టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి జెడ్ క్యాటగిరి భద్రత కల్పించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ
అక్టోబర్ 2016 ఏఓబి ఎన్కౌంటర్ తరువాత లోకేష్ కి జెడ్ క్యాటగిరి భద్రత కల్పించాలని నాటి ఎస్ఆర్సి( సెక్యూరిటీ రివ్యూ కమిటీ ) సిఫార్సు చేసింది. వైసిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే లోకేష్ భద్రత తగ్గింపుపై విమర్శలు వెల్లువెత్తాయి. సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫార్సులు పక్కన పెట్టి లోకేష్ కి వైసిపి ప్రభుత్వం. వై క్యాటగిరి మాత్రమే కల్పించింది.
ముప్పు ఉన్నా కక్షసాధింపు చర్యల్లో భాగంగా వైసిపి ప్రభుత్వం లోకేష్ కి భద్రత తగ్గించింది. తగిన భద్రత కల్పించాలి అంటూ 14 సార్లు రాష్ట్ర హోమ్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, గవర్నర్ కి లేఖలు రాసిన లోకేష్ భద్రతా సిబ్బంది ఆందోళన చర్చనీయాంశమమయింది.
భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని, లోకేష్ భద్రతా సిబ్బంది అనేక సార్లు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లింది. అనంతరం పాదయాత్ర లో లోకేష్ టార్గెట్ గా అనేక సార్లు వైసీపీ ప్రేరేపిత భౌతిక దాడులను, రాష్ట్ర హోమ్ శాఖ, కేంద్ర హోమ్ శాఖ, గవర్నర్ దృష్టికి లోకేష్ భద్రతా సిబ్బంది తీసుకువెళ్లింది.
సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫార్సు పక్కన పెట్టి, భద్రత తగ్గించిన విషయాన్ని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ సీరియస్ గా తీసుకుంది. గతంలో మావోయిస్ట్ హెచ్చరికలు, భద్రతా పరంగా ఉన్న నిఘా వర్గాల సమాచారం మేరకు.. కేంద్ర ప్రభుత్వం లోకేష్ కి జెడ్ క్యాటగిరి భద్రత కల్పించింది. తాజాగా లోకేష్ కి సిఅర్పిఎఫ్ ( విఐపి వింగ్ ) బలగాలతో కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ. జెడ్ క్యాటగిరీ సెక్యూరిటీ కల్పించింది.