అంగరంగ వైభవంగా యువనేత నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు

నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు వేమిరెడ్డీ పట్టాభి రామిరెడ్డీ ఆధ్వర్యంలో టీడీపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి వర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పొంగూరు నారాయణ, నెల్లూరు పార్లమెంట్ టీడీపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్,శాసనమండలి సభ్యులు రామ్ భూపాల్ రెడ్డి లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. యువగళం పాదయాత్ర తో నారా లోకేష్ బాబు నూతన చరిత్ర లిఖించారని అడుగడుగునా ప్రజా సమస్యలు తెలుసుకుని, ప్రజలతో మమేకం తాత కు తగ్గ మనవడిగా, తండ్రి కి తగ్గ తనయుడిగా ప్రజల్లో నిలిచిపోయారని అన్నారు.

కార్యక్రమం లో తాళ్ళపాక రమేష్ రెడ్డి, కంభం విజయారామిరెడ్డి, తాళ్ళపాక అనూరాధ, బూదటి రాధాకృష్ణయ్య, జెన్ని రమణయ్య, రాజా నాయుడు, బొమ్మి సురేంద్ర, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

28 న చంద్రబాబు సభను విజయవంతం చేద్దాం
నెల్లూరు జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన నెల్లూరు పార్లమెంట్ టిడిపి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పొంగూరు నారాయణ,జోన్ 4 ఇంఛార్జి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 28 న రా.. కదలిరా కార్యక్రమంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కోవూరుకు రానున్నారని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గ ఇన్చార్జిలకు సూచించారు. అనంతరం కుటుంబ సాధికార సారథులు నియామకాల పై, ఓటర్ వెరిఫికేషన్ పై ఇంఛార్జి లకు దిశానిర్దేశం చేశారు.

కార్యక్రమంలో కావలి, కోవూరు నియోజకవర్గ ఇంఛార్జి లు మాలేపాటి సుబ్బానాయుడు, పోలం రెడ్డి దినేష్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు తాళ్లపాక రమేష్ రెడ్డి, కంభం విజయరామిరెడ్డి, మాజీ శాసనమండలి సభ్యులు బూదాటి రాధాకృష్ణయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, టీడీపి ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు బొమ్మీ సురేంద్ర యాదవ్, ఆత్మకూరు, నెల్లూరు రూరల్ని యోజక వర్గాల పరిశీలకులు బుల్లెట్ రమణ, రాచమల్లు శ్రీనివాసులురెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్లపాక అనురాధ, మాజీ ఆప్కాప్ చైర్మన్ కొండూరు పాల్సెట్టి, ఎమ్మెల్సి కాండిడేట్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు జెన్నీ రమణయ్య, దావా పెంచల్ రావు, పమిడి రవికుమార్ చౌదరి, మలిశెట్టి వెంకటేశ్వర్లు, దొడ్డపునేని రాజా నాయుడు, బొబ్బూరి వెంగళరావు, టీడీపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply