Suryaa.co.in

Telangana

శంషాబాద్‌లో కారు బీభత్సం..మద్యం మత్తులో నడిపిన యువతి

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది.మద్యం మత్తులో కారు నడిపిన ఓ యువతి రోడ్డుపై వెళుతున్న వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.కారును స్థానికులు అడ్డుకోవడంతో వారితో యువతి, వాహనంలో ఉన్న మరో వ్యక్తి వాగ్వాదానికి దిగారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు.మద్యం మత్తులో ఉన్న యువతి, ఆమెతో ఉన్న వ్యక్తిని పీఎస్‌కు తరలించారు. కారులో ఉన్న వారు మద్యం తాగినట్లు బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలో తేలిందని పోలీసులు తెలిపారు.

LEAVE A RESPONSE