్పుడు ఖండించాం. అబద్ధాలు ప్రచారం చేసి ప్రజల మనసుల్లో తప్పుడు ముద్ర వేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీ నేతలు కీలక పాత్ర పోషించారు. సీబీఐ దర్యాప్తు లో వైసీపీ నేతలు ముద్దాయి లు కానున్నారు. బీజేపీ వైసీపీ కి ఛాలెంజ్ విసిరుతోంది. డ్రగ్ మాఫియా వెనుక వైసీపీ హస్తం ఉంది.

దేశం లో ఎక్కడైనా డ్రగ్ దొరికితే వాటి మూలాలు ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్నాయి.గతంలో చాక్లెట్ లో మత్తు పదార్థాలు వెలికి చూస్తే చాక్లెట్ తయారీ సంస్థ వైసీపీ నాయకుడు పుత్ర రత్నానిది అని తేలింది. వైసీపీ కుట్ర కోణాలు వెలుగు చూడక తప్పదు.

బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు ట్విట్టర్ ఎకౌంట్ కూడా, బ్లూటిక్ తో సహా ఫేక్ ఎకౌంటు సృష్టించారని బాజీ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బిజెపి లాయర్స్ సెల్ నేత హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply