Home » వైసీపీ సంబరాలు కామెడీ సినిమాను తలపిస్తున్నాయి

వైసీపీ సంబరాలు కామెడీ సినిమాను తలపిస్తున్నాయి

– అప్పులద్వారా, ప్రజలనుంచి దోచుకుంటున్న సొమ్ముతోనే వచ్చేఎన్నికల్లో గెలవాలని జగన్మోహన్ రెడ్డి, పీకే ప్రణాళికలు వేసుకుంటున్నారు
– ప్రతిసారీ ప్రజలు పీకేని, జగన్ ని నమ్మరు
– మహాపాదయాత్రకు ఆటంకంకలిగినా, రైతులకు ఏదైనా జరిగినా అందుకు జగన్మోహన్ రెడ్డే బాధ్యుడవుతాడు
– టీడీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న
బద్వేల్ ఉపఎన్నికలో గెలుపొందినందుకు, అధికారపార్టీ నేతలు సంబ రాలుచేసుకోవడం, బాణసంచా కాల్చడం చూస్తుంటే హస్యాస్పదంగా ఉందని, బస్సుల్లో దొంగఓటర్లను తరలించి సాధించిన విజయానికి సంబ రాలు చేసుకోవడం అధికారపార్టీ అల్పసంతోషానికి సంకేతమని, టీడీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్రప్రాంత పార్టీ ఇన్ ఛార్జ్ బుద్దావెంకన్న ఎద్దేవాచేశారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యా లయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
జగన్మోహన్ రెడ్డికి, ఆయన ఎమ్మెల్యేలకు నిజంగా దమ్ము, ధైర్యముంటే, ప్రజల్లో అధికారపార్టీపై విపరీతమైన ఆదరాభిమా నాలుంటే, తక్షణమే 151 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసినందుకు ప్రజలంతా వారి చెప్పులతో వారే కొట్టుకుంటూ, తమవేదనను సోషల్ మీడియా ద్వారాబహిర్గతం చేస్తున్నారు. అధికారపార్టీనేతలు ప్రజల్లోకి వెళితే, వైసీపీఎమ్మెల్యేలకు, మంత్రులకి అసలు వాస్తవం ఏమిటో బోధపడు తుంది. ప్రజలు ఆదరిస్తారో…. చెప్పులతోకొడతారో అప్పుడు తేలుతుంది.
ఒకసారి ముఖ్యమంత్రి అయితే, తనను మరోసారి ఎన్నుకో రని తెలిసే, ఎన్నికలకుముందు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి… ఒక్కఛాన్స్ అంటూ ప్రాధేపడ్డాడు. మరోసారి అడిగేఅవసరంలేకుండా, ప్రజలముందుకు పోకుండా, తనకు తాను చేయాల్సిన నష్టాన్ని, జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే చేసుకున్నాడు. మద్యంపై, ఇసుకపై, గనుల పై, అప్పులరూపంలో కాజేస్తున్నది చాలకనే, జగన్మోహన్ రెడ్డి, ఆయన పరివారం తాజాగా గంజాయి, ఇతరమాదకద్రవ్యాల వ్యాపారంలో దిగారు. గతంలో పీకే వ్యూహాలకు ప్రజలు పడిపోయారుగానీ, ఈసారీ ఆయన పప్పులేమీ రాష్ట్రంలో ఏమీ ఉడకవు.
ప్రజలను మాదకద్రవ్యాలకు బానిస ల్నిచేసి, తద్వారా వచ్చినసొమ్ముతో ఓటుకి రూ.10వేలిచ్చి, తిరిగివచ్చే ఎన్నికల్లో గెలవాలని జగన్మోహన్ రెడ్డి, పీకే ఆలోచిస్తున్నారు. జగన్మోహ న్ రెడ్డి , పీకేల పాచికలు, వ్యూహాలు ఈసారి ఎన్నికల్లో పారవని స్పష్టం చేస్తున్నాం. ప్రతిసారీ ప్రజలు మోసపోతారనుకుంటే, అది జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వమే అవుతుంది. ప్రజలద్వారా, రాష్ట్రంలోని సహజవాయు వుల ద్వారా పోగవుతున్న సంపదంతా నేరుగా తాడేపల్లి ప్యాలెస్ కే చేరుతోంది. ఇసుక, మద్యం, విద్యుత్ ఛార్జీలపెంపు, నిత్యావసరాల పెంపు, గంజాయి, మాదకద్రవ్యాల అమ్మకంద్వారా వచ్చే సొమ్ముతోనే వచ్చే ఎన్నికల్లో గెలవాలని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు. తన అవినీ తి, దోపిడీ, నియంత్రత్వ , అహంకారపూరిత విధానాలతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం పరువుని దేశవ్యాప్తంగా మంటగలిపాడు.
జగన్మోహన్ రెడ్డికి, ఆయనప్రభుత్వానికి అభివృద్ధి అనేమాటకు అర్థమే తెలియదు. ఆయన కు తెలిసిందల్లా ఫ్యాక్షనిజం, రౌడీయిజం, గూండాయిజం, అవినీతి మాత్రమే. మొన్నటికి మొన్న తెలుగుదేశంపార్టీ కార్యాలయంపై దాడి చేయించాడు. ఇప్పుడేమో అమరావతి రైతులు తలపెట్టిన మహాపాద యాత్రను భగ్నంచేయడానికి సజ్జల రామకృష్ణారెడ్డి కుట్రలు పన్నుతు న్నాడు. రైతులకు, ఏచిన్నఇబ్బంది కలిగినా అందుకు జగన్మోహన్ రెడ్డే బాధ్యుడవుతాడు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి అమ రావతి రైతులకు గట్టి భద్రత కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.
ఉన్న ఒక్కరాజధానిలో సరిగా రోడ్లు వేయలేని జగన్మోహన్ రెడ్డి మూడురాజధానులు కడతాను, మూడుప్రాంతాలు అభివృద్ధి చేస్తా ను అనిచెప్పడం సిగ్గుచేటు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో ఎక్కడైనా ఒక గ్రావెల్ రోడ్డు అయినా వేశారా? ఆయన నివాస ముంటున్న తాడేపల్లిఇంటికి తప్ప, ప్రజలకు ఉపయోగపడేలా ఎక్కడై నా సరే ఒక్కరోడ్డయినా నిర్మించారా? మంత్రులు, అధికారపార్టీ ఎమ్మె ల్యేలను ఆఖరిసారి హెచ్చరిస్తున్నాం. చంద్రబాబునాయుడిని, ఆయన కుటుంబసభ్యులను ఎవరైనా దూషిస్తే, తాముకూడా అంతకు రెండింతలు నోటికిపనిచెప్పాల్సి వస్తుంది. టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు యత్నించేవారికి కూడా తగినబుద్ధిచెబుతాం. రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అనే నరకాసురుడిని ప్రజలు ఓటు అనేఆయుధంతో తరిమికొట్టడానికి సిద్ధంగాఉన్నారు.

Leave a Reply