Suryaa.co.in

Andhra Pradesh

మీ మొసలి కన్నీళ్ళు ప్రజలను ఆకట్టుకోవు!

– జయరాం రమేష్ వ్యాఖ్యలకు జీవీఎల్ దీటైన జవాబు

న్యూఢిల్లీ: బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు సరైన కేటాయింపులు చేయలేదని ఉద్దేశపూర్వకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్ వ్యాఖ్యలకు తీవ్రంగా ఖండిస్తూ సీనియర్ బీజేపీ నేత, మాజీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఎక్స్ వేదికగా ఘాటైన జవాబు ఇచ్చారు.

‘ మీ మొసలి కన్నీళ్ళు ప్రజలను ఆకట్టుకోవు’ అంటూ ఏపీ ప్రజలు బడ్జెట్ కంటే ముందు కేంద్రంచే భారీ బొనాంజా అందుకున్నారనిఈ సందర్భంగా గుర్తు చేశారు. మోడీ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు రూ.11,442 కోట్ల ప్యాకేజీ, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రో ప్రొజెక్ట్ కు 2 లక్షల కోట్ల పెట్టుబడులు, రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ కు 15,154 కోట్ల కేటాయింపులు, పోలవరం ప్రాజెక్టుకు చేసిన కేటాయింపులు, ఇంకా మారెన్నో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని జీవీఎల్ నరసింహారావు వివరించారు.

LEAVE A RESPONSE