-ప్రక్క రాష్ట్రంలో పాడైన రోడ్డు ఫోటోతో తప్పుడు ప్రచారానికి సిగ్గుగాలేదా?
-పిచ్చికుక్కల అరుపుల్లో నిజమెంతో ప్రజలకు తెలుసు
-ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయి రెడ్డి
అల్జీమర్స్ వ్యాధి మురుదుతున్న నేపథ్యంలో చంద్రబాబు నిజమే ఊహేదో గుర్తించలేని స్థితిలో ఉన్నాడని, ఈ వెన్నుపోటుదారుడు ఇంకా తానే సీఎంననే భ్రమలోనే బ్రతుకుతున్నాడని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ఏద్దేవా చేసారు. ఈ మేరకు శుక్రవారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు. 2004లో జగన్ సీఎం అయ్యుంటే హైదరాబాద్ మిగిలేదా? అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ వెన్నుపోటు విజనరీ హైదరాబాద్ తానే నిర్మించానని ఇప్పటికీ డప్పుకొట్టుకుంటున్నాడని, ఈ డప్పుల ప్రచారం వింటే కులీ కుతుబ్ షా ఆత్మ చంద్రబాబుపై కాండ్రించి ఉమ్మేస్తుందని అన్నారు.
హైదరాబాద్ లోని నేరెడిమేట్ రోడ్, వేరే రాష్ట్రాల లోని పాడైపోయిన రోడ్ల ఫోటోలు పెట్టి ఏపీ రోడ్లు పాడైపోయాయని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడానికి తెలుగు డ్రామా పార్టీకి సిగ్గుగా అనిపించకపోయినా, ఈ తప్పుడు ప్రచారం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. ఇటువంటి చేష్టలకే మిమ్మల్ని తెలుగు డ్రామా పార్టీ అని, పెయిడ్ అర్టిస్టులని అంటారని అన్నారు. తేదేపా చేస్తున్న విష ప్రచారం ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తూ ఉన్నారని ముద్ద (మొద్దు) పప్పు లోకేష్ తెలుసుకోవాలని అన్నారు.
లోకేష్ పెంపుడు కుక్కల్లో ఒకడికి వ్యాక్షిన్ వికటించడంతో నెల్లూరు వీధుల్లో పిచ్చికుక్కలా ఊగిపోతున్నాడని అన్నారు. అదాన్ డిస్టలరీస్ జగన్, విజయసాయి రెడ్డిలకు చెందిన కంపెనీ అని ఆరోపణలు చేసిన తేదేపా నేత ఆనం వెంకటరమణా రెడ్డిని ర్యాబిస్ సోకిన శునకంతో పోల్చారు. పిచ్చికుక్కల అరుపుల్లో నిజమెంతో ప్రజలకు తెలుసని, ఆరోపణలు చేయడం కాదు చేతనైతే నిరూపించాలని సవాల్ విసిరారు.