కేంద్ర పథకాలకు స్టిక్కర్లు వేసుకోవడమే వైసిపి పని

-సీఎం ప్రజల మద్యకు రాలేకపోతున్నారు
-మోడీ అవినీతి లేని పాలన అందిస్తున్నారు
-ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకొని చేస్తున్న పరిస్థితిని వివరిస్తాం
-పొత్తుల కంటే ముందు ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నాం
– బిజెపి జాతీయ కార్యదర్శి సత్య కుమార్
-జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయకుండా అంధకార ఆంధ్రప్రదేశ్ గా మార్చారు
-డబుల్ ఇంజన్ సర్కార్ అవసరాన్ని వివరిస్తున్నాం
– బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ
-గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బిజెపి విజయ సంకల్ప యాత్ర
-నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు పాదయాత్ర
-వేళాంగిణి నగర్ నుండి పాదయాత్రను ప్రారంభించిన నియోజకవర్గ కన్వీనర్, రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ
-పాదయాత్రలో ముఖ్యఅతిదులుగా పాల్గొన్న బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్, జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్

బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో , గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బిజెపి విజయసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర అమరావతి రోడ్డులోని వేలంగిణి నగర్ వద్ద ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా బిజెపి జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ విచ్చేసారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్ర 20 రోజులపాటు జరగనుందని తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్యఅతిదులుగా పాల్గొన్న బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ ఏమన్నారంటే.. మోదీ దేశంలో సమూల మార్పులు తీసుకొచ్చారు.ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేశారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. అవినీతి లేని పాలన అందిస్తున్నారు. ఏపి పట్ల వివక్ష చూపించకుండా అనేక పథకాలు అందజేశారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర దేశ వ్యాప్తంగా జరుగుతుంది. వంద రోజుల పాటు విజయ సంకల్ప యాత్ర జరుగుతుంది.

ఇక్కడ ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకొని చేస్తున్న పరిస్థితిని వివరిస్తాం. రాష్ట్ర ప్రభుత్వంలో జరిగిన అవినీతి ప్రజలకు తెలియ జేస్తున్నాం. సీఎం అసమర్థమతను, ఇచ్చిన హామీలను అమలు చేయక పోవడాన్ని ఎత్తి చూపుతాం. వైసిపి ప్రభుత్వం ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదు. నాలుగున్నర ఏళ్లుగా కేంద్ర పథకాలకు స్టిక్కర్లు వేసుకోవడమే వైసిపి పనిగా పెట్టుకుంది. పొత్తుల కంటే ముందు ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నాం. వాలంటీర్ లేకుండా పోలీసు లేకుండా బయటకు రాలేని పరిస్థితి. ఎన్నికల ముందు మాయదారి మాటలు చెప్పారు. సీఎం ప్రజల మద్యకు రాలేకపోతున్నారు

బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ ఏమన్నారంటే…చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రజల మద్దతు కోరుతూ పాదయాత్ర చేస్తున్నాం. డబుల్ ఇంజన్ సర్కార్ అవసరాన్ని వివరిస్తున్నాం. మోడీ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు. గుంటూరు జిల్లా ప్రజలు కూడా మోదీ చేస్తున్న అభివృద్ధిని గమనించి అండగా ఉండాలని కోరుతున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ అంతర్జాతీయ స్థాయి కీర్తి పొందించారు.

బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి పేరు ప్రఖ్యాతలు దక్కాయి. ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలలో భారతదేశాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయకుండా అంధకార ఆంధ్రప్రదేశ్ గా మార్చారు. రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దించేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారు.

జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్ మాట్లాడుతూ .. కేంద్ర ప్రభుత్వం ఈజిల్లాకు అనేక పథకాలకు నిధులు ఇస్తుంటే ఇక్కడ ఉన్న కార్పొరేషన్ మాత్రం నిధులను పక్కదారి పట్టిస్తూ సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తూ నగర అభివృద్ధిని గాలికి వదిలేసి రోడ్లన్నీ గుంతలమయం , గతుకులమయం, ప్రజా ప్రతినిధులు తమ సొంత లాభాపేక్షతో పనిచేసుకుంటూ వచ్చే ఎలక్షన్స్ లో వాళ్ల వారసత్వాన్ని కొనసాగే లాగ లేకపోతే వారి బంధువుల్ని, వేరే అసెంబ్లీ సంబంధిత ప్రజాప్రతినిదిని తీసుకువచ్చి ఇక్కడ ఈ అసెంబ్లీలో పోటీ చేయించడం ఇటువంటి చూసుకుంటున్నారు గాని ప్రజల ఆర్థిక జీవనోపాదిని మెరుగుపరచకుండా ఉచిత పథకాలకు అలవాటు చేస్తూ ప్రజలను మాయ చేస్తున్నారని అన్నారు

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈదర శ్రీనివాసరెడ్డి, యడ్లపాటి స్వరూపరాణి, రాష్ట్ర పబ్లిసిటీ అండ్ లిటరేచర్ కన్వీనర్ పాలపాటి రవికుమార్, ప్రధాన కార్యదర్శులు కుమార్ గౌడ్, చెరుకూరి తిరుపతిరావు, వైవి సుబ్బారావు, పాండురంగ విట్టల్, మంత్రి సుగుణ, దుర్గాభవాని, మేరీ సరోజినీ, చంద్రశేఖర్ గుప్తా, రేణుకాదేవి, అనుమోలు ఏడుకొండలు గౌడ్, పెమ్మరాజు సుధాకర్, దారా అంబేద్కర్, ఏసోబు, నాగమల్లేశ్వరి, సుకన్య, కృష్ణ చైతన్య, భజరంగ్ రామకృష్ణ, అప్పిశెట్టి రంగ, ఈమని మాధవరెడ్డి, తోట శ్రీనివాస్, సాంబమూర్తి, స్టాలిన్, సత్యం, అంకరాజు నరసింహమూర్తి, రాంబాబు, సురేష్, తాను చింతల అనిల్, సురేష్, దేసు సత్యనారాయణ, సాంబయ్య, చింతపల్లి వెంకట్ పెద్దఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply