శాశ్వతంగా ఉండాల్సిన వారు ప్రజలే

-రాజకీయాలు- ప్రభుత్వాలు శాశ్వతం కాదు
-160 స్థానాలతో టీడీపీ, జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది
కష్టపడినవారికి ఫలితం ఉంటుంది
-టీడీపీ తలుపులు తెరిస్తే వైసీపీలో ఒక్కరు కూడా మిగలరు
-టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు

పార్టీపైన, చంద్రబాబుగారిపైన అచంచలమైన విశ్వాసంతో అనేకమంది తెలుగుదేశం పార్టీ లో చేరారు, చేరుతున్నారు. సి. రామచంద్రయ్య , దాడి వీరభద్రయ్య, గడికోట ద్వారకనాధరెడ్డి , ముస్లిం మైనార్టీ నాయకులు అనేకమంది పార్టీలో చేరారు. బాపట్ల నుండి అనేకమంది నాయ కులకూడా చేరడం జరిగింది. వారందరికి స్వాగతం పలుకుతున్నాం.

రాజకీయాలు శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం కాదు, శాశ్వతంగా ఉండాల్సిన వారు ప్రజలే. సైకో జగన్ రెడ్డి నాయకత్వంలో 5 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తెలుగు ప్రజలందరికి ఈ రాష్ట్ర పౌరులందరికి సరైన నాయకత్వం అవసరం. రేపు జరగబోయేది జగన్ కు, ప్రజలకు జరుగుతున్న యుద్ధం. 5 కోట్ల మంది ఆంధ్రులు ఇబ్బంది పడుతున్నారు. జగన్ కు 5 సంవత్సరాలు అవకాశం వస్తే రాష్ట్రంలో చిచ్చు పెడుతున్నారు. ఏ వర్గంవారు, ఏ జాతివారు ఆనందంగా లేరు. ప్రతి ఒక్కరికి అన్యాయం జరుగుతోంది. జగన్ వల్ల రాష్ట్రం దిగాలుగా మారింది. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలనేదే ధ్యేయంగా చంద్రబాబునాయుడు ఉన్నారు.

నూటికి నూరు శాతం మంచి పాలన వస్తుంది. 160 స్థానాలతో టీడీపీ, జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది. కష్టపడినవారికి ఫలితం ఉంటుంది. టీడీపీ తలుపులు తెరిస్తే వైసీపీలో ఒక్కరు కూడా మిగలరు. వైసీపీని ఓడించడం జరిగిపోయింది. మళ్లీ జగన్ లాంటి దుర్మార్గుడు రాజకీయాల్లోకి రాకుండా చూడాలి. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన కనపడకుండా చేయాలి. అందరం అందుకు కృషి చేద్దాం. అందుకు టీడీపీ ఇన్ ఛార్జులందరి సహకారం అవసరం.

Leave a Reply