10 లక్షల ప్రకటన ప్రభుత్వం అసమర్థత కి నిదర్శనం

– తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహిళ ప్రధాన కార్యదర్శి సూర్యదేవర లత
ఓ నిర్భయ.. ఓ దిశ.. అంతకు ముందు, ఆ తర్వాత.. చాలానే జరిగాయ్.. జరుగుతూనే వున్నాయ్. ఎంతోమంది మహిళలు, మృగాళ్ళ అఘాయిత్యాలకు బలైపోతున్నారు. నెలల చిన్నారి నుంచి కాటికి కాలు చాపిన వృద్ధురాలు.వరకు ఎవరూ అతీతం కాకుండా పోయారు మృగాళ్ళ కీచకపర్వానికి. అసలేం జరుగుతోంది ఈ పవిత్ర భారతావనిలో. చాలామంది మాత్రం తప్పించుకు తిరుగుతున్నారు. సమస్య ఏంటన్నది అందరికీ తెలుసు.. కానీ, పరిష్కారమే దొరకడంలేదు. కానీ ఒకటి మాత్రం అర్ధం అవుతుంది…అదే ప్రభుత్వ అసమర్థ.
రాష్టంలో దాదాపు లక్షల మంది పోలీసులు వ్యవస్థ పెట్టుకొని , రాష్ట్ర బడ్జెట్ లో వేల కోట్లు రూపాయలు విడుదల చేసి ,అడుగు అడుగు నా నిఘా కెమెరాలు పెట్టుకొని, ఒక నరరూప రాక్షసుడు ని పట్టుకోవడం కోసం ప్రభుత్వం 10 లక్షల ప్రకటన చేయండి చూస్తుంటే ప్రభుత్వం ఎంత చేతగాని స్థితిలో ఉందొ అర్ధం అవుతుంది అని తెలుగుదేశం పార్టీ మహిళ విభాగం ప్రధాన కార్యదర్శి సూర్యదేవర లత ప్రభుత్వం పై ధ్వజమెత్తారు .
ప్రభుత్వం లోని నాయకులు ఒకరు , ఇద్దరు తప్ప మిగితా మంత్రులు ఏమి జరగనట్లు చోద్యం చూస్తూ కూర్చోవడం వారి అసమర్థ కి నిదర్శనం . ఓ చిన్నారిపై హత్యాచారం జరిగితే.. స్పందించడానికి ఇంత ఆలస్యమా.? నిందితుడెవరో తెలిసింది..కానీ అటువంటి నరరూప రాక్షసుడు ని పట్టుకోవడం కోసం ప్రభుత్వం 10 లక్షల ప్రకటన చేయడం పోలీసులు అసమర్థ ని ఏంటో తెలుస్తోంది అని సూర్యదేవర లత పేర్కొన్నారు.
నిందితుడి ఫొటో, పేరు, మిగతా వివరాలు పోలీసులు తాపీగా వెల్లడించారు. ఇలాంటి ఘటనల్లో ఎన్‌కౌంటర్ ఒక్కటే మార్గం. కానీ, ఆ ఎన్‌కౌంటర్ భయం ఎన్నాళ్ళుంటుంది ఈ మృగాళ్ళలో.?దిశ తర్వాత చైత్ర ఘటన ఎందుకు జరిగింది.? మధ్యలో ఇలాంటి ఘటనలు ఇంకెన్ని జరిగాయి తెలంగాణలో.? న్యాయం కోసం వేచి చూస్తోన్న కుటుంబాలు ఎన్నో వున్నాయి
ప్రభుత్వాలు పబ్లిసిటీ స్టంట్లు చేస్తేనో, పోలీసులు ఎన్‌కౌంటర్లు చేసేస్తోనో సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అనుకోలేం. నేరం చెయ్యాలంటేనే మృగాళ్ళు భయపడాలి.. ఆ పరిస్తితి రావాలి. అలా జరగాలంటే ముందు పాలకుల్లో చిత్తశుద్ధి వుండాలి అని సూర్యదేవర లత పేర్కొన్నారు.

Leave a Reply