Suryaa.co.in

Andhra Pradesh

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా ఫేక్

ఓడిపోతున్నామనే భయంతో దుష్ప్రచారాలు చేస్తున్న వైసీపీ సోషల్ మీడియా
ఎన్నికల్లో లబ్ది పొందాలనే దుర్మార్గపు ఆలోచనలో వైసీపీ ఉంది
జగన్ రెడ్డి కనుసన్నల్లో సజ్జల భార్గవ్ రెడ్డి నేతృత్వంలో ఫేక్ వీడియోలు, ఆడియోలు, వార్తలు ప్రచారాలు జరుగుతున్నాయి
తప్పుడు ప్రచారాలు చేస్తున్న సజ్జల భార్గవ్ రెడ్డిపై క్రిమనల్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి

– మాజీ మంత్రి దేవినేని ఉమా

ఓడిపోతున్నామనే భయంతో జగన్ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, అతని గ్యాంగ్ మొత్తం దుష్ప్రచారాలు చేస్తున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. చంద్రబాబు, ఈనాడు, టీవీ5 లపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలను దేవినేని ఉమా ఖండించారు.

ఆదివారం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న దేవినేని ఉమా మాట్లాడుతూ “ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికి కూడా యథేచ్చగా వైసీపీ తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోలేదు. నిన్న సాయంత్రం నుంచి సైలెంట్ పిరియడ్ అమల్లోకి వచ్చినప్పటికీ చంద్రబాబు, ఈనాడు, టీవీ5 అనేక సంస్థలపై వైసీపీ దుష్ప్రచారాలు చేస్తుంది. వీడియోలను వక్రీకరించి, తప్పుడు ప్రచారాలను వైసీపీ అధికారిక ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. జగన్ రెడ్డి, వైసీపీ ఓటమి అంచున ఉండి ఎంత భయపడుతున్నారో అర్థమవుతోంది.

ఫేక్ ప్రచారాల మీదే ఆధారపడిన ఫేక్ పార్టీ వైసీపీ. ఫేక్ బ్రతుకు బ్రతుకుతున్న ఫేక్ సీఎం జగన్ మోహన్ రెడ్డి. వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాలు, వీడియోలు, ఆడియోలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. ఫోర్జరీ లెటర్ హెడ్స్‌తో కూడా వైసీపీ దుష్ప్రచారాలకు పాల్పడుతుంది. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీల రిజర్వేషన్లు రద్దు చేస్తామని చంద్రబాబు చెప్పినట్లు సజ్జల భార్గవ్ రెడ్డి మార్ఫింగ్ వీడియోలు తయారు చేశాడు. అచ్చెన్నాయుడు పేరు మీద ఎన్నో ఫేక్ లెటర్లు పెట్టారు. వైసీపీ ఫేక్ బ్రతుకులపై ఎన్నో ఫిర్యాదు ఇచ్చాం.

2019 ఎన్నికలకు ముందు ఈ ఫేక్ సంఘానికి విజయసాయిరెడ్డి ఉండేవాడు. ఆ దరిద్రమార్గంలోనే సజ్జల భార్గవ్ రెడ్డి నడుస్తున్నాడు. వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారాలను తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది. తక్షణమే ఈ దుష్ప్రచారాలను ఆపేయాలని రాష్ట్ర ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనాను కోరాం. రిజర్వేషన్లు, పథకాలు, అమరావతి తదితర అంశాలపై చంద్రబాబు అనని మాటలను అన్నట్లుగా చిత్రీకరించి, వారికి కావల్సిన విధంగా మార్ఫింగ్‌లు చేసుకొని ఫేక్ ప్రచారాలను వైసీపీ ప్రచారం చేస్తుంది. జగన్ రెడ్డి దిగజారి వ్యవహరించారు.

ఎన్నికల ప్రచారంలో నోటికొచ్చిన అసత్యాలు చెప్పి ప్రజలను మభ్య పెట్టాలని చూశాడు. ఓడిపోతున్నామనే భయంతో వైసీపీ ఫేక్ ముఠా అలెర్ట్ అయ్యి దుర్మార్గానికి పాల్పడుతున్నారు. మొన్న ఉద్యోగస్తుల ఓటింగ్ చూసాక కూడా ఉద్యోగులు వైసీసీ తరఫునే ఉన్నట్లు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తుంది వైసీపీ సోషల్ మీడియా. ఎన్నికల్లో లబ్దీ పొందాలనే దుర్మార్గపు ఆలోచనలో జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ దుష్ప్రచారాలన్నీ జగన్ రెడ్డి కనుసన్నల్లో వైసీపీ ప్రధాన కార్యాలయం నుంచి వస్తున్నాయి.

ఓటర్లను మభ్య పెట్టేందుకు హైదరాబాద్ లోటస్ పాండ్ దగ్గర ఒక భవనంలో నుంచి సజ్జల భార్గవ్ రెడ్డి నేతృత్వంలో ఒక టీమ్ ఫేక్ వీడియోలు, ఆడియోలు తయారుచేస్తున్నారు. ఇటువంటి దుష్ప్రచారాలు వైసీపీ చేస్తున్నందుకు గాను వైసీపీ సోషల్ మీడియా హెడ్ సజ్జల భార్గవ్ రెడ్డి, ఫేక్ వీడియోలు తయారు చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి” అని దేవినేని ఉమా డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE