ఫ్రాన్స్‌ చర్చిలలో లైంగిక దోపిడీకి 3.30 లక్షల బాలల బలి

గత ఏడు దశాబ్దాలుగా ఫ్రాన్స్ లోని కాథలిక్ చర్చిలో 3.30 లక్షల మంది బాలలు లైంగిక వేధింపులకు గురయ్యారని సంచలన నివేదిక ఒకటి వెల్లడించింది. తాము జరిపిన శాస్త్రీయ పరిశోధన ఆధారంగా ప్రీస్ట్ లు, మతాధికారులతో పాటు చర్చిలలోని మతేతర వ్యక్తులు కూడా ఇటువంటి దురాగతాలకు పాల్పడినట్లు అంచనాకు వచ్చామని నివేదికను జారీ చేసిన కమిషన్ అధ్యక్షుడు జీన్-మార్క్ సావే వెల్లడించారు.
లైంగిక వేధింపులకు గురైన బాలలలో 80 శాతం మంది బాలురులని ఆయన చెప్పారు. “పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయి,” అని సావే చెప్పారు. బాధితులంతా భావోద్వేగ లేదా లైంగిక జీవితంలో తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆయన చెప్పారు.
ఇతర దేశాల మాదిరిగా ఫ్రాన్స్‌లోని కాథలిక్ చర్చి సహితం చాలాకాలంగా సిగ్గుపడే రహస్యాలను కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్న దృష్ట్యా కేథలిక్ చర్చిలలో జరుగుతున్న అత్యంత వినాశకరమైన వాస్తవాలను బయటపెట్టేందుకు ఫ్రాన్స్‌లో మొట్టమొదటిసారి చాలా పెద్ద ప్రయత్నం జరిగింది.
కేథలిక్ చర్చి ఏర్పాటు చేసిన స్వతంత్ర కమిషన్ దాదాపు రెండున్నరేళ్ళపాటు కృషి చేసి ఈ 2,500 పేజీల నివేదికను విడుదల చేసింది. ఫ్రాన్స్‌లోని కేథలిక్ చర్చిలలో గడచిన 70 ఏళ్ళలో చర్చిలలో దాదాపు 3,30,000 మంది బాలలు లైంగిక వేధింపులకు గురైనట్టు వచ్చిన నివేదికపై పోప్ ఫ్రాన్సిస్ ‘తీవ్ర విచారం’ వ్యక్తం చేశారు.
దర్యాప్తులో వెల్లడైన నిజాలు పోప్‌ను ‘తీవ్ర బాధ’కు గురిచేశాయని వాటికన్ అధికార ప్రతినిధి మటెయో బ్రూనీ తెలిపారు. ఫ్రాన్స్‌లోని క్రైస్తవుల కోసం పోప్ ప్రార్థనలు చేశారని, మరీ ముఖ్యంగా బాధితుల కోసం ప్రార్థించారని, తద్వారా వారికి భగవంతుడి నుంచి ఓదార్పు లభిస్తుందని బ్రూనీ పేర్కొన్నారు.
ఈ నివేదిక ప్రకారం మొత్తం 3,000 వరకు లైంగిక వేధింపులకు పాల్పడగా, వారిలో మంది ప్రీస్ట్ లు మాత్రమే ఉన్నారు. వారంతా ఆయా కాలాలలో చర్చి లలో పనిచేస్తున్నారు. బాధితుల సంఘం ప్రెసిడెంట్ ఓలివియెర్ సవిగ్నాక్ మీడియాతో మాట్లాడుతూ, లైంగిక దాడులకు పాల్పడిన ప్రతి ఒక్క వ్యక్తి చేతిలో బాధితుల సంఖ్య అత్యధికంగా ఉండటం ఫ్రెంచ్ సమాజానికి, కేథలిక్ చర్చికి భయానకమని తెలిపారు.
కమిషన్ రెండున్నరేళ్ల పాటు పనిచేసి బాధితులు, సాక్షుల కథనాలను సేకరించింది. చర్చి, కోర్టు, పోలీస్, మీడియా ఆర్కైవ్‌లను 1950 ల నుండి అధ్యయనంచేసింది.. విచారణ ప్రారంభంలో ప్రారంభించిన హాట్‌లైన్‌కు బాధితులు లేదా వారికి తెలిసిన వ్యక్తుల నుండి 6,500 కాల్‌లు అందుకున్నారు.
2000 ల ప్రారంభం వరకు చర్చి వైఖరిని “బాధితుల పట్ల లోతైన, క్రూరమైన ఉదాసీనత” గా ఉన్నట్లు సావే స్పష్టం చేశారు. వారు ఫిర్యాదులను “నమ్మలేదు లేదా వినలేదు”, కొన్నిసార్లు ఏమి జరిగిందో అంటూ ఫిర్యాదు చేసినవారి పట్ల అనుమానంగా చూసారని నిందించారు. ఇప్పటికీ 22 నేరాలను ప్రాసిక్యూటర్లకు పంపించామని సౌవే చెప్పారు. ప్రాసిక్యూట్ చేయడానికి చాలా పాతవి కాని, ఇంకా సజీవంగా ఉన్న నేరస్తులున్న 40 కి పైగా కేసులు చర్చి అధికారులకు పంపామని తెలిపారు.
ఇదిలావుండగా, ఇటువంటి దురాగతాలను నిరోధించడానికి ఈ కమిషన్ 45 సిఫారసులను చేసింది. ప్రీస్ట్స్, క్లరిక్స్‌కు శిక్షణ ఇవ్వడం, కెనన్ లా‌ను పునఃసమీక్షించడం, బాధితులకు నష్టపరిహారం చెల్లించడం వంటి సిఫారసులు చేసింది.
ఫ్రెంచ్ కాథలిక్ చర్చి ప్రీస్ట్ బెర్నార్డ్ ప్రేనాట్ ను గతఏడాది మైనర్ లను వేధించినందుకు దోషిగా నిర్ధారించి, ఐదు సంవత్సరాల జైలు శిక్షకు గురైన తర్వాత ఈ నివేదిక వెలువడింది . దాసభాకాలంగా 75 మందికి పైగా బాలురలను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు అతను అంగీకరించాడు. ప్రేనాట్ కేసు గత సంవత్సరం లియోన్ మాజీ ఆర్చ్ బిషప్, కార్డినల్ ఫిలిప్ బార్బరిన్ రాజీనామాకు దారితీసింది,
ఫ్రెంచ్ ఆర్చ్ బిషప్‌లు, దేశవ్యాప్తంగా ఆదివారం మాస్ సమయంలో చదివిన ఒక సందేశంలో ఈ నివేదికను ప్రచురించడం “సత్య పరీక్ష, కఠినమైన, తీవ్రమైన క్షణం” అని పేర్కొన్నారు. “మా చర్యలను స్వీకరించడానికి మేము ఈ తీర్మానాలను స్వీకరిస్తాము. అధ్యయనం చేస్తాము” అని సందేశం పేర్కొంది.

Leave a Reply