Suryaa.co.in

Andhra Pradesh Political News

4/6/2024…నియంత పాలనకు కర్రుకాల్చి వాతపెట్టిన దినం!

( బాబు భూమా)

నిలువునా ఒక్కో వాత (l) వేసి, జగన్ చెరో పిర్రమీద (ll) వాతలు వేసిన దినం.

నా వెంట్రుక కూడా పీకలేరన్న అహంకారికి రెండు పిలకలు (ll) వుంచి, సున్నం బొట్లు పెట్టిన దినం.

వై నాట్ 175 అన్న నోటికి రెండు(ll) వాతలు వేసిన దినం.

గులకరాయితో హత్యచెయ్యడానికి ప్రయత్నించారు అని బ్యాండేజ్ బబ్లూ చేసిన ఏక్షన్ కు, ఒక్కో చెంపమీద వేసిన లెంపకాయలో మిడిల్ ఫింగర్లు రెండు (ll) చెరో దాని మీద తేలిన దినం.

మా చిన్నాయన్ను చంపిన వాళ్లు ఎవరో దేవుడికి తెలుసు అని కడపలో ఆకాశం కేసి చూపిస్తే.. అక్కడి నుండి కాకి రెట్టలు పడి మొహన్ మొహం మీద జారి ఎండిన రెండు (ll) గుర్తుల దినం.

గబ్బు జే బ్రాండ్స్ కు ఒక సీసా దెబ్బ (l) దానికి క్యాష్ గా వసూలు చేసిన రేట్లకు ఒక సీసా దెబ్బ (l)తో రెండు (ll) వేసిన దినం.

రైతుల ధాన్యం డబ్బులకు చెప్పులు అరిగేలా తిప్పినందుకు రెండు (ll) చెప్పు దెబ్బలు వేసిన దినం.

ఒకటో తేదీ నుండి ఎప్పుడు జీతం వస్తుందో చెప్పకుండా టెక్నికల్ ప్రాబ్లమ్స్ అని కూసిన దానికి ఉద్యోగులు టెక్నికల్ గా సరే సరే అని నిలువునా తలూపి (ll) వేసిన మొటిక్కాయ దినం.

గురువులను వైన్ షాపుల వద్ద నిలబడితే.. చెరో చేతికి బెత్తంతో వేసిన దెబ్బలతో తేలిన వాతలు(ll) దినం.

గ్రామ గ్రామానా గుప్పుమన్న గంజాయికి 5 ఏళ్లు గజ గజా వణికి కాసుకు కూర్చుని, ఆ గొట్టాలతో పొడిచిన దినం.

పట్టభద్రుల తీర్పును అపహాస్యం చేస్తూ.. మా సెక్షన్ ఆఫ్ ఓటర్స్ వేరే అన్న నాలుక మీద వాతలు పెట్టిన దినం.

హెలికాఫ్టర్లో వెళుతున్నా.. ఏదో చెట్టు నుండి చేటుగాలం దాపురిస్తున్నట్లు కొట్టేయించిన పాపానికి ప్రాయశ్చిత్తము జరిగిన రోజు.
కొవ్వుల నెయ్యితో పవిత్రత దెబ్బతీసిన పాప విమోచన దినం.

రథాలు, రాముడి తల నరికి తేనెటీగల కథలు చెప్పడమే కాకుండా ఎవడమ్మ మొగుడిది అనే వరకు బలిసిన కొవ్వును, బ్యాలెట్ దగ్గర రెండు బాకుపోట్లతో దించిన దినం.

ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తా అని ఫిష్ కొట్టులు, వైన్ షాపుల ఉద్యోగాలు చూపినందుకు నిరుద్యోగులు 1-1 గుర్తుకు వచ్చేలా చేసిన దినం.

మాస్క్ అడిగితే డాక్టర్ని చనిపోయేలా చేసి, మర్డర్ చేసి డోర్ డెలివరీ చేసిన వాడిని చంకలో ఎక్కించుకున్నందుకు, వారి భూములను సైతం లాక్కుని వారిమీదే అట్రాసిటీ కేసులు పెట్టినందుకు దళితులు తిరగబడిన దినం.

మిస్బా నుండి మైనార్టీలను ఆత్మహత్యలు చేసుకునేలా చేసినందుకు విమోచనం చేసుకొన్న దినం.

ఐదేళ్ల ఆ పాపాలు విధ్వంసం చెప్పుకోడానికి మరో ఐదేళ్లు కావాలి. ఎందుకంటే ప్రతి దినం పనికిమాలిన పిచ్చోడి దెబ్బకు విలవిలాడారు జనం. అడుగడుగునా గోతిలో పడుతూ.. తమ ఆస్తులకు ప్రాణాలకు సైతం ప్రమాదం ఈ వైకాపన్లు అని చాలా చాలా తెలివిగా కుమ్మేసిన వైకాపా విమోచన దినం.

చెంపలు తడిమి, జుట్టు సవరిస్తూ.. నటించి, అధికారం వచ్చాక ఐదేళ్లు ఇంట్లో పొదుగుతూ.. అప్పుడప్పుడు వచ్చి బానిసల్లా జనాన్ని పట్టుకు వచ్చి కందకాలు త్రవ్వి, గేట్లు పెట్టి తాళాలు వేసి హింసించిన పులివెందుల పులకేసిని, రాజకీయంగా కొలుకోకుండా పూడ్చిపెట్టిన దినం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి విభజన అయ్యాక కూడా చూపని కసితో జనం పోటెత్తి జగన్ పీడ విరగడ చేసుకొన్న దినం.

సంధింటి ఆడబిడ్డలు సైతం అర్థించిన విధంగా.. ఆశపడ్డ విధంగా.. చారిత్రాత్మక తీర్పును జనం అత్యంత తెలివిగా వెలువరించిన దినం.
ఇంకా జనం పిచ్చోళ్ళు తాము తెలివైన వాళ్లం అనుకొని పశ్చాత్తాపం లేని పాపాత్ములు వెన్నుపోటు దినం అంటూ బరితెగించి, శవాల కోసం ఆనందంగా.. పెళ్లిళ్ల కోసం పైశాచికంగా ప్రవర్తిస్తూ మరింత అసహ్యాన్ని మూటకట్టుకొంటూ.. మరింత పాతాళానికి వెళుతూ తమ సమాధిని తామే 11 మీటర్ల కంటే లోతుగా తవ్వుకొంటున్న వైకాపాకు ప్రగాఢ సానుభూతి.

చిత్రం : బలి ఇవ్వడానికి పసుపు పూసి, కుంకుమ పెట్టి, పూలు వేసి, ముస్తాబైన మేక లెక్కన వైకాపా వున్నా.. ఫలితాల ముందు రోజు బులుగు సాక్షి మేకపోతు గాంభీర్యంకు మరో మెట్టులో పొందుతున్న పైశాచిక ఆనందం.

LEAVE A RESPONSE