Suryaa.co.in

Telangana

సిగ్గులేని ఈ సమాజంలో నువ్వు పుట్టినందుకు మాకే బాధగా ఉంది తల్లీ!

– తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన
సైదాబాద్‌కు చెందిన ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార, హ‌త్య సంఘటన అత్యంత బాధాకరం, ఇలాంటి సంఘటనలకు పాల్పడే వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకొని, కఠిన శిక్ష విధించాలి.
ఈ నేరానికి పాల్పడిన వ్యక్తి గంజాయికి బానిసగా మారి, ఈ దుర్ఘటనకు పాల్పడినట్లు సమాచారం తెలుస్తుంది, ఈరోజు హైదరాబాద్ మహా నగరము ఎందుకు మాదకద్రవ్యాలకు, డ్రగ్స్ అడ్డాగా మారింది. నార్కోటిక్స్ & పోలీస్ డిపార్ట్మెంట్స్ అసలు ఏం చేస్తుంది ? ఈరోజు ఏ గల్లీకి, బస్తీకి పోయిన మాదక ద్రవ్యాలు ఎందుకు అమ్ముతున్నారు, అలాగే ప్రతి పబ్బులో మాదకద్రవ్యాల అమ్మకాలు ఎందుకు జరుగుతున్నాయి.
న్యాయస్థానాలు తక్షణం స్పందించి, ఇటువంటి వ్యక్తులను బహిరంగంగా ఉరి తీసే చట్టాలను తేవాలి ..దోషులని వెంటనే ఉరి తీయాలి. అప్పుడే ఈ సమాజంలో మహిళలకు చిన్నారులకు న్యాయం జరుగుతుంది అని కాట్రగడ్డ ప్రసూన ఆవేదన వ్యక్తం చేశారు . పోలీసులు ఇప్పటివరకు నిందితుని పట్టుకోవడం లో విఫలం అయ్యారు అని , లక్షల మంది పోలీసులు ఉండి కూడా పత్రిక ప్రకాటన చేయడం వారి చేతగాని తననికి నిదర్శనం అని దుయ్యబట్టారు ..
చిన్నారి కుటుంబానికి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఆ హామీ లేకపోవడం , ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు కనీస భరోసా ఇవ్వకపోవడం చూస్తుంటే దొంగలకు, దోపిడిదారులకు, రేపిస్టులకు, మాఫియా లకి ప్రభుత్వం అండదండలు మెండుగా ఉన్నాయని అర్ధం అవుతుంది అని ప్రసూన తెలిపారు ఇప్పటికైన తక్షణమే ప్రభుత్వం కళ్లు తెరిచి చిన్నారి చైత్ర కుటుంబసభ్యులు కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న ..
నిర్భయ చట్టమా నీవెక్కడా ?
కాగిత రూపంలో ఉన్న చట్టం కామాంధుల జీవితాల్ని కలరాసేది ఎప్పుడు? అత్యంత అవమానకరమైన విదంగా సభ్య సమాజం సిగ్గుపడేలా జరుగుతున్న ఈ పరిణామాలకు మూలాలు ఎక్కడున్నాయ తెలుసుకోవాలి. నిందితుడికి కఠినంగా శిక్ష అమలయ్యే విదంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ,నిర్బయ చట్టాన్ని వెంటనే అమలుపరచాలని డిమాండు చేశారు.

LEAVE A RESPONSE