Suryaa.co.in

Business News Features

అవును.. అదానీ అమాయకుడే మరి!

ఇంతకుముందు కూడా భారతదేశంలో దేశీయ న్యూస్ చానల్స్ పేపర్స్ అనేక సందర్భాల్లో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు ఎగసిపడటంపై అనుమానం సంశయం వ్యక్తం చేస్తూ వార్తలు ప్రచురించడం జరిగింది చూపించడం జరిగింది. అయితే ఆయా సందర్భాల్లో అదానీ గ్రూప్ మూలాలపై వారి వ్యాపార పునాదులపై అత్యంత వేగంగా వారి కంపెనీల షేర్ వాల్యూషన్స్ అనైతికంగా లేదా కృత్రిమంగా పెరగటంపై ప్రచురించిన లేదా చూపించిన వార్తలను గ్రూప్ విజయవంతంగా కప్పిపుచ్చడం లేదా మరుగున పడేలా చేయడంలో సఫలీకృతులయ్యారు.

అయితే ఈసారి నివేదికను ప్రకటించింది. ఒక అంతర్జాతీయ సంస్థ దాన్ని మరుగున పడేలా చేయడంలో అదానీ గ్రూపు విఫలమయింది అని తెలుస్తుంది. ఇక్కడ రెండు ముఖ్యమైన విషయాలు చెప్పాలి. అతన్ని గ్రూప్ కంపెనీల షేర్లలో పెట్టుబడి పెట్టడంపై ఫినాన్సియల్ మార్కెట్లో పేరు ఉన్న ముఖ్యమైన న్యూస్ చానల్స్ గాని, పేపర్స్ గాని అదాని గ్రూపులో పేర్లలో పెట్టుబడి పెట్టడం పై ఏనాడు సానుకూలంగా రిపోర్ట్స్ ప్రచురించలేదు. అంతేకాకుండా పలుమార్లు ఇన్వెస్టర్స్ కి ఆదాని గురించి, షేర్లలో పెట్టుబడి పెట్టడం ప్రమాదకరమైనది అని ఎంతోమంది పేరు ఉన్న విశ్లేషకులు చెప్పేవారు.

వారు మాటల్లో చెప్పాలంటే బలమైన మూలాలు ఆర్థిక పునాది వ్యాపారంలో నైతికత ఇవేమీ లేకుండా ఉన్న అన్ని కంపెనీలు నష్టాలు ప్రకటిస్తూ , కేవలం షేర్లు మాత్రమే ఆకాశంలో దూసుకెళ్లే ఇలా చేయడంలో అతని గ్రూపు తెర వెనక చక్రం తిప్పింది అని చెప్పకనే చెప్పేవారు. ఇంకా విస్మయం కలిగించే విషయం ఏంటంటే.. సెబి సెన్సెక్స్ మరియు నిఫ్టీ ఇండెక్స్ హెచ్చుతగ్గులు సూచించే షేర్ల గ్రూపులోకి, ఎన్నో దశాబ్దాలుగా పేరు ఉన్నటువంటి నిలకడైన కంపెనీలను తొలగించి ప్రభుత్వ రంగ సంస్థలను పక్కనపెట్టి.. అన్ని అదానీ గ్రూప్ షేర్లను సెన్సెక్స్ 30 నిఫ్టీ ఫిఫ్టీ షేర్ల లోకి తీసుకోవడం జరిగింది.

దీనికి వారు తీసుకున్న జాగ్రత్తలు గానీ ఆ ఎన్నికకు తగిన కొలమానంగానే ఎవరికి అర్థం కాలేదు. ఏదైనా ఒక కంపెనీ ప్రతి మూడు నెలలకి తను ప్రకటించే ఆర్థిక ఫలితాలు అంటే క్వార్టర్లీ రిజల్ట్స్ ద్వారా, ఆ కంపెనీ వ్యాపార పురోగతి లాభనష్టాల పట్టిక ఆస్తులు జాబితా తెలియజేస్తాయి. అలా తెలియజేసిన కంపెనీలను పెట్టుబడికి అనుకూలమైనవని పెట్టుబడికి అనుకూలమైనవి కాయమని, ఇన్వెస్టర్లు వారి వారి ఫైనాన్షియల్ అడ్వైజర్స్ సలహాతో పాటిస్తారు. అదానీ గ్రూప్ కంపెనీల పనితీరును పరిశీలిస్తే వారి గ్రూప్ కంపెనీలన్నీ నిన్న మొన్నటి వరకు నష్టాలే ప్రకటించాయి.

కానీ ఆ కంపెనీల షేర్లు మాత్రం ఆకాశంలోకి తీసుకెళ్లారు. ఈ కంపెనీలో షేర్ విలువ మదింపు ద్వారానే అదాని ని ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆస్తిపరుడు అని కుబేరుడని మనవాళ్లు మన దోషపూరితమైన మీడియా బాకాలు దేవి. ఇప్పుడు ఒక నిక్కచ్చిగా పనిచేసే విదేశీ సంస్థ అతని కంపెనీల అనైతిక వ్యాపార మూలాలను పూర్తిగా కళ్ళకు కట్టేట్లుగా ప్రజలకు తెలియజేసింది వారు సంధించిన ప్రశ్నలకు అదా నీ గ్రూపు వారు సమాధాన ఇవ్వటానికి జంకు తున్నారంటే వీరి దొంగతనం డొల్లతనం బయటపడిపోతుంది.

ఈ సందర్భంగా మన దేశ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ , ప్రధానమంత్రి మోడీ తక్షణమే ప్రజలకు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేయాల్సి ఉంది అవేంటంటే దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ అయినటువంటి ఎల్ఐసి మరియు అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయినటువంటి ఎస్బిఐ ఎంత మేరకు అదాని గ్రూపు లావేదేవరులలో ఇరుక్కుని ఉన్నాయి.

ఈ అదానీ గ్రూపు పెట్టుబడి వల్ల ఈ మూల స్తంభాలాంటి ఆర్థిక సంస్థలు రెండింటికి ఎంత మేరకు నష్టం జరగబోయే అవకాశం ఉంది ఈ సంస్థల్లో పెట్టుబడి పెట్టిన చిన్న మధ్య తరగతి ఇన్వెస్టర్లు వారి ఆర్థిక పరిస్థితి రాబోయే నష్టం వీటిని ఎలా అరికట్టగలుగుతారు? ఎలా వీరిని కాపాడుగలుగుతారు అనే విషయంలో స్పష్టంగా ఒక ప్రకటన చేయాల్సి ఉంది. అదానీ గ్రూప్ కంపెనీ ల పేర్లలో పెట్టిన పెట్టుబడులు ఎలాగూ మునిగిపోతాయి.

నేను చెప్పేది ఎల్ఐసి మరియు ఎస్బిఐ లలో ఆ షేర్లలో పెట్టుబడి పెట్టిన మదుపర్ల భద్రత గురించి, ఈ సంస్థల్లో పెట్టిన పెట్టుబడి ఏ ప్రాతిపదిక పైన అదానీ గ్రూపు సంస్థల్లో కి మళ్లీ ఇచ్చారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది వారి కనీస బాధ్యత ఇలా మౌనం పాటిస్తే , దేశంలో ఇప్పటివరకు జరిగిన స్కాముల కన్నా ఇది అతి పెద్ద స్కాము అయ్యే అవకాశం ఉంది.

– శ్రీనివాస్

LEAVE A RESPONSE