ఐపిసి @ 163
06.10.1860
భారతీయ శిక్షాస్మృతి..
ఇండియన్ పీనల్ కోడ్..
165 సంవత్సరాలుగా
అదే నీతి..అదే రీతి..
అదే నిరతి..అదే భారతి..!
ఏలుబడి మారింది..
దేశం ముక్కలైంది..
భాగం పంచుకు వెళ్లిన
పాకిస్తాన్లో సైతం
అదే స్మృతి..
ఆ ముక్క నుంచి చెక్కలైన
బంగ్లాలో కూడా
అదే సన్నుతి..
బర్మా..మలేషియా..
నేపాల్..లంకలోనూ
ఆ స్మృతే సమ్మతి..
పేరు మారినా..
తీరు అదే..
మన స్మృతికి
జగతి పట్టిన హారతి..!
లార్డ్ మెకాలే..
ఆషామాషీగా రాయలేదు..
నాటి ఫ్రెంచి పీనల్ కోడ్..
మనకి రోడ్..
లివింగ్ స్టోన్స్ కోడ్ ఆఫ్
లూసియానా…
అదే అప్పటి జమానా..
వీటి ఆదర్శంగా
ఎన్నో అధ్యయనాలు..
భారతీయ ప్రామాణిక గ్రంధాలు
మనుస్మృతి..
యాజ్ఞవల్కస్మృతి..
వీటి సారం..
పండితులు..విజ్ఞుల అభిప్రాయం..
ఆనాటి రాజుల సూచన..
అన్నీ కలగలిపి
మెకాలే రచన..
మహా గ్రంధం
భారతీయ శిక్షాస్మృతి..
జై కొట్టింది జగతి..!
తానుగా పండితుడైన మెకాలే తన తెలివితో పాటు
భారతీయ సంస్కృతి..
మత,సామాజిక అంశాలు..
అన్నిటినీ క్రోడీకరిస్తే..
అదే అదే ఐపిసి..
ఐసీ..అందుకే అయ్యింది
అంత గొప్పది..!
ఎక్కడ నేరం జరిగినా
అదే ఐపిసి..
సాగరంలో..సాగరగర్భంలో..
రోదసి..వాహనాలు..
వైద్యం..ఉద్యోగం..
బ్యాంక్ లావాదేవీ..
అక్రమ పైరవీ..
ఆధునిక కాలంలో
సైబర్ నేరాలు..
అన్నీ ఐపిసి పరిధిలో..
ఈ అనంత
న్యాయజలధిలో..!
అయితే..అయితే..
ఎప్పుడో చిన్నప్పుడు విన్నట్టు
ఇంకా తిరగేయని అట్టు..
వంద మంది నేరస్థులైనా
తప్పించుకోవచ్చునేమో గాని
ఒక్క నిరపరాధి
శిక్షకు గురికారాదు..
భారతీయ ధర్మసమస్తమో..
ఇప్పటి భాషలో చాదస్తమో..
ఆ నిరతి
నేరస్థుల పాలి వరమై..
ధర్మానికి కలవరమై..
అనవసర జాప్యాలు..
వాయిదాలు..అప్పీళ్ళు..
న్యాయానికి సవాళ్లు..
అనకూడదు గాని
కొంతలో కొంత
అంత గొప్ప న్యాయవ్యవస్థ
అపహాస్యం పాలు..!
కోర్టులో న్యాయదేవత
కళ్లకు గంతలు..
ధర్మ గ్లాని..
న్యాయహాని..
మౌనంగా బాధపడుతూ
భారతావని..!
సురేష్..9948546286
..7995666286