• జగన్ కు ఉన్నసైకోయిజం ఎవరికీ లేదు.. నిజంగా నాయకుడంటే చంద్రబాబే.
• జగన్, ఆయనపార్టీ లీడర్లు వరదలతో నిరాశ్రయులైనవారిని గాలికివదిలేస్తే, ముఖ్యమంత్రి ఇలాఖాలోనే చంద్రబాబు సింహంలా తిరుగుతున్నాడు.
• తుగ్లక్ రెడ్డికి నిజంగా చిత్తశద్ధి ఉంటే రాజధాని రైతులు, మహిళలకు బహిరంగంగా క్షమాపణచెప్పి తప్పుచేశానని ఒప్పుకోవాలి.
• రాజధానిగా అమరావతినే కొననసాగిస్తామని అసెంబ్లీలో ప్రకటించగల దమ్ము, ధైర్యం జగన్ రెడ్డికి ఉన్నాయా?
-తెలుగుమహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత
మూడురాజధానులబిల్లుతో రాష్ట్రాన్ని అల్లకల్లోలంచేసిన తుగ్లక్ రెడ్డి, మహిళలు రైతుల్ని దారుణంగా వేధించాడు.కోర్టు మొట్టికాయలకు భయపడి జగన్ రెడ్డి ఇప్పుడు వెనక్కుతగ్గినా, అమరావతి భూములను కాజేయాలన్నఆలోచనతోనే సరికొత్త బిల్లు అంటూ నాటకాలు ఆడుతున్నాడు.
తుగ్లక్ రెడ్డి నిన్న మూడురాజధానుల అంశాన్ని వెనక్కుతీసుకుంటున్నానని చెప్పడం, మంత్రి పెద్దిరెడ్డి క్లైమాక్స్ ముందుంది అనిచెప్పడం చూస్తుంటే, ముందున్నకాలంలో హీరోలు తప్ప, విలన్లు గెలవరని, ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని తేలిపోయిందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యురాలు, తెలుగుమహిళ రాష్ట్రఅధ్యక్షురాలు శ్రీమతి వంగలపూడి అనిత ఎద్దే వాచేశారు. మంగళవారం ఆమె మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ..
రాబోయే రెండున్నరసంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గడ్డుకాలమే అని చెప్పడం లో ఎలాంటిసందేహం లేదు. రాబోయే కాలంలోహీరోలే గెలుస్తారుగానీ, విలన్లు గెలిచే పరిస్థితి లేదు. మూడురాజధానులపేరుతో ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టిన జగన్ రెడ్డి, రాజధాని రైతులకు మానసికంగా చెప్పుకోలేని క్షోభకుగురిచేశాడు. జగన్మోహన్ రెడ్డి అనే ఈ తుగ్లక్ రెడ్డి ఎప్పుడూ డైవర్షన్ రాజకీయాలకే ప్రాధాన్యతఇస్తున్నాడు. అతను ముఖ్యమంత్రిగా ఎన్నికైన దగ్గరనుంచీ అన్నివిషయాల్లో ఘోరంగా విఫలమయ్యాడు. కనీసం మూడురాజధానులపై ఎలా ముందుకెళ్లాలో కూడా తెలియకుండా, మండలి ఛైర్మన్ సంతకం లేకుండా, గవర్నర్ తో సంతకం పెట్టించి ముందుకు పోవాలనుకున్నాడు. ఆ వ్యవహారంపై కోర్టులు మొట్టికాయలు వేసి, చీవాట్లుపెడతాయని భావించే ఉన్నపళంగా నిన్నటికి నిన్న ప్రభుత్వం మూడురాజధానులబిల్లుని వెనక్కుతీసుకుంది.
2019 డిసెంబర్ లో మూడురాజధానులపేరుతో తుగ్లక్ రెడ్డి రాష్ట్రంలో అల్లకల్లోలానికి నాందిపలికాడు. వేలాదిమంది రైతులు, మహిళలు వారి కుటుంబాలను చెప్పు కోలేని విధంగా చిత్రహింసలకుగురిచేసి, మానసికక్షోభకు గురిచేశాడు. కోర్టులు మొట్టికాయలు వేస్తాయనే నిన్న ఉన్నపళంగా మూడు రాజధానుల బిల్లుని వెనక్కు తీసుకున్నారు. తుగ్లక్ రెడ్డికి నిజంగా చిత్తశద్ధి ఉంటే రాజధాని రైతులు, మహిళలకు క్షమాపణచెప్పి, రాజధానిగా అమరావతినే కొననసాగిస్తామని అసెంబ్లీలో చెప్పగల దమ్ము, ధైర్యం ఉన్నాయా? ఇదివ రకు తీసుకున్న మూడురాజధానుల నిర్ణయంతో ఎన్నివేలకోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో, ఎందరు రైతులు, మహిళల ఉసురు తీశారో తెలియదా?
ఈ ముఖ్యమంత్రి తన పంతం నెగ్గించుకోవడానికి వేలకోట్లప్రజలసొమ్ముని ఫీజుల రూపంలో లాయర్లకు తగలేశాడు. అన్నంపెట్టే రైతుపై, జన్మనిచ్చే మహిళపై, యువతపై, ఎస్సీ ఎస్టీలపై నీకెందుకు అంతకక్ష జగన్ రెడ్డి? జగన్ రెడ్డి తన సైకోయిజం, పైశాచకత్వంతో మహిళారైతుల్ని పోలీసులబూటుకాళ్లతో తన్నించాడు. వారిని చెప్పుకోలేని విధంగా చిత్రహింసలకుగురిచేశాడు. పేటీఎమ్ కుక్కబ్యాచ్ తో అనరాని మాటలు అనిపించాడు. రాజధాని మహిళలు జీన్స్ లు వేసుకుంటాడని ఒకడు, మగాళ్లు వెనకుండి ఆడవాళ్లతో ఉద్యమంచేస్తున్నారని హేళనగా మాట్లాడించాడు. ఆడవాళ్లనే ఇంగితంకూడా లేకుండా తనపార్టీకిచెందిన పేటీఎమ్ కుక్కలతో అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడించడం, కామెంట్లు పెట్టడం చేయించా డు. వైసీపీపేటీఎమ్ కుక్కలు రూ.5కి, రూ.10కి కూడా కక్కుర్తిపడి తల్లుల్ని, అక్కచెల్లెళ్లను దూషించే నీచస్థాయికి దిగజారాయి.
అలాంటికుక్కలు కూడా ఒక తల్లికే పుట్టాయనే విషయం అవిఎందుకు మర్చిపోతున్నాయో తెలియడంలేదు. ఈ ప్రభుత్వం, జగన్ రెడ్డి, మంత్రులు, పోలీసులు, పేటీఎమ్ బ్యాచ్ సహా, ఎవరుఎన్నిచేసినా, ఎంతలా వేధించినా ప్రజలరాజధానిని కాపాడుకోవాలన్న కసితో, తపనతో, పోరాడుతున్న మహిళలందరికీ నిజంగా పాదాభివందనం. పాదయాత్రమహిళలపై ఝళిపించే లాఠీలు ఏదోఒకరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే బుద్దిచెబుతాయి. జగన్ దృష్టిలో రైతు అంటే గోచిపెట్టుకొని, బురదలోతిరుగుతూ ఆత్మహత్యలకు పాల్పడాలా? వారు సంతోషంగా ఉండి మంచి బట్టలుకట్టుకొని తిరగకూడదా? అన్నంపెట్టే అన్నదాతలను కూడా ఈప్రభుత్వం చులకనగా చూడటం బాధాకరం. మానసికంగా నిజమైన సంపన్నులు రైతులేననే వాస్తవాన్ని ఈ ప్రభుత్వం గుర్తించాలి.
అమరావతిలోని లక్షలవిలువైన భూములను అమ్ముకోవడానికే జగన్ బిల్లుల పేరుతో కొత్తనాటకానికి తెరలేపాడని ప్రజలే అంటున్నారు. పరిపాలనారాజధానిపేరుతో విశాఖలో ఇప్పటికే భూములు అమ్మకాన్ని విజయవంతంగా పూర్తిచేశాడు. తనసంపాదన, స్వార్థంకోసం భూములతోపాటు, రాష్ట్రాన్ని,ఆఖరికి ప్రజలను కూడా అమ్మేసేవ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. మందుబాబులను 25ఏళ్లకు తాకట్టుపెట్టిన గొప్ప బిజినెస్ మ్యాన్ అతడు. వర్షాలు, వరదలకు ప్రజలు, పశువులుచనిపోతే ఎక్కడా కాలుకిందపెట్టకుండా ఏరియల్ సర్వేతోసరిపెట్టినఘనుడు ఈ జగన్ రెడ్డి. కడప, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాలతో పాటు, రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో ప్రజలు సర్వంకోల్పోయి దిక్కులేనివాళ్లైతే, ఈముఖ్యమంత్రి పరిహారం కింద ముష్టివేస్తున్నానంటున్నాడు. జగన్ కు ఉన్నసైకోయిజం ఎవరికీ లేదు..ఉండదుకూడా. నిజంగా నాయకుడంటే చంద్రబాబే. జగన్, ఆయన లీడర్లు అడుగుపెట్టలేని ముఖ్యమంత్రిఇలాఖాలోనే చంద్రబాబు సింహంలా తిరుగుతున్నాడు. మాటతప్పను, మడమతిప్పను మాట జగన్ నోటినుంచి వినీవినీ విసుగొచ్చేసింది. అసలు ఎవడైనా ఆ మాట అంటుంటే లాగిపెట్టి ఒక్కటి ఇవ్వాలనిపిస్తోంది.