Suryaa.co.in

Andhra Pradesh

తెలుగుదేశం- జనసేన కూటమికి 175కి 150 సీట్లు

– వైసీపీ పార్టీకి తగిన బుద్ధి చెబుదాం
– ట్రాన్స్పరెంట్ గా ప్రభుత్వం ఉండాలనుకునే వ్యక్తి చంద్రబాబు
– చంద్రబాబునాయుడుని ముఖ్యమంత్రిగా చేసుకుందాం
– వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు

తెలుగుదేశం, జనసేన కూటమికి 175కి 150 ఖచ్చితంగా వస్తాయి. అవతల పార్టీకి పాతిక సీట్లు వదిలేద్దాం. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో 150 సీట్లు సాధించి తీరుతాం. రాజకీయ ప్రభంజనం నడుస్తోంది. మన బతుకులు నాశనం చేసిన వైసీపీ పార్టీకి తగిన బుద్ధి చెబుదాం. ప్రజల్ని బిక్షగాళ్లల్లా చేస్తున్నారు. ఇటువంటి పాలన మాకు వద్దు. ఇలాంటి దుష్ట పరిపాలన గురించి కనీ వినీ ఎరగలేదు. ఏమాత్రం కనురెప్ప కూడా వేయకుండా పని చేయాలి. దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాల్ని దశాబ్దాల పాటు చంద్రబాబు నడిపిన సందర్భాలున్నాయి. ఎదురించి ప్రశ్నించినవారిపై తప్పుడు కేసులు పెట్టారు. నిజాయితీకి మారుపేరు చంద్రబాబునాయుడు. ట్రాన్సిపిరెంట్ గా ప్రభుత్వం ఉండాలనుకునే వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు, లోకేష్ లు జనాలలోకి వెళ్లి మాట్లాడుతుంటే సహించలేకున్నారు. చంద్రబాబు, లోకేష్ ఇద్దరి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలి. చంద్రబాబునాయుడుకి అందరూ అండగా నిలబడాలి. తప్పనిసరిగా చంద్రబాబునాయుడుని ముఖ్యమంత్రిగా చేసుకుందాం.

LEAVE A RESPONSE