– యువనేత లోకేష్ ఎదుట మైనారిటీ కార్యకర్త ఆవేదన
వైసిపినేతలు తనను కక్షగట్టి వేధిస్తన్నారని సంగం మండలం పడమటి నాయుడుపాలెంకు చెందిన షేక్ రసూల్ ఆవేదన వ్యక్తంచేశాడు. బొమ్మవరం క్యాంప్ సైట్ లో లోకేష్ ను కలిసి తమ గోడు విన్పిస్తూ… 2020లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నేను, నా భార్య నామినేషన్లు వేస్తే, వైసిపినేతలు వత్తిడి చేసి ఉపసంహరింపజేశారు. ఆ తర్వాత 2021 మే 2వ తేదీన చింతకాయల ఆదిలక్ష్మి అనే మహిళతో రేప్, హత్యాయత్నం కేసులు బనాయించారు. దీనిపై నేను చంద్రబాబు గారిని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిసి నా కష్టాలు చెప్పుకున్నాను.
అనంతరం పార్టీ పెద్దలు నాకు అండగా నిలిచి బెయిల్ ఇప్పించి బయటకు తీసుకొచ్చారు. మాపై కేసు పెట్టిన మహిళను బెదిరించినట్లు మరోసారి మాపై అక్రమంగా కేసు పెట్టించి వేధిస్తున్నారు. నా తల్లి షేక్ బీబీ జాన్ (80సం.లు) వీధి కుళాయి వద్ద దాడిచేసి గాయపర్చారు. వైసీపీ నాయకులు మా కుటుంబాన్ని కక్షగట్టి వేధిస్తున్నారని చెప్పాడు. అధైర్య పడొద్దని, పార్టీ అండగా నిలుస్తుందని యువనేత లోకేష్ భరోసా ఇచ్చారు.
వైకాపా నేత కొడుకు కులంపేరుతో దూషించాడు
-జంగం దేవేంద్రకుమార్, నాగులవెల్లటూరు, చేజర్ల మండలం.
2022 నవంబర్ 29న వైకాపా నాయకుడికి కొడుకు దవుపాటి రవితేజ అయ్యప్పమాలలో ఉన్న నన్ను కులంపేరుతో దూషించి, మీ దిక్కున్న చోట చెప్పుకోండని అన్నాడు. ఆ తర్వాత నేనే మా గ్రామస్తుల సహకారంతో చేజర్ల పోలీస్ స్టేషన్ లో రవితేజపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాను. పోలీసులు నేటికీ నిందితుడిపై చర్యలు తీసుకోలేదు. మీరు మాకు న్యాయండని కోరాడు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులను వేధించిన వైసిపినేతలపై కఠిన చర్యలు తీసుకుంటానని లోకేష్ హామీ ఇచ్చారు.