Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీని పునాదులతో సహా పెకిలించాలి

– జగన్‌ పాలనలో మహిళలకు భద్రత కరువు
– యువత నిరుద్యోగంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
– వైసీపీ నేతల దోపిడీకి రాష్ట్ర ప్రజలు బలవుతున్నారు
– ప్రజల భూములను దోచుకునేందుకే ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం
– కుప్పం ప్రజలకు చంద్రబాబు ప్రత్యేక మేనిఫెస్టో
– ఓటుతో ఫ్యాను రెక్కలు ఊడి కింద పడాలి
– ఎన్నికల ప్రచారంలో నారా భువనేశ్వరి పిలుపు

కుప్పం/రామకుప్పం: ఈ ఎన్నికల్లో రాష్ట్రమంతా ఏకమై వైసీపీ ప్రభుత్వాన్ని పునాదులతో సహా పెకిలిం చాలని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండవ రోజు బుధవారం రామకుప్పం మండలంలో నారా భువనేశ్వరి పర్యటించారు. రామకుప్పం సెంటర్‌లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వైసీపీ పాలనలో రాష్ట్రమం తా అంధకారమైంది. అన్ని వర్గాలు బాధితులుగా మారారు. వైసీపీ దుర్మార్గాలను ప్రశ్నించే వారిపై వైసీపీ నేతలు దాడులు, హత్యలతో బెదిరింపులకు పాల్పడ్డారు. ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలపై వైసీపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఓటును ఆయుధంగా మలచుకుని చిత్తు చిత్తుగా ఓడిరచాలని పిలుపునిచ్చారు. జగన్‌ పాలనలో మహిళలకు భద్రత లేదు. గంజాయి మత్తులో మహిళలపై వైసీపీ నేతలే అత్యాచారాలు, హత్యలకు పాల్పడ్డారు.

రాష్ట్రంలో గత ఐదేళ్లలో 30 వేల మంది మహిళలు అదృశ్యమైతే కనీసం ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. ముఖ్యమంత్రి బాధిత కుటుంబాలను కనీసం పరామర్శించిన దాఖలాలు లేవు. వైసీపీ పాలనలో గత ఐదేళ్లుగా రాష్ట్రం దోపిడీకి గురైంది. ఇసుక, మద్యం, మైనింగ్‌, భూకబ్జాలతో వైసీపీ నేతలు రాష్ట్రాన్ని దోచుకున్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేశారు. వైసీపీ పాలనలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. కంపెనీలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయా యి. యువతకు ఉద్యోగాలు లేవు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని అన్ని వర్గాలకు మేలు చేసేలా, సంక్షేమాన్ని అందించేలా సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రకటించారు. అన్నింటినీ అమలుచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కూటమిని గెలిపించాలని కోరారు.

ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం దోచుకునేందుకే..
జగన్మోహన్‌రెడ్డికి భూదాహం పెరిగింది. అందుకే వైసీపీ నేతలందరికీ రాష్ట్ర ప్రజల భూములను దోచిపెట్టేందుకు ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని తీసుకువచ్చాడు. జగనన్న భూరక్ష ముసుగులో జగనన్న భూభక్ష పథకాన్ని జోరుగా సాగించేందుకు కుట్ర పన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలంతా గ్రహించాలి. తాతముత్తాతల నుంచి వంశపారంపర్యంగా మనకు సంక్రమించిన ఆస్తులను వైసీపీ ప్రభుత్వం లాక్కునేందుకు దుర్మార్గపు చట్టాలను మనపై రుద్దుతోంది. ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రజలంతా వ్యతిరేకించాలి. మీ భూములు మీకు ఉండాలంటే వైసీపీ ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ఓడిరచాలి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం రద్దుపై రెండో సంతకం పెడతారు.

కుప్పం ప్రజలకు ప్రత్యేక మేనిఫెస్టో
ముఖ్యమంత్రిని చేసిన కుప్పం ప్రజలకు ఏదో ఒకటి చేయాలని చంద్రబాబు నిత్యం తరితపిస్తూ ఉంటారు. కుప్పం నియోజకవర్గంలో నెలకొన్న ప్రధాన సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు రానున్న ఎన్నికల సందర్భంగా కుప్పం ప్రజలకు ప్రత్యేక మేనిఫెస్టోను 20 పాయింట్లతో ప్రకటించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే వాటిని నెరవేరుస్తారు. కుప్పంలో అత్యధిక మెజార్టీ తీసుకొచ్చే పోలింగ్‌ బూత్‌ ప్రాంతాన్ని నేను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తాను. కుప్పం అభివృద్ధికి నా వంతు సహకారం అందిస్తాను. రాక్షస పాలనను గద్దె దించి ప్రజా ప్రభుత్వ స్థాపనే లక్ష్యంగా రాష్ట్ర ప్రజలు రానున్న ఎన్నిక ల్లో చురుకుగా పాల్గొనాలని కోరుతున్నాను. టీడీపీ కార్యకర్తలు మే 13 వరకు సైకిల్‌ స్పీడు పెంచాలి. అడ్డొచ్చిన వాడిని తొక్కుకుని అయినా సరే ముందుకు వెళ్లాలి తప్ప..ఎక్కడా వెనక్కి తిరిగి చూడకూడదు. కూటమి అభ్యర్థులకు పట్టం కట్టి ప్రజా ప్రభుత్వానికి స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు.

ప్రజలతో మమేకమవుతూ జోరుగా ప్రచారం
కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. గ్రామ గ్రామాన భువనేశ్వరికి మహిళలు హారతులు పట్టి స్వాగతం పలుకుతున్నారు. పార్టీ కార్యకర్తలు పూలమాలలు, పుష్పగుచ్చాలతో స్వాగతం పలుకుతున్నారు. రామకుప్పం మండలంలోని రామకుప్పం, బందార్లపల్లి, నెర్నెల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని భువనేశ్వరి పూర్తి చేశారు. ఆమె ప్రసంగంతో వారిలో చైతన్యాన్ని నింపుతున్నారు. ఓటు విలువను ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తున్నారు. వైసీపీ ఐదేళ్ల వైఫల్యాలు, దుర్మార్గాలను ప్రజలకు కళ్లకు కట్టినట్టు వివరిస్తున్నారు. ఆమె ప్రచారానికి అన్ని వర్గాల నుంచి పెద్దఎత్తున స్పందన లభిస్తోంది.

LEAVE A RESPONSE