Suryaa.co.in

Telangana

గోల్కొండ కోటకు ఇల్యుమినేషన్, సౌండ్ & లైట్ షోను ప్రారంభించనున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

– బుధవారం (24జనవరి నాడు) ప్రారంభోత్సవం
– గౌరవ అతిథులుగా హాజరుకానున్న మాజీ కేంద్రమంత్రి చిరంజీవి, ఎంపీ విజయేంద్రప్రసాద్
– గోల్కొండ చరిత్రను ప్రతిబింబించేలా అధునాతన సాంకేతికతతో సౌండ్ & లైట్ షో

11వ శతాబ్దపు చారిత్రక గోల్కొండ కోట చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేసేలా, కాకతీయుల కాలం నుంచి నేటి వరకు మన చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబించేలా గోల్కొండ కోటలో సౌండ్ & లైట్ షోను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీంతోపాటుగా ఇకపై రాత్రిళ్లు కూడా దేదీప్యమానంగా కనిపించేలా ‘ఇల్యుమినేట్’ చేయనుంది.

గోల్కొండ కోటలో పర్యాటకులు/సందర్శకులకు అవసరమైన ఏర్పాట్లను చేసే కార్యక్రమంలో భాగంగా సౌండ్&లైట్ షో, ఇల్యుమినేషన్ కార్యక్రమాలను కేంద్ర సాంస్కృతిక శాఖ చేపట్టింది. ఈ రెండింటినీ 24, జనవరి, 2024 (బుధవారం) కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, పద్మభూషణ్, మెగాస్టార్ చిరంజీవి, రాజ్యసభ ఎంపీ విజయేంద్ర ప్రసాద్ గౌరవ అతిథులుగా హాజరుకానున్నారు.

ప్రాజెక్టుల గురించి:
గోల్కొండ కోటలో ప్రస్తుతం ఉన్న సౌండ్ & లైట్ షో 1993లో ఏర్పాటుచేశారు. ప్రీ-రికార్డెడ్ సౌండ్ ట్రాక్స్, ఫిక్స్‌డ్ లైట్స్ పై ఆధారపడి ఈ షో నిర్వహిస్తారు. ప్రస్తుతమున్న పరిస్థితులకు అనుగుణంగా.. అంతర్జాతీయ స్థాయిలో.. గోల్కొండ చరిత్రను మరింత గొప్పగా చూపించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 3D మ్యాపింగ్ ప్రొజెక్షన్, హై-రెజల్యూషణ్ ప్రొజెక్టర్లు, లేజర్ లైట్లు, మూవింగ్ హెడ్స్ వంటి అధునాతన సాంకేతికత కలబోతతో వినూత్నంగా రూపొందించిన ఈ షో సందర్శకులను ఆకట్టుకోనుంది. మల్టీమీడియా విషయంలో ఇండియన్ ఆయిల్ ఫౌండేషన్ సంపూర్ణ మద్దతుగా నిలిచింది.

షో సమయం: 30 నిమిషాల 20 సెకండ్లు
భాషలు: తెలుగు, హిందీ, ఇంగ్లీష్

ఈ ప్రాజెక్టు సాంకేతిక ప్రత్యేకతలు:
• గోల్కొండ కోట బయటి గోడల ఇల్యుమినేషన్ వామ్ వైట్ (తెలుపు) రంగులో ఉంటుంది.
• ముఖద్వారం, భద్రాద్రి హాల్ త్రివర్ణ పతాకంతో వెలుగులు నిండనుంది.
• మొత్తం లక్ష చదరపు అడుగుల వైశాల్యంగల బయటి గోడలకు (ఫసాడ్ ఏరియా) వెలుగులు అందించేందుకు 1400 ఎనర్జీ ఎఫిషియంట్ LED లైట్లు అమర్చారు.
• దీనికి 25 కిలోవాట్ల సోలార్ పవర్
• 30k ప్రొజెక్టర్లు 8, 20k ప్రొజెక్టర్లు 2
• 20వాట్ లేజర లైట్లు 6,
• మూవింగ్ హెడ్‌లైట్లు 20,
• స్పీకర్లు 14, సబ్ వూఫర్లు 8,
• సరౌండ్ సౌండ్ సిస్టమ్
• 80Kva UPS ఒకటి.

గోల్కొండ కోట గురించి:
• 11వ శతాబ్దానికి చెందిన ఈ గోల్కొండ కోట డెక్కన్ ప్రాంతంలోని ప్రముఖమైన కోటల్లో ఒకటి
• దీన్ని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) సంరక్షిస్తోంది.
• హైదరాబాద్‌లో పర్యాటకులు ఎక్కువగా సందర్శించే ప్రాంతం
• వారం రోజుల్లో 2వేల నుంచి 3వేల మంది సందర్శకులు వస్తారు. వారాంతంలో ఈ సంఖ్య 6వేల వరకు ఉంటుంది.

LEAVE A RESPONSE