Suryaa.co.in

Andhra Pradesh

జగన్మోహన్ రెడ్డి డ్వాక్రామహిళలకు పెద్దటోకరా వేశాడు

– 28లక్షల మందిమహిళలకు ఆసరా సొమ్ము ఎగ్గొట్టాడు
– ఆసరా రుణాలపై తాను బహిరంగచర్చకు సిద్ధం, ప్రభుత్వంనుంచి ఎవరొస్తారో రావచ్చు.
– తెలుగుమహిళ రాష్ట్రఅధ్యక్షురాలు వంగలపూడి అనిత
తెలుగురాష్ట్రాల మహిళలు తమకాళ్లపై తాము నిలబడాలనే సదు ద్దేశంతో చంద్రబాబునాయుడు డ్వాక్రా వ్యవస్థను తీసుకొచ్చి, వారిని ఆర్థికంగా పరిపుష్టులను చేశారని, అలాంటి వ్యవస్థను కూడా ఈ ముఖ్యమంత్రి మోసగిస్తున్నాడని, మహిళాసాధికారత లో జగన్మోహన్ రెడ్డి ఏనాడూ తనచిత్తశుధ్ధిని నిరూపించుకోలేక పోయాడని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యురాలు, తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఎద్దేవాచేశారు. శుక్రవారం ఆమె మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆమె మాటల్లోనే …
రాష్ట్రంలో 98లక్షల మంది డ్వాక్రామహిళలు ఉన్నారు. కానీ 78లక్షల మంది మహిళలకే ముఖ్యమంత్రి నిన్న గొప్పలుచెప్పు కున్న ఆసరా పథకంతాలూకా సొమ్ములు పదిరోజుల్లో వారిఖాతా ల్లో పడతాయని సాక్షిపత్రికలోనే రాశారు. ఆసరా ఇచ్చామని చెబుతున్న 78లక్షలమందిమహిళల్లోకూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ డ్వాక్రామహిళలకు కనీసం రూ.500నుంచి రూ.1000కూడా బ్యాంకుల్లో జమకావడంలేదు. ఈ వ్యవహారంపై టీడీపీతరుపున చర్చించడానికి తాను సిద్ధమే. ప్రభుత్వం నుంచి ఎవరొస్తారో బహి రంగ చర్చకురావొచ్చు. ఆఖరికి ఆసరా అంటూ ఆడబిడ్డలను కూడా ఎందుకిలా మోసగిస్తున్నారు? మొత్తం డ్వాక్రామహిళల్లో 28లక్షలమందిని తొలగించిన జగన్మోహన్ రెడ్డి, ఆయనప్రభుత్వం మిగిలిన 78లక్షలమందికి కూడా అన్నివిడతల్లో ఆసరా సొమ్ముని అందించడంలేదు.
ఆధార్ కార్డ్ లింకుకాలేదని ఒకసారి, బ్యాంకు ఖాతాలో సమస్యలున్నాయని మరోసారి, తొలివిడతలోఇచ్చిన వారికి రెండోవిడతలో రావని ఇంకోసారి, ప్రభుత్వం ఇచ్చే సొమ్ము వారికి చేరడంలేదు. వాటన్నింటితోపాటు,వాలంటీర్ల పెత్తనం కూడా డ్వాక్రామహిళలకు అన్యాయం చేస్తోంది. రూ.27వేలకోట్ల రుణాన్ని ఐదేళ్లలో రద్దుచేస్తానని జగన్మోహన్ రెడ్డి గతంలోహామీ ఇచ్చాడు. కానీ ఈరెండున్నరేళ్లలో 12వేలకోట్ల రుణం రద్దుచేయడం జరిగింది. మిగిలిన రూ.15వేలకోట్ల రుణం ఎప్పుడు రద్దవుతుందో, తద్వారా ఎందరు డ్వాక్రామహిళలు లబ్దిపొందుతారనేది ముఖ్యమంత్రే సమా ధానం చెప్పలేని ప్రశ్న. మహిళలను ఉద్ధరిస్తాను , వారిసాధికారత కు పెద్దపీట వేస్తానని ప్రగల్భాలుపలికే ముఖ్యమంత్రి, ఆఖరికి అన్నిరకాల పదవుల్లో తనపార్టీవారికి, తనవర్గం వారికే ప్రాధాన్యత ఇస్తున్నాడు. మహిళలకు వడ్డీలేని రుణాలుఇస్తాననికూడా జగ న్మోహన్ రెడ్డి చెప్పాడు.
ఈ రెండున్నరేళ్లలో ఎన్నిడ్వాక్రా గ్రూపులకు ఎంతరుణమిచ్చారో తెలియచేస్తూ శ్వేతపత్రం విడుదల చేయగల దమ్ముఈ ప్రభుత్వానికి ఉందా? వైసీపీప్రభుత్వం ఎంత మంది డ్వాక్రామహిళలకు వడ్డీలేని రుణాలిచ్చిందనే సమాచారమే లేదు. టీడీపీప్రభుత్వంలో డ్వాక్రామహిళలకు రూ.5లక్షలవరకు వడ్డీలేని రుణాలు అందిస్తే, జగన్మోహన్ రెడ్డి దాన్ని రూ.7.5లక్షల వరకు పెంచుతానన్నాడు. కానీ అధికారంలోకి వచ్చాక ఆ హామీని తుంగలోతొక్కాడు. మాటతప్పను, మడమతిప్పను అనిచెప్పుకు నే వ్యక్తి ఒక్కో గ్రూపుకుఇచ్చే రుణాన్ని రూ.5లక్షలనుంచి రూ.3లక్షలకు కుదించాడు. రుణం మొత్తాన్ని తగ్గించడమే కాక, వడ్డీలుకట్టాల్సిందేనని బ్యాంకర్లతో ఆడబిడ్డలను వేధిస్తున్నాడు.
మహిళాసంఘాల సమాఖ్యలు దాచుకున్న సొమ్ముని కూడా ఈ ముఖ్యమంత్రి కోఆపరేటివ్ సొసైటీలకు మళ్లిస్తాననిచెప్పడమేంటి? ఆ సొమ్ముపై ముఖ్యమంత్రికి ఏం అధికారం ఉంటుంది. ఆ సొమ్ముని కూడా వాలంటీర్లద్వారా తమరాజకీయ అవసరాలకు వాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డిప్రభుత్వం సిద్ధమైంది. ఈ విధంగా ఆడబిడ్డలసొమ్ముని దోచుకుంటున్న ఈప్రభుత్వం ఆసరా పేరుతో వారిని నిలువునా దోపిడీచేస్తోందన్నది పచ్చి నిజం.
45ఏళ్లు నిండినమహిళలకు నెలకు రూ.3వేలు ఇస్తాననిచెప్పిన హామీనికూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో అటకెక్కించాడు. నెలకు రూ.3వేలచొప్పున, సంవత్సరానికి రూ.36వేలలెక్కన ఐదేళ్లలో ప్రతిమహిళకు రూ.లక్షా80వేలు ఇవ్వాలి. కానీ ఈరోజు ఒక్కో మహిళకు కేవలం రూ.93వేలు మాత్రమే ఇస్తూ, వారిని మోసగి స్తున్నాడు. ఆ 93వేలుకూడా 45ఏళ్లునిండిన మహిళలందరికీ రావడంలేదు. అమ్మఒడిపేరుతో తల్లులఖాతాల్లో డబ్బులు వేసిన ప్రభుత్వం, కరోనావేళ మద్యందుకాణాలు తెరిచిమరీ ఆసొమ్ముని తిరిగి ప్రభుత్వఖజానాకే చేరేలాచేశారు. జగన్ ప్రభుత్వంలో కరెంట్ బిల్లు పట్టుకుంటేనే వినియోగదారులకు షాక్ కొడుతోంది.
ఫ్యాన్ కు ఓటేసినపాపానికిప్రజలు ఫ్యాన్లు వేసుకోవడం మానేశారు. రైతుభరోసా డబ్బులు వేయగానే రైతులుతీసుకున్న రుణాలకు ఆ సొమ్ము జమైపోతోంది. వాహనమిత్ర పేరుతో అరకొరగా వాహన దారులకు డబ్బులువేయగానే ఒక్కసారిగా ఆర్టీఐ, పోలీస్ వారి జరిమానాలు, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతాయి. అలానే మహిళలకు ప్రభుత్వం నిన్నఆసరా సొమ్మువేయగానే నేడు గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. అసరా సొమ్ము రావడానికి పదిరోజుల సమయం పడుతుంటే, మహిళలనుంచి ప్రభుత్వం లాగేసుకుంటు న్నది మాత్రం ఆఘమేఘాలపై జరుగుతోంది. ముఖ్యమంత్రి నిన్న కూడా దిశాచట్టంగురించి మాట్లాడారు. దిశాచట్టం లేదుగానీ పోలీసులు, లాయర్లు, పోలీస్ స్టేషన్లు మాత్రం వచ్చాయంటున్నాడు. రాష్ట్రంలోని మహిళలంతా ఇదివరకు తాముఆరంగంలో ఉపాధి పొందాలి..ప్రగతిసాధించాలి..తమబిడ్డలను బాగా చదివించా లని చెప్పుకునేవారు.
నేడు జగన్మోహన్ రెడ్డి పాలనలో తాము , తమబిడ్డలు సురక్షితంగా బతికితే చాలనుకుంటున్నారు. రాష్ట్రాన్ని నెంబర్ 1స్థానంలో నిలుపుతానని ప్రగల్భాలు పలికిని పిచ్చిమా రాజు, ఆడబిడ్డలపై జరిగే నేరాలు, ఘోరాల్లో దేశంలోనే రాష్ట్రాన్ని తొలిస్థానంలో నిలిపాడు. చివరకు ఈ ముఖ్యమంత్రి ఇచ్చే చిల్లర డబ్బుకోసం ఆడబిడ్డలు, రాష్ట్రంలోని కుటుంబాలు ఎదురుచూసే దుస్థితికల్పించాడు. రాష్ట్రమహిళలకు ఈ ముఖ్యమంత్రి కల్పించిన మహిళాసాధికారత, ఆసరా సొమ్ముపై తానుబహిరంగ చర్చకు సిద్ధంగాఉన్నాను. యానిమేటర్లందరికీ ఈముఖ్యమంత్రి ఇటీవలే అబద్ధాలతో లేఖరాశాడు. గతప్రభుత్వంవారికి అన్యాయంచేసిందని చెప్పడం నిజంగాసిగ్గుచేటు. రాబోయేకాలంలోనైనా ఈ ముఖ్య మంత్రి, ఈప్రభుత్వం మహిళలు, చిన్నారుల రక్షణపై దృష్టి పెట్టా లని పత్రికాముఖంగా కోరుతున్నాం.

LEAVE A RESPONSE