ఘనంగా మద్దూరి అన్నపూర్ణయ్య 125 వ జయంతి

రాజమహేంద్రవరం : దేశ స్వాతంత్య్రం కోసం సుదీర్ఘ కాలం జైలు జీవితం గడిపి, తన జీవితాన్ని ప్రజలకోసం అర్పించిన మహనీ యుడు మద్దూరి అన్నపూర్ణయ్య చిరస్మరణీయుడని రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు అన్నారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్రనేతాజీ మద్దూరి అన్నపూర్ణయ్య 125వ జయంతి సందర్బంగా స్థానిక జెండా పంజా రోడ్డులోని మద్దూరి అన్నపూర్ణయ్య విగ్రహానికి శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సమితి ఆధ్వర్యాన పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం ప్రకాశం నగర్ ధర్మంచర కమ్యూనిటీ హాలు పైన హాలులో నిర్వహించిన సభలో 2024 సం.గాను మద్దూరి అన్నపూర్ణయ్య స్మారక అవార్డును రిటైర్డ్ హెడ్మాస్టర్ అర్.వి చలపతి కి,.ఆధ్యాత్మిక మరియు సామాజిక సేవవేత్త అంబటి భీమ శంకర నారాయణ సాయిబాబా తదితర సంఘ ప్రముఖులకు ప్రధానం చేశారు.

నూటఏబై మందికి పైగా మునిసిపల్ టౌన్ హై స్కూల్ పూర్వ విద్యార్థులు మరియు రిటైర్డ్ ఉపాధ్యాయులు మరియు పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్న ఈ జయంతి సభ అత్యంత వైభవంగా జరిగింది. రచయితలు శ్రీపాద శ్రీనివాసు, ముడుంబై రామకృష్ణచారిలు వ్రాసిన సన్మాన పత్రాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.

మద్దూరి అన్నపూర్ణయ్య సేవాసమితి గౌరవ అధ్యక్షులు, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ అన్నపూర్ణయ్య వంటి మహానీయులను గుర్తుచేసుకుంటూ ప్రతియేటా జయంతి, వర్ధంతి చేయడం ద్వారా రాబోయే తరాలకు స్ఫూర్తినివ్వాలని అన్నారు. వివిధ రంగాల్లో సేవలందిస్తున్నవారిని గుర్తించి అన్నపూర్ణయ్య అవార్డులు, పురస్కారాలతో సత్కరించడం అభినందనీయమన్నారు.

వైసీపీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డా.గుడూరి శ్రీనివాస్, న్యాపతి సుబ్బారావు, అశోక్ కుమార్ జైన్ , షేక్ అసదుల్లా అహ్మద్, టికె విశ్వేశ్వర రెడ్డి, బాలేపల్లి మురళీధర్, దేవత సుధాకర్, రెడ్డి మణి, తెలుకుల కార్పొరేషన్ చైర్మన్ సంకేసుల భవానిప్రియ, వక్కలంక నాగేంద్ర, తదితరులు మాట్లాడుతూ మద్దూరి అన్నపూర్ణయ్య వంటి మహానీయులను తలుచుకోవడం ఎంతైనా అవసరమన్నారు. ఇలాంటివారి చరిత్రలను పాఠ్యపుస్తకాల్లో పెట్టాలన్నారు .

ఈసందర్బంగా అతిధుల చేతులమీదుగా డిఎంహెచ్ స్కూలు రిటైర్డ్ హెడ్మాస్టర్ ఆర్.వి.చలపతిరావుని శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్య స్మారక అవార్డుతో సమితి ప్రధాన కార్యదర్శి బెజవాడ రంగారావు తదితర కార్యవర్గం ఘనంగా సత్కరించారు. గురువు అంటే ఎలా ఉండాలో చలపతిరావు మాస్టారు నిదర్శనమని, ఈయన దగ్గర చదువుకున్నవాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారని రౌతు పేర్కొన్నారు.

అనంతరం ఈస్ట్ న్యూస్ ఛానెల్ అధినేత, సీనియర్ జర్నలిస్టు టి. రామనారాయణ, వెల్ల గ్రామానికి చెందిన గుండుబోగుల సూర్యారావు కామెర్ల వైద్య నిలయం పి. వీరభద్రరావు, విఘ్నేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కోటిపల్లి నాగ సురేష్, ఇన్నీసుపేట శ్రీ కోఆపరేటివ్ బ్యాంక్ వైస్-చైర్మెన్ గేడి అన్నపూర్ణ రాజు, బ్యాంక్ ఆఫ్ బరోడా రిటైర్డ్ సీనియర్ మేనేజర్ నూనెరామ్ గణేష్ శ్యాంసింగ్, ఐఎన్ టి యుసి జిల్లా మాజీ సెక్రటరీ కె.యల్. నరసింహా రెడ్డి, ఆధ్యాత్మికవేత్త అంబటి భీమశంకర్ నారాయణ, వేణుగోపాలస్వామివారి దేవస్థానం మాజీ చైర్మన్ మట్టే హరనాథ బాబు, ఆర్టీసీ రిటైర్డ్ డిపో మేనేజర్ కమ్మంమెట్టు వీర వెంకట సత్యనారాయణ లను శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్య పురస్కారాలతో సత్కరించారు. రుక్మాంగదరావు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

ఈ జయంతి వేడుక సభలో వైసీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, డా. గూడూరి రాధిక, గంటి సర్వలక్ష్మి , సమితి ఉపాధ్యక్షుడు కూరెళ్ల హనుమంతరావు, కోశాధికారి యర్రా కేదారేశ్వరరావు, న్యాయ సలహాదారు కూనపరెడ్డి శ్రీనివాస్, వాడ్రేవు వేణు గోపాలరావు, వాడ్రేవు మల్లపరాజు, బూర్లగడ్డ సుబ్బారాయుడు, సుంకర నాగిన్, కోడూరి సుబ్రహ్మణ్యం, పులా వీరబాబు, గెడ్డం రమణ పిల్లాడి రామకృష్ణ, మామిడిపల్లి రామకృష్ణ, బెజవాడ రాజ్ కుమార్, బెజవాడ వెంకటేశ్వరరావు ( బాబు), బెజవాడ వి కృష్ణ ప్రసాద్, లంక సత్యనారాయణ, జాన్ సన్, సాంబశివరావు, వై కె ఎల్. నరసింహారావు, డివి రెడ్డి,దంపతులు, వీరభద్రపురం టౌన్ హైస్కూల్ నాటి ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply